రెడ్ మి మొబైల్ (Redmi Mobiles) లవర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షియోమి నోట్ 10, నోట్ 11 సిరీస్ ఫోన్ల వివరాలు లీక్ అయ్యాయి. ఈ రెండు సిరీస్‌ల స్మార్ట్ఫోన్లు ఈ సంవత్సరంలోనే భారత మార్కెట్లలోకి విడుదల కానున్నాయి. ఈ ఫిబ్రవరిలో రెడ్మి నోట్ 10 సిరీస్ వేరియంట్‌ను ఆ సంస్థ అందుబాటులోకి తీసుకురానుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా షియోమి ఒకేసారి రెండు నోట్ సిరీస్ డివైజ్‌లను విడుదల చేస్తోంది. కానీ 2020లో మాత్రం రెడ్మి నోట్ 9 సిరీస్‌ను మాత్రమే విడుదల చేసింది. తాజాగా రెడ్మి నోట్ 10 (Redmi Note 10), రెడ్మి నోట్ 10 ప్రో 4జి (Redmi Note 10 Pro 4G) వేరియంట్లను ఆ సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోంది. Mi 11 సిరీస్ వేరియంట్ల గురించి కూడా సమాచారం లైక్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను 91Mobiles వెబ్సైట్ ప్రచురించింది.
రెడ్మి నోట్ 10 సిరీస్ వేరియంట్లు
రెడ్మి నోట్ 10, రెడ్మి నోట్ 10 ప్రో 4జి వేరియంట్లను షియోమి భారత్‌లో విడుదల చేయనుంది. ఇవి గతంలో విడుదలైన రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్ సిరీస్‌కు అప్డేటెడ్ వెర్షన్‌లా, కాదా అనేది మాత్రం తెలియట్లేదు. దీనిపై షియోమి అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు 2021 ఫిబ్రవరిలో మార్కెట్లోకి రానున్నాయి. స్టాండర్ట్ రెడ్మి నోట్ 10... గ్రే, వైట్, గ్రీన్ కలర్లలో లభిస్తుంది. రియల్‌మి, శామ్సంగ్ల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేలా వీటి ధరలు ఉండవచ్చు.
నోట్ 10 ప్రో వేరియంట్ ఫోన్లు 4జి, 5జి నెట్వర్క్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. 6.67 అంగుళాల LCD డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేటు, స్నాప్‌డ్రాగన్ 732G చిప్సెట్తో వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 5050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, ఆండ్రాయిడ్ 11 బేస్డ్ MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వీటిని అభివృద్ధి చేశారు.
ఈ సంవత్సరంలోనే రానున్న Mi 11 సిరీస్ ఫోన్లు
షియోమి నుంచి Mi 11, Mi 11 Lite సిరీస్ ఫోన్లు కూడా మరికొన్ని నెలల్లో భారత మార్కెట్లలోకి రానున్నాయి. Mi 11 బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, టాప్ ఎండ్ వేరియంట్ 256GB స్టోరేజ్ ఆప్షన్లతో రానున్నాయి. ఈ సిరీస్ ఫోన్లు గ్రే, బ్లూ కలర్లలో లభించనున్నాయి. ఇంతకుముందు చైనాలో విడుదల చేసిన Mi 11 లెథర్ వేరియంట్లు భారత్‌లో విడుదల కావట్లేదు.
Mi 11 Lite స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. బేస్ వేరియంట్ 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఆప్షన్‌తో రానుంది. మిడ్ టైర్ వేరియంట్ 6GB, 128 GB, టాప్ ఎండ్ వేరియంట్ 8GB, 128GB స్టోరేజ్‌తో లభించనుంది. ఎమ్ఐ 11 లైట్ ఫోన్లు పింక్, బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లలో రానున్నాయి.