మోటోరోలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మోటో ఈ7 స్మార్ట్‌ఫోన్‌ను యూరప్ మార్కెట్లో పరిచయం చేసింది మోటోరోలా. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. మోటోరోలా మొదట్నుంచి E సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోటో ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మోటో ఈ7 ప్లస్ ఇండియాలో కూడా లభిస్తోంది. ఇప్పుడు అదే సిరీస్‌లో మోటో ఈ7 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇక మోటో ఈ7 విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఉండవు. మోటో ఈ7 స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్ప్లే, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కొన్ని ఫీచర్స్ మోటో ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ లాగానే ఉన్నాయి. ఈ ఫోన్ ధర 119.99 యూరోలు. త్వరలోనే లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లో రిలీజ్ కానుంది. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు.
Phone Call: ఫోన్ కాల్ చేస్తున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోండి
రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...
మోటో ఈ7 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 1600x720 రెజల్యూషన్
ర్యామ్: 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ (10వాట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మినరల్ గ్రే, ఆక్వా బ్లూ, సాటిన్ కోరల్
ధర:
2జీబీ+32జీబీ- సుమారు రూ.10,500
ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో రూ.10,000 బడ్జెట్లో రెడ్మీ, రియల్మీ, ఒప్పో, వివో, సాసంగ్ నుంచి అనేక స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. రెడ్మీ 9 ప్రైమ్, రెడ్మీ 9, రియల్మీ 6, రియల్మీ నార్జో 20ఏ, రియల్మీ నార్జో 20, సాంసంగ్ గెలాక్సీ ఎం21 లాంటి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వీటికి మోటో ఈ7 స్మార్ట్‌ఫోన్ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.