Home /News /technology /

MOST EXPENSIVE THING ON THE APPLE THING ONLINE STORE IS MAC PRO AK GH

Apple Online Store: యాపిల్ ఆన్‌లైన్ స్టోర్.. అత్యంత ఖరీదైనది ఇదే

Apple Online Store: 
(ప్రతీకాత్మక చిత్రం)

Apple Online Store: (ప్రతీకాత్మక చిత్రం)

Apple Online Store: యాపిల్ ఇండియా ఆన్‌లైన్‌స్టోర్‌లో అత్యంత ఖరీదైన యూనిట్ సూపర్ కాన్ఫిగర్ మ్యాక్ ప్రో నే కావడం విశేషం.

భారత్‌లో ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన యాపిల్ ఇండియా, వినియోగదారులకు ఉత్పత్తులను చేరువ చేస్తోంది. యాపిల్ ఇండియా ఆన్‌లైన్‌స్టోర్‌లోకి వెళితే మీకు చాలా ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. బ్రౌజింగ్ లిస్ట్లో ఐఫోన్, కొత్త మ్యాక్బుక్, ఐప్యాడ్ లేదా ఐప్యాడ్ ప్రో, ఎయిర్ ప్యాడ్స్, ఎయిర్ ప్యాడ్స్ ప్రో... వంటివి మిమ్మల్ని ఆకర్షించవచ్చు. కానీ అన్నింటికంటే విలువైన యాపిల్ మ్యాక్ గురించి తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. కొత్త యాపిల్ ఐ మ్యాక్ ఇప్పుడు 27-అంగుళాల అప్‌డేట్‌తో లభిస్తుంది. దీనికి స్పెక్డ్ అప్ ఫినిషింగ్, అదనంగా జోడించిన హార్డ్వేర్ అప్‌డేట్‌తో కలిపి కొత్తగా యాపిల్ మ్యాక్ ప్రో మోడల్‌ను సంస్థ విడుదల చేసింది. దీని ధర రూ.53,02,800. దీన్ని బుక్ చేసుకుంటే, రెండు వారాల్లోనే డెలివరీ చేస్తారు. మ్యాక్బుక్, ఐ- మ్యాక్, మ్యాక్ కంప్యూటింగ్ డివైజ్‌లకు యాపిల్ మ్యాక్ కాన్ఫిగర్ ఆప్షన్‌ను అందిస్తోంది. యాపిల్ ఇండియా ఆన్‌లైన్‌స్టోర్‌లో అత్యంత ఖరీదైన యూనిట్ సూపర్ కాన్ఫిగర్ మ్యాక్ ప్రో నే కావడం విశేషం.

అన్నీ ప్రత్యేకమే
ఇప్పటివరకు ఉన్న మ్యాక్ కంప్యూటింగ్ డివైజ్‌లో యాపిల్ మ్యాక్ ప్రో అత్యంత శక్తివంతమైనది. అల్యూమినియం హౌసింగ్‌తో, స్టెయిన్లెస్-స్టీల్ స్పేస్ ఫ్రేమ్‌తో దీన్ని రూపొందించారు. దీని డిజైన్ అప్‌గ్రేడ్ భాగాలను యాక్సెస్ చేయడానికి వీలుగా ఉంటుంది. వివిధ రకాల ప్రాసెసర్లను దీనికి యాక్సెస్ చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన 28-కోర్స్ ఇంటెల్ జియాన్ W ప్రాసెసర్‌ను కూడా దీనికి ఎంచుకోవచ్చు. డివైజ్ వేడెక్కకుండా చేసే ప్రత్యేకమైన యంత్రాంగం ఇందులో ఉంటుంది. ప్రాసెసర్ వేడెక్కకుండా కాపాడేందుకు వేడి పైపులతో హీట్ సింక్ నిర్మాణం కూడా ఇందులో ఉంటుంది. మూడు యాగ్జిల్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. దీని పనితీరుకు కొన్ని అప్‌గ్రేడ్ అవసరమవుతాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు వివిధ ఆప్షన్లతో ఇది లభిస్తుంది.

మోడల్ ఏదైనా అదే పనితీరు
మ్యాక్ సిరీస్‌లో తక్కువలో లభించే మ్యాక్ ప్రో- ర్యాక్ వేరియంట్ ధర రూ.5,49,900 రూపాయలు. టవర్ స్టైల్ ఆప్షన్‌లో రూ.4,99,900కు లభిస్తుంది. 3.5GHz 8‑ కోర్ ఇంటెల్ జియాన్ W ప్రాసెసర్, 32GB మెమరీ, 8GB GDDR5 మెమరీ, రేడియన్ ప్రో 580X గ్రాఫిక్స్, 256GB SSD స్టోరేజీ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. లైఫ్ టైమ్ కంప్యూటింగ్ డివైజ్‌కు ఇది వినియోగదారులకు సేవలందిస్తుంది.

అప్‌గ్రేడ్ కలిపితేనే అంత ధర
యాపిల్ మ్యాక్ ప్రో డివైజ్‌కు ప్రాసెసర్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 3.3GHz 12 ‑ కోర్ ఇంటెల్ జియాన్ W ప్రాసెసర్ (రూ.1,00,000), 3 3.2GHz 16‑ కోర్ ఇంటెల్ జియాన్ W ప్రాసెసర్ (రూ.2,00,000), 2.7GHz 24 -కోర్ ఇంటెల్ జియాన్ డబ్ల్యూ ప్రాసెసర్ (రూ.6,00,000), 2.5GHz 28‑ కోర్ ఇంటెల్ జియాన్ W ప్రాసెసర్ (రూ.7,00,000) ఈ జాబితాలో ఉన్నాయి. RAM మెమరీ అప్‌గ్రేడ్ ఆప్షన్లలో డిఫాల్ట్గా 32GB DDR4 ECC మెమరీ నుంచి 1.5TB వరకు దేనినైనా ఎంచుకోవచ్చు. 1.5TB మెమరీకి అదనంగా రూ.10,00,000 ఖర్చు అవుతుంది. అత్యుత్తమ గ్రాఫిక్స్ కోసం 2x32GB HBM2 మెమరీ- టూ రేడియన్ ప్రో వేగా II డుయోను ఎంచుకోవచ్చు. దీని ధర రూ.10,80,000. అత్యధిక స్టోరేజీని అందించే 8 టిబి ఎస్ఎస్డి ధర రూ.2,60,000. ఇవన్నీ కలిపితే తయారయ్యే అత్యుత్తమ యాపిల్ మ్యాక్ ప్రో ధర రూ.53,02,800 అవుతుంది. దీనికి వెచ్చించే డబ్బుతో మన దేశంలోని నగరాల్లో ఒక అపార్ట్’మెంట్ కొనుగోలు చేయొచ్చు. పనితీరు పరంగా దీనికి ఇతర కంప్యూటర్లు ఏమాత్రం సాటిరావు.

ఆన్‌లైన్‌లో అప్‌గ్రేడ్ ఆప్షన్
మ్యాక్బుక్, ఐమ్యాక్, మ్యాక్ కంప్యూటింగ్ డివైజ్‌కు యాపిల్ మ్యాక్ కాన్ఫిగర్ ఆప్షన్ను అందిస్తుంది. అవసరాన్ని బట్టి Mac కంప్యూటింగ్ డివైజ్‌ను ఎంచుకోవచ్చు. ఐమ్యాక్ 25-అంగుళాలు, ఐమ్యాక్ 27-అంగుళాలు, ఐమ్యాక్ ప్రో, మ్యాక్ ప్రో, మ్యాక్ మినీ, మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో 13, మ్యాక్బుక్ ప్రో 16.. వంటివి కొనుగోలు చేసే ఎవరైనా యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో కాన్ఫిగర్ టు ఆర్డర్ ఎంపికను సద్వినియోగం చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, గ్రాఫిక్స్ వంటి స్పెసిఫికేషన్లను అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంటుంది. అప్‌గ్రేడ్‌ను బట్టి మ్యాక్ ధర మారుతుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Apple

తదుపరి వార్తలు