హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

USB Type C: స్మార్ట్‌ఫోన్లు అన్నింటికీ ఇక టైప్ C ఛార్జరే.. మరి ఐ ఫోన్‌కు యూజర్ల పరిస్థితి ఏంటంటే..?

USB Type C: స్మార్ట్‌ఫోన్లు అన్నింటికీ ఇక టైప్ C ఛార్జరే.. మరి ఐ ఫోన్‌కు యూజర్ల పరిస్థితి ఏంటంటే..?

టైప్ c ఛార్జర్‌కు ప్రతిపాదనలు

టైప్ c ఛార్జర్‌కు ప్రతిపాదనలు

మొబైల్ డివైజ్‌లకు యూఎస్‌బీ(USB) టైప్ Cని స్టాండర్డ్‌ ఛార్జింగ్ పోర్ట్‌గా చేయాలని యూరోపియన్ యూనియన్ (EU) చట్టం చేసింది. ఇతర దేశాలు ఇదే విధమైన చర్యలు తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

మార్కెట్‌లో వివిధ స్పెసిఫికేషన్‌లతో స్మార్ట్‌ఫోన్‌ (Smart Phones)లు అందుబాటులో ఉంటున్నాయి. ఛార్జింగ్‌ (Charging) పోర్ట్‌లు కూడా అన్నింటికీ ఒకేలా ఉండటం లేదు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకు, యాపిల్‌ (Apple) ఫోన్‌లకు ఛార్జింగ్‌ ఆప్షన్‌లు పూర్తిగా వేరుగా ఉంటాయి. కొన్నేళ్ల క్రితం కొన్న ఫోన్‌ను మారిస్తే.. ఛార్జర్‌ను కూడా మార్చాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఈ-వ్యర్థాలను తగ్గించేందుకు కొన్ని దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ దేశాల్లో విక్రయించే ఫోన్‌లు అన్నింటికీ డిఫాల్ట్‌గా యూఎస్‌బీ టైప్‌ Cని ఛార్జింగ్‌ స్టాండర్డ్‌(Charging Standard)గా పాటించాలని చట్టాలు చేస్తున్నాయి.

మొబైల్ డివైజ్‌లకు యూఎస్‌బీ(USB) టైప్ Cని స్టాండర్డ్‌ ఛార్జింగ్ పోర్ట్‌గా చేయాలని యూరోపియన్ యూనియన్ (EU) చట్టం చేసింది. ఇతర దేశాలు ఇదే విధమైన చర్యలు తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విభాగంలో మాన్యుఫాక్చర్‌లకు US ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను అందజేసింది. ఈ క్రమంలోనే కామన్‌ స్టాండర్డ్‌ ఛార్జింగ్ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఇదీ చదవండి: వాట్సాప్ కొత్త ఫీచర్.. వీడియో కాల్స్‌లో లేటెస్ట్ అవతార్స్.. మాములుగా ఉండదు..!


తమ దేశంలో విక్రయించే మొబైల్ డివైజ్‌లకు USB టైప్ Cని డిఫాల్ట్ ఛార్జింగ్ స్టాండర్డ్‌గా మార్చాలని భావిస్తున్న దేశాల్లో బ్రెజిల్(Brazil) ముందుంది. బ్రెజిల్‌కు చెందిన వైర్‌లెస్ రెగ్యులేటర్ ఈ సూచన చేసింది. ప్రస్తుతం దేశంలోని ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. కంపెనీలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. ప్రజలు, కంపెనీలు ఈ అంశంలో తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఆగస్టు 26 వరకు సమయం ఉంది.

EU అనేక డివైజ్‌ల కోసం USB టైప్ Cని ఛార్జింగ్ స్టాండర్డ్‌గా కోరింది. బ్రెజిలియన్ బాడీ దీనిని స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే ప్రమాణంగా మార్చాలనుకుంటోంది. స్మార్ట్‌ఫోన్‌ల కోసం USB టైప్ Cకి బదులుగా లైటెనింగ్‌ కనెక్టర్‌ను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ యాపిల్‌పై మరింత ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి.

యాపిల్‌ కంపెనీ ఇప్పటికే ఐప్యాడ్, మాక్‌ల విషయంలో మార్పులు చేపట్టింది. అయితే ఐఫోన్‌లను విస్మరించింది. ఏదేమైనా, ఈ తీర్పులన్నీ చివరికి యాపిల్‌ను మారేలా చేస్తాయని, ఒత్తిడి తప్పదని కొన్ని నెలలుగా విడుదలైన కొన్ని నివేదికలు సూచించాయి. యాపిల్‌ని ట్రాక్ చేసే, కంపెనీ అప్‌డేట్‌లను క్రమం తప్పకుండా పంచుకునే విశ్లేషకుడు మింగ్-చి కువో సూచించినట్లుగా, యాపిల్‌ ఐఫోన్‌ 15(iPhone 15) సిరీస్‌తో 2024లో ఐఫోన్‌ USB టైప్ Cకి మారే అవకాశం ఉంది.

ఇండియాలో USB టైప్ Cని డివైజ్‌ల కోసం డి-ఫాక్టో ఛార్జింగ్ స్టాండర్డ్‌గా మార్చడానికి ఇంకా చర్యలు మొదలుకాలేదు. అయితే కొన్ని దేశాలు ఈ విషయంలో చట్టాలను రూపొందిస్తుండటం చూస్తే.. త్వరలోనే ఇండియాలో కదలికను చూసే అవకాశం ఉంది. ఆ భవిష్యత్తు ఇప్పుడు చాలా దూరంలో లేదు. ఇలాంటి నిర్ణయాలతో ఈ-వ్యర్థాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Android, Apple iphone, Charging, Smartphones

ఉత్తమ కథలు