Home /News /technology /

MOTO AGAIN NEW 5G SMART PHONE LAUNCH FEATURES PRICE KEKO KEKA UMG GH

Moto G62 5G: మళ్లీ మెరిసిన మోటో.. కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ఫీచర్స్, ధర కేకో కేక !

 మళ్ళీ మెరిసిన మోటో.. కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ఫీచర్స్, ధర కేకో కేక !

మళ్ళీ మెరిసిన మోటో.. కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ఫీచర్స్, ధర కేకో కేక !

స్మార్ట్‌ బ్రాండ్ మోటొరోలా (Motorola) ఇండియన్ మార్కెట్లో మరో స్మార్ట్‌ఫోన్‌(Smart phone)ను లాంచ్ చేసింది. తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లతో ఫోన్లను రిలీజ్ చేసే ఈ కంపెనీ.. మోటో జీ62 (Moto G62) పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్‌ను మన దేశంలో విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
స్మార్ట్‌ బ్రాండ్ మోటొరోలా (Motorola) ఇండియన్ మార్కెట్లో మరో స్మార్ట్‌ఫోన్(smart Phone)ను లాంచ్ చేసింది. తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లతో ఫోన్లను రిలీజ్ చేసే ఈ కంపెనీ.. మోటో జీ62 (Moto G62) పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్‌ను మన దేశంలో విడుదల చేసింది. ఈ బడ్జెట్ 5G ఫోన్‌లో టాప్ రేంజ్ ఫీచర్ల(features)ను అందించింది. ఈ లిస్ట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరాలు, 5,000mAh బ్యాటరీతో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. దీని ధర(Price), ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

ధర ఎంత?
మోటో G62 5G ఫోన్ బేస్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇండియాలో రూ.17,999 ధరతో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. మోటో G62 ఫోన్ సేల్స్ ఆగస్టు 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈ డివైజ్ ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో సేల్‌కు అందుబాటులో ఉంటుంది. మిడ్‌నైట్ గ్రే, ఫ్రాస్టెడ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో హ్యాండ్‌సెట్ లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు
మోటో G62 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB వరకు RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో లభిస్తుంది. దీంట్లో 5,000mAh బ్యాటరీతో ఉంటుంది. 20W ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మోటో G62 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ క్వాడ్-ఫంక్షన్ కెమెరా, 8-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ముందుభాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే మోటో G62 ఫక్షన్ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది. IP52 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది.



రెండు రోజుల్లో కొత్త ఫోన్
మోటొరోలా ఈ వారం ప్రారంభంలో ఇండియాలో Moto G32 అనే మరో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రెండు రోజుల వ్యవధిలోనే కంపెనీ Moto G62 5G పేరుతో మరో ఫోన్‌ను లాంచ్ చేయడం విశేషం. మోటో G32 ఒక బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్‌గా రిలీజ్ అయింది. ఇండియాలో దీని ధర రూ. 12,999. ఆగస్టు 10, మంగళవారం నాడు రిలీజ్ అయిన ఈ డివైజ్.. 4GB RAM + 64GB స్టోరేజ్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: 5g smart phone, Budget smart phone, Motorola, Tech news

తదుపరి వార్తలు