హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Network: ఇండియాలో 5G నెట్‌వర్క్‌కు మారేందుకు 10 కోట్ల మంది యూజర్లు రెడీ..!

5G Network: ఇండియాలో 5G నెట్‌వర్క్‌కు మారేందుకు 10 కోట్ల మంది యూజర్లు రెడీ..!

5G Network: ఇండియాలో 5G నెట్‌వర్క్‌కు మారేందుకు 10 కోట్ల మంది యూజర్లు రెడీ..!

5G Network: ఇండియాలో 5G నెట్‌వర్క్‌కు మారేందుకు 10 కోట్ల మంది యూజర్లు రెడీ..!

5G Network: వచ్చే ఏడాది అంటే 2023లో 10 కోట్ల మందికి పైగా యూజర్లు 5G ఫోన్లకు మారేందుకు, 5జీ సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు సిద్ధంగా ఉన్నారని ఎరిక్‌సన్ సర్వే తేల్చింది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది వచ్చే 12 నెలలలో హయ్యర్ డేటా ప్లాన్‌కు మారాలని భావిస్తున్నట్లు సర్వే రిపోర్ట్ పేర్కొంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశ ప్రజలు హై స్పీడ్ సర్వీస్ 5 జీ నెట్‌వర్క్(5G Network)కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ సేవలు దేశంలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వీడన్ బేస్డ్ టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం ఎరిక్‌సన్(Ericsson) భారత స్మార్ట్ ఫోన్ యూజర్స్‌లో ఎంత మంది 5జీ సేవల కోసం ఎదురు చూస్తున్నారు, భారత్‌కు ఎలాంటి సేవలు అవసరమవుతాయి అనే విషయాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడైనట్లు ఎరిక్‌సన్ బుధవారం తెలిపింది. అవేంటో తెలుసుకుందాం.

వచ్చే ఏడాది అంటే 2023లో 10 కోట్ల మందికి పైగా యూజర్లు 5G ఫోన్లకు మారేందుకు, 5జీ సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు సిద్ధంగా ఉన్నారని ఎరిక్‌సన్ సర్వే తేల్చింది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది వచ్చే 12 నెలలలో హయ్యర్ డేటా ప్లాన్‌కు మారాలని భావిస్తున్నట్లు సర్వే రిపోర్ట్ పేర్కొంది.

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఎరిక్‌సన్ కంపెనీ చేసిన ఈ అధ్యయనంలో పట్టణ కేంద్రాల్లోని 300 మిలియన్ డెయిలీ స్మార్ట్ ఫోన్ యూజర్స్ తమ అభిప్రాయం తెలిపారు. సరికొత్త ఎక్స్‌పీరియన్స్ కోసం అవసరమైతే 45 శాతం ప్రీమియం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 5జీ సేవలు అందించేందుకు ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు(Internet Service Providers) కూడా ఆనందంగా ఉన్నట్లు స్టడీలో స్పష్టమైంది.

* బ్రిటన్, అమెరికా కంటే రెండు రెట్ల వేగం

భారతదేశంలోని పట్టణాల్లోని స్మార్ట్ ఫోన్ యూజర్లు 5జీ సేవల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే నెలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్న క్రమంలో వెంటనే 5Gకి అప్‌గ్రేడ్ కావాలని భావిస్తున్నారు. అర్బన్ ఇండియాలో అందుబాటులోకి వచ్చే 5జీ సేవలు బ్రిటన్, అమెరికా కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : పండక్కి ఊరెళ్తున్నారా? రైలులో ఫుడ్ కోసం వాట్సప్‌లో ఆర్డర్ చేయండిలా

* క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్

ఒకసారి 5G మోడ్‌కు స్విచ్ అయితే తమ స్మార్ట్ ఫోన్లలో వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ కచ్చితంగా మెరుగవుతుందని ప్రతి పదిమందిలో ఏడుగురు యూజర్లు పేర్కొన్నారు. ఇక 5జీతో తమ గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ సంతృప్తికరంగా ఉంటుందన్నారు. ఈ అధ్యయనాన్ని 27 వేర్వేరు ప్రాంతాల్లోని భారతీయ వినియోగదారులు చేయగా, అందరూ 5జీ ప్లాన్స్ కావాలని అడిగినట్లు ఎరిక్‌సన్ కంపెనీ వివరించింది.

* యాంటీనా ఇంటిగ్రేటెడ్ రేడియోల అవసరం

5G సేవల కోసం ఇండియాకు AIR 3219, AIR 3268 యాంటీనా ఇంటిగ్రేటెడ్ రేడియోలు అవసరమని ఎరిక్‌సన్ కంపెనీ అభిప్రాయపడింది. అల్ట్రా లైట్ వెయిట్ మ్యాసివ్ మీమో (Ultra-LightWeight Massive MIMO) 32T32R రేడియోలను పరిచయం చేస్తామని కంపెనీ ప్రకటించింది. జనసాంద్రత అధికంగా గల భారతదేశం కోసం ఈ 5జీ రేడియోల ఉత్పత్తి చేస్తామని, వాటి అవసరం ఇండియాకు ఉందని కంపెనీ వివరించింది. 5Gతో కన్స్యూమర్ మార్కెట్‌లో భారత్ స్థానం సుస్థిరమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎరిక్‌సన్ కంపెనీ కన్స్యూమర్ ల్యాబ్ హెడ్ జస్మీత్ సెథి.

Published by:Sridhar Reddy
First published:

Tags: 5G, 5g mobile, 5g service, Tech news

ఉత్తమ కథలు