హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mother’s Day 2022: మీ అమ్మగారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనకుంటున్నారా? అయితే.. ఈ ఐదు బెస్ట్ ఆప్షన్లపై ఓ లుక్కేయండి

Mother’s Day 2022: మీ అమ్మగారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనకుంటున్నారా? అయితే.. ఈ ఐదు బెస్ట్ ఆప్షన్లపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మథర్స్ డే (Mothers Day) సందర్భంగా మీ తల్లుల కోసం ప్రత్యేక బహుమతులు కొనుగోలు చేయాలని అనేక మంది ఆలోచిస్తుంటారు. ఇప్పటికీ అమ్మకు ఏది బహుమతిగా అందించాలనే దానిపై స్పష్టత లేకుంటే.. రూ.10,000 లోపు అందుబాటులో ఉన్న ఈ ఐదు ఉత్పత్తులను పరిశీలించండి.

ఇంకా చదవండి ...

మే 8వ తేదీన మాతృ దినోత్సవం (Mother’s Day 2022) జరుపుకుంటున్నారు. చాలా మంది ఈ సందర్భంగా తల్లుల కోసం ప్రత్యేక బహుమతులు (Gifts) కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటారు. ఇప్పటికీ అమ్మకు ఏది బహుమతిగా అందించాలనే దానిపై స్పష్టత లేకుంటే.. రూ.10,000 లోపు అందుబాటులో ఉన్న ఈ ఐదు ఉత్పత్తులను (Mother’s Day Gift Items) పరిశీలించవచ్చు. ప్రత్యేక దినం రోజు తల్లి ముఖంలో చిరునవ్వు చూడవచ్చు.

రూ.10,000లోపు లభించే 5 ఉత్తమ బహుమతులు ఇవే..

స్మార్ట్‌ఫోన్‌

తల్లికి కొత్త ఫోన్ అవసరమని అనిపిస్తే, ఆమె కోసం ఒక ఫోన్ కొనడం మంచి ఆలోచన. ఉత్తమ బహుమతులలో ఒకటి అవుతుంది. నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ అనేది చాలా ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. బడ్జెట్ రూ.10,000 అయితే Realme Narzo 30Aని కొనుగోలు చేయవచ్చు. రూ.13,000 ఖర్చు చేయగలిగితే, Redmi Note 10Sని పరిశీలించవచ్చు. ఇది అమెజాన్‌లో రూ.13,999కి అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్న రూ.1,500 తగ్గింపు కూపన్‌ను కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో రూ.12,499కే ఫోన్‌ను సొంతం చేసుకొనే అవకాశం లభిస్తుంది. ఇది 5G స్మార్ట్‌ఫోన్ కాదు, డిసెంబర్ 2021లో తిరిగి లాంచ్ అయింది.

Mother's Day: రేపు మీ అమ్మకు ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వండి.. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది..

వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు

వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్‌లు కూడా బహుమతి ఇవ్వడానికి బావుంటాయి. పాతకాలంలో వైర్డు ఇయర్‌ఫోన్‌లు ఉపయోగించేవారు. ఇంట్లో తల్లి పని చేస్తున్నప్పుడు కూడా వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్‌లతో కాల్‌లు మాట్లాడవచ్చు. పాటలు వినగలరు. మదర్స్‌ డే సందర్భంగా Soundcore Air 2 Proని కొనుగోలు చేయవచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కి సపోర్ట్‌ చేస్తుంది. నాయిస్‌ని ఫిల్టర్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఆడియో నాణ్యత కూడా బావుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.7,999. బడ్జెట్ దాదాపు రూ. 2,000 అయితే OnePlus Bullets Wireless Z2ని కొనుగోలు చేయవచ్చు. అయితే ఇది నెక్‌బ్యాండ్-శైలి డిజైన్‌ను కలిగి ఉంది.

Mother's Day Gift Ideas: వావ్.. రూ.500కే అమ్మకోసం అద్భుతమైన గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో..

స్మార్ట్ ల్యాంప్‌

రాత్రిపూట పుస్తకాలు చదవడం తల్లికి ఇష్టమైతే, ఆమెకు మంచి ల్యాంప్‌ కొనవచ్చు. స్మార్ట్ ల్యాంప్ ఉత్తమ ఎంపిక. అమెజాన్‌లో రూ.2,799 ధరతో అందుబాటులో ఉన్న Xiaomi Mi స్మార్ట్ బెడ్‌సైడ్ ల్యాంప్ 2ని కొనుగోలు చేయవచ్చు. కంపెనీ తన స్మార్ట్ ల్యాంప్ 11 సంవత్సరాల దీర్ఘాయువును అందిస్తుందని, ల్యాంప్‌ కలర్‌, కాంతిని మార్చుకొనే సదుపాయం ఉందని పేర్కొంది. ఫ్లో మోడ్, టచ్-ప్యానెల్‌ కూడా ఉన్నాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. Mi స్మార్ట్ బెడ్‌సైడ్ లాంప్ 2ని కంపెనీ Mi Home యాప్‌ ద్వారా వినియోగించవ్చు.

స్మార్ట్ స్పీకర్

ఇంట్లో పాటలు వినడానికి తల్లి ఇష్టపడితే స్మార్ట్ స్పీకర్ కొనడం మంచి ఆలోచన. స్మార్ట్ స్పీకర్ కేవలం పాటలను ప్లే చేయడమే కాకుండా చాలా పనులు చేయగలదు. Amazon ఎకో షో 5ని కొనుగోలు చేస్తుంటే.. స్పీకర్‌లో వీడియోలు లేదా టీవీ షోలను చూడగలుగుతారు. స్మార్ట్ బల్బ్, స్మార్ట్ టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు వంటి గృహోపకరణాలను కూడా వారి వాయిస్‌ని ఉపయోగించి నియంత్రించవచ్చు. దీని ధర రూ.4,499. చిన్న 5.5-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. పెద్ద స్క్రీన్ కావాలంటే, Amazon Echo Show 8ని పరిశీలించవచ్చు. ఇది సైట్‌లో రూ.9,999కి లభిస్తుంది.

స్మార్ట్ వాచ్

చివరగా స్మార్ట్ వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు. Mi band 6, Amazfit Bip U Pro, Amazfit Bip S Lite, Realme Watch 2 Pro వంటివి ఉన్నాయి. ఇవి రోజువారీ నిద్ర విధానాలు, హృదయ స్పందన రేటు, SpO2ను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి.

First published:

Tags: Gifts, Happy mothers day, Mothers day