#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?

పిల్లల ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్న తల్లిదండ్రులకు ఇది ఓ హెచ్చరిక. ఇలాంటి పోస్టులు చివరకు తల్లిదండ్రుల్ని చిక్కుల్లో పడేస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.

news18-telugu
Updated: August 29, 2018, 11:18 AM IST
#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?
10 అంకెలను 11 అంకెలకు పెంచడం వల్ల దేశంలో మొత్తం 10 బిలియన్ల కొత్త నెంబర్లు అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది. (Jiangang Wang / Contributor/ Getty Images)
  • Share this:
ఆన్‌లైన్‌లో పిల్లల ఫోటోలు షేర్ చేస్తే చివరికి అవి అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తాయని చాలామంది తల్లిదండ్రులకు తెలుసు. అయినా ఆ అలవాటు మానుకోరని, ఇప్పటికీ తమ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారని సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ నిర్వహించిన సర్వేలో తేలింది. 'ది ఏజ్ ఆఫ్ కన్సెంట్' పేరుతో సర్వే నిర్వహించింది మెకాఫీ సంస్థ. ఇండియాలో 40.5 శాతం మంది(ఎక్కువగా ముంబైలో) తమ పిల్లల ఫోటోలు, వీడియోలు రోజుకు ఒక్కసారైనా సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తామని చెప్పారు. 36 శాతం మంది వారానికోసారి పోస్ట్ చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం వల్ల అపరిచితుల నుంచి వేధింపులు(16.5 శాతం), వెంటపడటం(32 శాతం), కిడ్నాప్(43 శాతం), సైబర్ బెదిరింపులు (23 శాతం) ఉంటాయని ఆ తల్లిదండ్రులు వెల్లడించడం మరో విశేషం. అయితే 62 శాతం మంది తమ పిల్లల అనుమతి లేకుండానే ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నామని చెప్పడం విశేషం.

పిల్లల ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తే అవి అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తాయని 76 శాతం మంది తల్లిదండ్రులకు అవగాహన ఉండటం విచారకరం. పిల్లల ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసేందుకు వారి అనుమతి అవసరం లేదని ముంబై(66.5 శాతం), ఢిల్లీ (61 శాతం), బెంగళూరు (55 శాతం) మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఏం పోస్ట్ చేయాలి, దాని వల్ల వచ్చే నష్టాలేంటి అన్ని విషయాలను తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని మా సర్వేలో తేలింది.

వెంకట్ కృష్ణపూర్, మెకాఫీ మేనేజింగ్ డైరెక్టర్


అయితే తల్లిదండ్రుల సోషల్ మీడియా అలవాట్లు చివరకు పిల్లల్ని ప్రమాదంలో పడేస్తుందన్నది వాస్తవం. పిల్లలు స్కూల్ యూనిఫామ్‌తో ఉన్న ఫోటోలతో పాటు లొకేషన్‌ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటే... వారికి సంబంధించిన వివరాలన్నీ ప్రపంచానికి వెల్లడిస్తున్నట్టే. ఇలాంటి వ్యక్తిగత సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తే అవి నేరాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇలా ఎక్కువగా తమ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అలవాటు బెంగళూరువాసులకు ఉంది. ఆ జాబితాలో బెంగళూరు(59 శాతం), ముంబై(57 శాతం), ఢిల్లీ(48.5 శాతం) ఉన్నాయి. తమ పిల్లల ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల రిస్క్ ఉందని తెలిసినా తల్లిదండ్రులు ఆ అలవాటు మానుకోలేకపోవడం విచారకరం.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్, యాప్స్ యూజర్ల లొకేషన్‌ని అప్‌లోడ్ చేసిన ఫోటోలతో పాటు ట్యాగ్ చేస్తుంటాయి. తల్లిదండ్రులు ఈ ఫీచర్‌ని ఆఫ్ చేసుకోవడం మంచిది. దీని ద్వారా లొకేషన్ వివరాలు ఇతరులకు తెలియవు. ముఖ్యంగా ఇంట్లోంచి ఫోటోలు పోస్ట్ చేసేప్పుడు లొకేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వెంకట్ కృష్ణపూర్, మెకాఫీ మేనేజింగ్ డైరెక్టర్


ముంబై, ఢిల్లీ, బెంగళూరులో 16 ఏళ్లలోపు పిల్లలున్న వెయ్యి మంది తల్లిదండ్రులతో మెకాఫీ ఈ సర్వే చేసింది. అయితే తండ్రుల కన్నా తల్లులే ఈ విషయంలో ఎక్కువగా కంగారుపడుతుంటారని ఈ సర్వేలో తేలింది. తాము పిల్లల ఫోటోలు పోస్ట్ చేయమని 47 శాతం మంది తల్లులు చెబుతుంటే, తండ్రుల సంఖ్య 38 శాతం మాత్రమే ఉంది. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు పోస్ట్ చేయాలనుకుంటే అవి ఎవరి కోసం చేస్తున్నారో తల్లిదండ్రులకు ఆ స్పష్టత ఉండాలి.
Published by: Santhosh Kumar S
First published: August 29, 2018, 11:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading