హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Moto E32s: మోటొరోలా నుంచి మోటో E32s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. దీని ధర, ఫీచర్ల వివరాలు..

Moto E32s: మోటొరోలా నుంచి మోటో E32s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. దీని ధర, ఫీచర్ల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటొరోలా (Motorola) నుంచి కొత్త ఫోన్ రిలీజ్ అయింది. ఈ కంపెనీ మోటో E సిరీస్‌లో E32s (Moto E32s) డివైజ్‌ను లాంచ్ చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ 90Hz డిస్‌ప్లేతో సహా ఇతర టాప్ ఫీచర్లతో వస్తుంది.

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటొరోలా (Motorola) నుంచి కొత్త ఫోన్ రిలీజ్ అయింది. ఈ కంపెనీ మోటో E సిరీస్‌లో E32s (Moto E32s) డివైజ్‌ను లాంచ్ చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ 90Hz డిస్‌ప్లేతో సహా ఇతర టాప్ ఫీచర్లతో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చిన ఈ డివైజ్(Devise) ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ ఓఎస్‌తో రన్ అవుతుంది. ఇతర మోటొరోలా ఫోన్‌ల మాదిరిగానే మోటో E32s వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో రానుంది. కొత్త మోటొరోలా ఫోన్ రెండు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఈ ఫోన్ ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయిన Moto E32 వేరియంట్‌కు అప్‌గ్రేడెడ్(Upgraded) వెర్షన్‌గా(Version) కనిపిస్తుంది.

* మోటో E32s ధర, లభ్యత

మోటో E32s ధర EUR 149.99 (దాదాపు రూ. 12,400) వద్ద ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో భారతదేశం, జపాన్‌ మార్కెట్లలోకి వస్తుందని కంపెనీ తెలిపింది. తాజా ఫోన్ మిస్టీ సిల్వర్, స్లేట్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇండియాలో E32s లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఇటీవల మోటో E32s గురించి ఒక ట్వీట్ చేశారు. ఈ డివైజ్ మే 27, శుక్రవారం నాడు ఇండియన్ మార్కెట్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మోటో E32 ఫోన్ యూరోప్‌లో EUR 149 (సుమారు రూ. 12,300) వద్ద రిలీజ్ అయింది. ఇది సింగిల్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ మోడల్.

WhatsApp: ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టిన వాట్సప్... యూజర్లకు గుడ్ న్యూస్

* మోటో E32s స్పెసిఫికేషన్స్

మోటో E32s డివైజ్ My UXతో Android 12 ఓఎస్‌తో రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 3GB, 4GB RAM ఆప్షన్లతో పాటు ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G37 SoC చిప్ ద్వారా పనిచేస్తుంది. మోటో E32s ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకుంటుంది. 16-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో f/2.2 లెన్స్‌తో పాటు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో మూడు కెమెరాలు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. సెల్ఫీలు, వీడియో చాట్స్ కోసం f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను అందించారు.

మోటో E32s ఫోన్ 32GB, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా (1TB వరకు) స్టోరేజ్ పొడిగించుకోవచ్చు. మోటో E32s కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్, FM రేడియో, GPS/ A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంటుంది.

First published:

Tags: 5G Smartphone, Moto, Motorola, Smartphones

ఉత్తమ కథలు