సాంకేతిక అద్భుతం..చనిపోయిన బిడ్డను కలిసిన తల్లి..

Virtually Reality : ఇదే సాంకేతిక అద్భుతం. చనిపోయిన వాళ్లను తలచుకుంటూ... భారమైన మనసుతో జీవిస్తుంటారు చాలా మంది. అలాంటి వాళ్లకు వర్చువల్ రియాలిటీలో ఎంతో కొంత సాంత్వన పొందనున్నారు.

news18-telugu
Updated: February 15, 2020, 9:16 AM IST
సాంకేతిక అద్భుతం..చనిపోయిన బిడ్డను కలిసిన తల్లి..
2016 చనిపోయిన పాప... వర్చువల్ రియాలిటీలో కూతుర్ని కలిసిన తల్లి... (credit - YT - MBCLife)
  • Share this:
కొరియా టెలివిజన్ షో సాంకేతిక పరిజ్ఞానంతో ఓ అద్భుతం చేసింది.  వర్చువల్ రియాల్టీ టెక్నాలజీని ఉపయోగించి... 2016లో చనిపోయిన ఏడేళ్ల పాపను తలుచుకుంటూ తల్లడిల్లిపోతున్న తల్లి కళ్ల ముందు నిలబెట్టింది. నిజమైన కూతురిలాగే ఉంటూ... అలాగే మాట్లాడుతున్న ఆ పాపను తన సెన్సిటివ్ గ్లోవ్స్‌తో వర్చువల్ రియాలిటీలో టచ్ చేస్తూ... ఎంతో సాంత్వన ఫీలైంది ఆ పాప తల్లి. చనిపోయిన కూతురితోనే మాట్లాడుతున్నట్లు, చనిపోయిన కూతురినే పట్టుకొని నిమురుతున్నట్లు కడుపుకోత బాధను మరిచి గొప్ప అనుభూతి చెందింది ఆ పేగుబంధం. ఈ వర్చువల్ రియాలిటీ షో పేరు మీటింగ్ యు (Meeting You). ఏడేళ్ల నేయోన్... 2016లో గుర్తు తెలియని ఓ వ్యాధితో చనిపోయింది. అలాంటి ఆ పాప ఇప్పుడు వర్చువల్ రియాలిటీలో తన తల్లిని కలిసింది. మాట్లాడింది. తాను సంతోషంగా ఉన్నాననీ, తన గురించి ఏడవవద్దని తల్లిని ఓదార్చుతూ ఆడుకుంది ఆ పాప. కళ్ల ముందు కూతురి లాగే కనిపిస్తున్న పాప... తనతో మాట్లాడుతుంటే... అచ్చం తన కూతురే మాట్లాడుతున్నట్లు ఫీలవుతూ... ఎంతో ఆనందపడింది ఆ తల్లి.



సైకాలజీ నిపుణులు మాత్రం ఈ రియాలిటీ షోను తప్పుపడుతున్నారు. పైకి ఇది ప్రయోజనం కలిగించే ప్రయోగంలా ఉన్నా... దీన్ని ఆ టీవీ ఛానెల్... ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూపొందించిందనీ, ఇలా మనుషుల భావోద్వేగాల్ని క్యాష్ చేసుకోవడం కరెక్టు కాదంటున్నారు. పాప తల్లి జాంగ్ జి సంగ్ మాత్రం షోపై వస్తున్న విమర్శల్ని కొట్టిపారేస్తున్నారు. వర్చువల్ రియాలిటీ (VR) హెడ్ సెట్‌తో తాను తన కూతుర్ని చూసిన ఫీల్ పొందాననీ, తన కూతురి లాంటి ఆకారం... తనతో మాట్లాడుతూ, గడ్డిలో ఆడుకుంటూ, చక్కగా నిద్రపోతుంటే... తనకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనని అంది.

2016 చనిపోయిన పాప... వర్చువల్ రియాలిటీలో కూతుర్ని కలిసిన తల్లి... (credit - YT - MBCLife)


ఇంత చక్కగా కూతురి వర్చువల్ డిజిటల్ గ్రాఫిక్ బొమ్మను కొరియాకి చెందిన మున్వా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ లేదా MBC తయారుచేసింది. పాప రూపం, హైట్, బాడీ, మాట అన్నీ చనిపోయిన పాప లాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ షో చూసిన నేయోన్... తండ్రి, సోదరుడు, సోదరి కూడా తల్లిలాగే కన్నీళ్లు పెట్టారు. ఇదో మేజికల్ జర్నీలా ఉందన్నారు.

2016 చనిపోయిన పాప... నేయోన్‌లా కనిపించే వర్చువల్ రియాలిటీ ఆకారం (credit - YT - MBCLife)


నెటిజన్లు కూడా ఈ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు. అయినవాళ్లను కోల్పోతే కలిగే బాధను అలాగే భరిస్తూ బతికే కంటే... ఇలాంటి వర్చువల్ రియాలిటీ షో ద్వారా కొంతైనా దాన్ని తగ్గించుకోవచ్చనీ, ఇందులో ఎవర్నీ తప్పుపట్టాల్సిన పని లేదని అంటున్నారు. ఈ షో కోసం ఇంతలా ఖర్చు పెట్టిన ఆ టీవీ ఛానెల్... దాన్ని అందరికీ చూపించి... అయిన ఖర్చును రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తే తప్పేముందని అంటున్నారు. పైగా... ఇలాంటి షో చూసిన చాలా మంది... తమ వారిని కూడా ఇలా చూసుకునేందుకు ముందుకు వస్తారని అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: February 15, 2020, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading