MOTO DAYS SALE BEGINS ON FLIPKART GET HUGE DISCOUNT ON MOTO G31 MOTOROLA EDGE 20 FUSION AND OTHER MOBILES SS
Moto Days Sale: మోటోరోలా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే
Moto Days Sale: మోటోరోలా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే
(image: Motorola India)
Moto Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. మోటో డేస్ సేల్‌లో మోటోరోలా మొబైల్స్‌పై (Motorola Mobiles) తగ్గింపుతో పాటు బ్యాంకు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
మోటోరోలా స్మార్ట్ఫోన్లు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా స్మార్ట్ఫోన్లపై (Smartphone Offers) భారీ డిస్కౌంట్ లభిస్తోంది. మోటో డేస్ సేల్ (Moto Days Sale) ప్రారంభమైంది. ఈ సేల్ మే 18న ముగుస్తుంది. మోటోరోలా గతేడాది రిలీజ్ చేసిన మొబైల్స్‌తో పాటు ఈ ఏడాది తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్లపైనా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మోటోరోలా డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మరి ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది? ఆఫర్స్ ఏంటీ? తెలుసుకోండి.
Moto G31: మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ అసలు ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. మోటో డేస్ సేల్‌లో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
మోటో జీ31 స్మార్ట్‌ఫోన్‌లో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల హెచ్డీ+ ఓలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్, ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Moto G60: మోటో జీ60 స్మార్ట్‌ఫోన్ అసలు ధర చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999. ఆఫర్ ధర రూ.14,999. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
మోటో జీ60 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.8 అంగుళాల హోల్‌పంచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, టర్బోపవర్ 20 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Motorola Edge 20 Fusion: మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ అసలు ధరలు చూస్తే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. సేల్‌లో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Moto E40: మోటో ఇ40 స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్లో లభిస్తుంది. 4జీబీ ర్యామ్ + 64జీ స్టోరేజ్ ధర రూ.9,999 మాత్రమే. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.