TCS: టీసీఎస్ సంస్థలో 100 మందికి పైగా కోటీశ్వరులు

టీసీఎస్‌లో రూ.1 కోటికి పైగా వార్షిక జీతం అందుకుంటున్న ఉద్యోగుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం 103గా ఉంది. ఈ సంఖ్య ఇన్ఫోసిస్‌లో 60గా ఉంది.

news18-telugu
Updated: June 14, 2019, 9:12 PM IST
TCS: టీసీఎస్ సంస్థలో 100 మందికి పైగా కోటీశ్వరులు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 14, 2019, 9:12 PM IST
దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఉద్యోగుల వార్షిక జీతాలకు సంబంధించి ‘ఎకనామిక్ టైమ్స్’ ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది. టీసీఎస్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతం అందుకుంటున్నట్లు తెలిపింది. వీరిలో దాదాపు 25 శాతం మంది ఉద్యోగులు ఆ సంస్థలోనే కెరీర్‌ను ప్రారంభించిన వారు కావడం విశేషం.

2017-18 ఆర్థిక సంవత్సరంలో 91 మంది ఉద్యోగులు రూ.1 కోటి కంటే ఎక్కువ జీతాలు అందుకున్నారు. 2018-19 సంవత్సరానికి ఈ సంఖ్య 103కి చేరింది. సీఈవీ రాజేశ్ గోపినాథన్, సీఓఓ ఎన్జీ సుబ్రహ్మణ్యం, విదేశాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. టీసీఎస్‌లో రూ.1 కోటి జీతం అందుకుంటున్న వారిలో అత్యధిక వయస్కులు 72 ఏళ్ల ఉద్యోగికాగా...అతి తక్కువ వయస్కులు 40లలో ఉన్నారు.

కాగా ఇన్ఫోసిస్‌లో ఇలా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 60గా ఉంది.స్టాక్ మార్కెట్ లాభాలకు అనుగుణంగానూ తమ ఉద్యోగులకు టీసీఎస్ ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తుండగా...ఇన్ఫోసిస్ అలా ఇవ్వడం లేదు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...