మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. మోటోరోలా ఎడ్జ్ సిరీస్‌లో మోటోరోలా ఎడ్జ్ 30 (Motorola Edge 30) మొబైల్ రిలీజైంది. ఇప్పటికే మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో (Motorola Edge 30 Pro) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాస్త తక్కువ ఫీచర్స్‌తో మోటోరోలా ఎడ్జ్ 30 మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కంపెనీ. గతేడాది రిలీజైన మోటోరోలా ఎడ్జ్ 20 అప్‌గ్రేడ్ వేరియంట్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ (Qualcomm Snapdragon 778+) ప్రాసెసర్ ఉంది. ఇటీవల క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కానీ మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్ ఉంది. దీంతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఓలెడ్ డిస్‌ప్లే, 4,020ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 450 యూరోలు. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.36,200. ఇండియాలో రూ.32,000 బడ్జెట్‌లో రిలీజ్ కావొచ్చని అంచనా. ప్రస్తుతం యూరప్ మార్కెట్లో రిలీజైన ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో ఇండియాకు రానుంది.
Realme GT 2: రియల్‌మీ జీటీ 2 ఫస్ట్ సేల్ కాసేపట్లో... తొలి సేల్‌లో రూ.5,000 డిస్కౌంట్
Say hello to the thinnest 5G smartphone - motorola edge 30 📱. Enjoy extraordinary photography, dual-speaker stereo sound, and a thin modern design. Learn more here: https://t.co/ocMxIs6HPZ#findyouredge pic.twitter.com/Rp2jkvhU07
— Motorola (@Moto) April 27, 2022
మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్, మోటో యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు.
Xiaomi 12 Pro: యాపిల్ ఐఫోన్‌కు పోటీగా షావోమీ 12 ప్రో... ప్రీమియం ఫీచర్స్ అదుర్స్
మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ చూస్తే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 50మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌లో 4,020ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫఉల్ ఛార్జ్ చేస్తే ఒకటిన్నర రోజు బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది.
ఇక ఇండియాలో ఇప్పటికే మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 60మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 68వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Moto, Motorola, Smartphone