హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhones: ఇండియాలో మరిన్ని ఐఫోన్ల తయారీ.. పెరగనున్న ఉత్పత్తి.. వెల్లడించిన తాజా రిపోర్ట్

iPhones: ఇండియాలో మరిన్ని ఐఫోన్ల తయారీ.. పెరగనున్న ఉత్పత్తి.. వెల్లడించిన తాజా రిపోర్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ ప్రొడక్ట్స్‌కు బెస్ట్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది ఇండియా. దీంతో ఇక్కడే ఐఫోన్లను తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో భారతదేశంలో మరిన్ని ఐఫోన్ హ్యాండ్‌సెట్లను తయారు చేయడానికి యాపిల్‌ ఆసక్తి చూపుతోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

యాపిల్ ప్రొడక్ట్స్‌కు బెస్ట్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది ఇండియా. దీంతో ఇక్కడే ఐఫోన్లను (iPhones) తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. మేక్ ఇన్ ఇండియా (Make in India) చొరవతో భారతదేశంలో మరిన్ని ఐఫోన్ హ్యాండ్‌సెట్లను తయారు చేయడానికి యాపిల్‌ ఆసక్తి చూపుతోంది. గత సంవత్సరం ఐఫోన్ 13 (iPhone) ను స్థానికంగా తయారు చేసిన ఈ టెక్ దిగ్గజం.. లేటెస్ట్ యాపిల్ ఐఫోన్‌ 14 (iPhone 14) మోడళ్లను కూడా భారత్‌లోనే తయారు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. చైనాలో ఐఫోన్ 14 తయారీ మొదలైన తర్వాత ఫాక్స్‌కాన్ కొన్ని బ్యాచ్‌ల యూనిట్లను భారత్‌లోనే తయారు చేయనుందని యాపిల్ ఎనలిస్ట్ మింగ్-చి కువో తెలిపారు.

ఈ సంవత్సరం యాపిల్‌ ఇండియాలో ఐఫోన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను పెంచనుందని ఈటీ రిపోర్ట్ వెల్లడించింది. ప్రొడక్షన్‌ను రెట్టింపు చేసే యోచనలో ఉందని సమాచారం. యాపిల్‌కు ఇండియాలో మూడు మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్టర్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో చెన్నై సమీపంలో ఫాక్స్‌కాన్‌ ఒకటి. ఎకనామిక్ టైమ్స్ తెలిపిన వివరాల మేరకు.. 2022లో యాపిల్ భారతదేశంలో కనీసం మూడు కాంట్రాక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల ద్వారా 11-12 మిలియన్ ఐఫోన్ మోడల్‌లను తయారు చేసే అవకాశం ఉంది. పాత ఐఫోన్ మోడల్‌ల లాంచ్ తేదీల కంటే ముందే యాపిల్‌ కంపెనీ భారతదేశంలో లేటెస్ట్‌ ఐఫోన్ 14 మోడల్‌ తయారీని ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

iPhone 13 Price Cut: ఐఫోన్ 13 రూ.29 వేల వరకు తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా..

దాదాపు 7.5 శాతం మ్యానుఫ్యాకర్చింగ్‌

కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో ఐఫోన్‌ మోడల్స్‌ మ్యానుఫ్యాకర్చింగ్‌ క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు ఐఫోన్‌ల మొత్తం ప్రొడక్షన్‌లో ఇండియాలో 7.5 శాతం జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో తయారైన ఐఫోన్‌ల ఎగుమతులు గ్లోబల్‌ షిప్‌మెంట్‌లలో 5-7 శాతంగా ఉన్నాయి. గత సంవత్సరం భారతదేశంలో ఐఫోన్ ప్రొడక్షన్‌.. గ్లోబల్ షిప్‌మెంట్‌లలో 3 శాతానికి పైగా ఉంది. అంతకు ముందు సంవత్సరానికి ఇది కేవలం 1.5 శాతంగానే ఉంది.

చైనాకు తగ్గుతున్న ప్రాధాన్యం?

యాపిల్‌ కంపెనీ ప్రస్తుతం చైనాలో మెజారిటీ ఐఫోన్‌లను తయారు చేస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా, వియత్నాం వంటి ఇతర దేశాలకు మ్యానుఫ్యాక్చరింగ్‌ను తరలించే యోచనలో ఉంది. యూఎస్‌, చైనా మధ్య కొనసాగుతున్న సప్లై చైన్‌ సమస్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీని వెనుక ప్రధాన కారకాలు కావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చైనాలో ఐఫోన్ యూనిట్లు తయారు చేసిన ఫోన్‌లు 2021 గ్లోబల్ షిప్‌మెంట్లలో 95 శాతానికి పైగా, 2020లో దాదాపు 98 శాతానికి పైగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం గ్లోబల్‌ షిప్‌మెంట్‌లో చైనా మ్యానుఫ్యాకర్చరింగ్‌ యూనిట్ల సహకారం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాకు ప్రాధాన్యం తగ్గుతున్న నేపథ్యంలో యాపిల్‌కు ఇండియా బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తోంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Apple iphone, Iphone 14

ఉత్తమ కథలు