టెక్నాలజీ ట్రిక్స్ తెలుసుకుంటే థ్రిల్ కలుగుతుంది. చాలా తక్కువ మందికి తెలిసిన ట్రిక్స్ మనకు తెలుసన్న ఫీలింగ్ ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఆ ట్రిక్స్ మనల్ని మిగతా వాళ్ల కంటే గొప్పగా నిలబెడతాయి. మనకంటూ ప్రత్యేక గుర్తింపు తెస్తాయి. మనకు అపారమైన ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంది అని నిరూపిస్తాయి. అంతేకాదు అవి మన నెట్ లైఫ్‌ని మరింత ఎంజాయ్‌ఫుల్‌గా మార్చేస్తాయి. మనకు మరిన్ని టెక్నికల్ అంశాలు తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. అందుకే అవి మనం తెలుసుకుందాం. మైండ్‌లో పెట్టుకుందాం. ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడేద్దాం. ఇంకెందుకాలస్యం కింద ఇచ్చిన అద్భుతమైన ట్రిక్స్ తెలుసుకోండి మరి.
ట్రిక్ 1 : - HackerTyper.net ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే... మీరే ఓ హ్యాకర్లా కనిపిస్తారు మిగతా వారికి. ఈ సైట్ ఓపెన్ చెయ్యగానే... కంప్యూటర్ స్క్రీన్ బ్లాక్ కలర్లోకి మారుతుంది. F11 కీ ప్రెస్ చేస్తే, ఫుల్ స్క్రీన్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఆ తర్వాత Tab ప్రెస్ చేస్తే... హ్యాకర్ టైపులో టెక్స్ట్ మెసేజెస్ వస్తాయి. Alt ప్రెస్ చేస్తే... “Access Granted” అనే మెసేజ్ వస్తుంది. చుట్టూ చూసేవాళ్లకు మీరో ఎథికల్ హ్యాకర్లా కనిపిస్తారు. తిరిగి మామూలు స్క్రీన్ రావాలంటే... F11 క్లిక్ చెయ్యడమే.
GeekTyper.com వెబ్సైట్ కూడా ఇలాంటిదే. ఇందులో రకరకాల ఆప్షన్స్, థీమ్స్ ఉన్నాయి.
FakeUpdate.netఇదీ అలాంటిదే. మీ ఫ్రెండ్స్‌ని కన్ఫ్యూజ్ చెయ్యాలంటే ఈ సైట్లో వెబ్ పేజీలను స్క్రీన్‌పై ఫుల్ స్క్రీన్‌లో పెట్టుకోవాలి. F11 ద్వారా ఫుల్ స్క్రీన్‌గా పెట్టుకోవచ్చు.
ట్రిక్ 2 : - https://images.google.com లో Atari Breakout అని టైప్ చేసి చూడండి. వెంటనే మీ కంప్యూటర్లో అటారీ బ్రేక్ అవుట్ గేమ్ వచ్చేస్తు్ంది. ఇక ఆడేయడమే.
ట్రిక్ 3 : -
గూగుల్ సెర్చ్‌లో do a barrel roll అని టైప్ చేసి... ఎంటర్ నొక్కండి... ఏం జరుగుతుందో చూడండి.
ట్రిక్ 4 : -
గూగుల్ సెర్చ్‌లో pacman అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి... pacman గేమ్ వస్తుంది. ఆడుకోండి.
ట్రిక్ 5 : -
గూగుల్ సెర్చ్‌లో zerg rush అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి... pacman గేమ్ వస్తుంది. ఆడుకోండి.
ట్రిక్ 6 : -
గూగుల్ సెర్చ్‌లో blink html అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి... ఏం జరుగుతుందో చూడండి.
ట్రిక్ 7 : -
క్రోమ్ బ్రౌజర్లో ఇంటర్నెట్ కనెక్షన్ పోతే, వర్రీ అవ్వొద్దు. Unable to Connect పేజీ స్క్రీన్‌పై ఉండగా... సింపుల్‌గా స్పేస్ బార్ ప్రెస్ చెయ్యండి. T-Rex డైనోసార్ గేమ్ వస్తుంది. ఆడుకోండి.
ట్రిక్ 8 : -
మీకు లెక్కలంటే భయమా. ఈజీగా అర్థం కావాలా... ఐతే... https://betterexplained.com లోకి వెళ్లండి. అన్ని రకాల మేథ్సూ సింపుల్‌గా నేర్చేసుకోండి.
ట్రిక్ 9 : -
మీ ఆండ్రాయిడ్ మొబైల్ కనిపించట్లేదా. ఐతే గూగుల్‌లో find my phone అని సెర్చ్ చెయ్యండి. ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది. ఐతే... మీ మొబైల్లో గూగుల్ అకౌంట్లో మీరు లాగిన్ అయి ఉండాలి.
ట్రిక్ 10 : -
Pushbullet.com ఈ వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ నుంచీ కంప్యూటర్కీ, కంప్యూటర్ నుంచీ మొబైల్‌కీ ఫైల్స్, మ్యూజిక్స్, పిక్చర్స్ ఏవైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ట్రిక్ 11 : -
మీ జీమెయిల్లో అన్ని మెయిల్స్, గూగుల్ అకౌంట్లో ఫొటోలూ, వీడియోలు మొత్తం డేటా అంతా ఒక్క క్లిక్కుతో మీ కంప్యూటర్లోకి వచ్చేయాలనుకుంటున్నారా. https://takeout.google.com లోకి వెళ్లండి. అన్నీ డౌన్లోడ్ చేసేసుకోండి.
ట్రిక్ 12 : -
యూట్యూబ్ వీడియోను డైరెక్టుగా మీ బ్రౌజర్ లోంచీ డౌన్లోడ్ చెయ్యాలంటే, youtube ముందు ss చేర్చండి. అంటే ఇలా... https://www.ssyoutube.com/watch?v=_6_AIu1Aw0Q ఇలా ss చేర్చాక ఎంటర్ టైప్ చేస్తే చాలు... వీడియోను HD క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ట్రిక్ 13 : - Star Chart android app ద్వారా మీరు విశ్వంలో ఆకారాలను రియల్ టైంలో చూడొచ్చు. గ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు, శాటిలైట్స్ ఎన్నో వాటిని వర్చువల్ త్రీడీలో చూడొచ్చు. ఆలస్యమెందుకు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మరి.