Moto E40: మోటో ఇ40 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర రూ.10,000 లోపే

Moto E40: మోటో ఇ40 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర రూ.10,000 లోపే (image: Motorola India)

Moto E40 | ఇండియన్ మార్కెట్‌లో రూ.10,000 లోపు బడ్జెట్‌లో మోటో ఇ40 (Moto E40) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. మోటో ఇ40 మొబైల్ ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    లెనోవోకు చెందిన మోటోరోలా ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది. మోటో ఇ40 మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. రూ.10,000 లోపు సెగ్మెంట్‌లో మోటో ఇ40 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. మోటో ఇ40 (Moto E40) ధర రూ.9,499 మాత్రమే. కేవలం 4జీబీ ర్యామ్ + 64జీ స్టోరేజ్ వేరియంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. గతవారం యూరప్ మార్కెట్‌లో 149 యూరోలతో మోటో ఇ40 మోడల్ లాంఛ్ అయింది. అంటే సుమారు రూ.13,000 ధరతో రిలీజ్ అయింది. కానీ ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.9,499 ధరతో రిలీజ్ కావడం విశేషం. ట్రిపుల్ కెమెరా సెటప్, యూనిసోక్ టీ700 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. మోటో ఇ40 సేల్ అక్టోబర్ 17 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో మొదలవుతుంది.

    లో బడ్జెట్ సెగ్మెంట్‌లో మోటో ఇ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు అదే సిరీస్‌లో అదే బడ్జెట్‌లో మోటోరోలా మోటో ఇ40 రావడం విశేషం. రూ.10,000 లోపు బడ్జెట్‌లో ఇండియాలో ఇప్పటికే రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25వై, పోకో సీ31, రియల్‌మీ నార్జో 50ఏ, పోకో ఎం3, సాంసంగ్ గెలాక్సీ ఎం12, ఇన్ఫీనిక్స్ హాట్ 11 లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్‌కు మోటో ఇ40 గట్టి పోటీ ఇవ్వనుంది.

    WhatsApp: అలర్ట్... ఈ తప్పు చేస్తే వాట్సప్ బ్లాక్ అయిపోతుంది జాగ్రత్త


    మోటో ఇ40 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 4జీబీ+64జీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. మోటో ఇ40 స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల మ్యాక్స్ విజన్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ యూనిసోక్ టీ700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

    Vivo Y20T: బడ్జెట్ ధరలో వివో వై20టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

    మోటో ఇ40 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. కెమెరాలో పోర్ట్‌రైట్ మోడ్, పనోరమా, ఫేస్ బ్యూటీ, హెచ్‌డీఆర్ నైట్ విజన్, మ్యాక్రో విజన్, ప్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మోటో ఇ40 స్మార్ట్‌ఫోన్‌ను కార్బన్ గ్రే, పింక్ క్లే కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: