ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. పోకో ఎఫ్ 3 జిటి పేరుతో ఇది విడుదల కానుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ డేట్, ధర విషయాలపై ఆన్లైన్లో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, కంపెనీ ఇప్పటివరకు ఈ స్మార్ట్‌ఫోన్ గురించి అధికారింగా ఎటువంటి వివరాలు ప్రకటించలేదు. కాగా, పోకో సంస్థలో పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్ తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధరపై లీకులు ఇచ్చాడు. ఇది భారత్‌తో సుమారు రూ .30 వేల ధర వద్ద విడుదల కానుందని తెలిపాడు. ఇక, స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌పై కూడా స్పష్టత లేనప్పటికీ.. ఇది ఆగస్టు లేదా సెప్టెంబరులో మార్కెట్లోకి వస్తుందని పోకో ఇండియా డైరెక్టర్ అనుజ్ శర్మ ఇటీవల లీకులు ఇచ్చారు. ధర, లభ్యత వంటి మిగతా వివరాలన్నీ పోకో ఎఫ్ 3 జిటి అధికారిక లాంచింగ్ తేదీనే వెల్లడించనున్నట్లు తెలిపారు.
అయితే జూలై 22 న పోకో ఎఫ్ 3జిటీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతున్నట్లు వచ్చిన పుకార్లను ఆయన ఆయన ఖండించారు. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ .30 వేల వద్ద ఉంటుందని శర్మ తెలిపారు. ఏదేమైనప్పటికీ, ఇదే ధరలో లభించే ఇతర స్మార్ట్ఫోన్ల కన్నా దీనిలో అద్భుతమైన ఫీచర్లను అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
రెడ్మీ కే40 రీబ్రాండ్ వెర్షన్‌గా..
అయితే, పోకో ఎఫ్ 1తో పోలిస్తే పోకో ఎఫ్ 3 జిటి ధర చాలా ఎక్కువని చెప్పవచ్చు. కాగా, ఇటీవల చైనా మార్కెట్లో రిలీజైన రెడ్మీ కే 40 గేమ్ ఎన్హాన్స్డ్ ఎడిషన్‌కు రీ బ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలొస్తున్నాయి. అంటే రెడ్మీ కే 40 గేమింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లే దీనిలోనూ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన రెడ్మీ కే 40 ఫీచర్లను పరిశీలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఎస్ఓసీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీనిలో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఇది 67 W వైర్డ్ ఫాస్ట ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,065 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే, దీని వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చేర్చింది. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా వంటివి అందించింది. ఇక, దీని ముందు భాగంలో16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: POCO