ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ నూతనంగా ప్రారంభించబోయే ప్లేస్టేషన్ 5 కన్సోల్‌లో భాగంగా నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, స్పాటిఫై, ట్విచ్, యూట్యూబ్ వంటి మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు, వినోద ప్రయోజనాల కోసం సోనీ ప్రత్యేకంగా కొత్త మీడియా రిమోట్ కంట్రోల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోనీ తన బ్లాగ్ పోస్ట్‌లో అధికారికంగా పేర్కొంది. దీనిలో భాగంగా యూజర్లు తమ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి గేమ్ హోమ్ స్క్రీన్ పక్కనే ప్రత్యేక మీడియా స్పేస్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్లేస్లేషన్-5లో వినోద అంశంపై సోనీ ఎక్కువ దృష్టి సారించింది.
పిఎస్5 స్టోర్ ద్వారా మీడియా స్పేస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్‌ను ఇకపై డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఆపిల్ టీవీ ప్లస్, డిస్నీ ప్లస్, నెట్ ఫ్లిక్స్, స్పాటిఫై, ట్విచ్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, మైకానల్, హులు, పికాక్తో పాటు మరిన్ని యాప్స్‌ను పిఎస్ 5 కన్సోల్‌లో భాగంగా అందించనున్నట్లు సోనీ తెలిపింది. కాగా, ప్రస్తుతం ఉన్న ప్లేస్టేషన్ 4లో డిస్నీ ప్లస్ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇన్ ఇండియా) యాప్ అందుబాటులో లేదు.
కాగా, నూతన ప్లే స్టేషన్‌లో డిస్నీ ప్లస్ యాప్ అందుబాటులోకి రానుండటం అత్యంత స్వాగతించే అంశంగా చెప్పవచ్చు. పిఎస్-5 కోసం అందుబాటులో ఉన్న ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ లిస్టో హెచ్‌బీవో మాక్స్ యాప్ లేకపోవడం కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, మన దేశంలో దీన్ని వాడే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. ఎక్కువగా యుఎస్‌లోని హెచ్‌బీవో మాక్స్ చందాదారులు ప్రభావితమవుతారని తెలుస్తోంది.
తెలుపు రంగులో ఆకర్షణీయమైన రిమోట్..
సోనీ ప్లేస్టేషన్ 4 నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ట్విచ్, స్పాటిఫై వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్కు సపోర్ట్ ఇస్తుంది. అయితే, పీఎస్4లో ఆపిల్ టీవీ, హులు మరియు డిస్నీ ప్లస్ యాప్ సపోర్ట్ మాత్రం లేదు. సోనీ పిఎస్5 కన్సోల్‌లో కొత్త కంట్రోల్ సెంటర్ కూడా ఉందని, ఇది మ్యూజిక్‌ను నియంత్రించడాన్ని కూడా సులభతరం చేస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ నూతన నియంత్రణ కేంద్రం యూజర్లను ఛానెళ్ల మధ్య త్వరగా మారడానికి, స్కిప్ చేయడానికి మరియు సంగీతాన్ని పాజ్ చేయడానికి అనుమతిస్తుంది. కాగా, ప్లేస్టేషన్ 5 కోసం సోనీ కొత్త మీడియా రిమోట్ కూడా ప్రకటించింది. పీఎస్ 5లో వినోద అనుభవాన్ని నావిగేట్ చేయడానికి మరియు నియంత్రించడానికి ఈ మీడియా రిమోట్ రూపొందించబడింది.
ఈ రిమోట్‌ను నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, స్పాటిఫై మరియు యూట్యూబ్ బటన్లతో తెలుపు రంగులో ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ బటన్లపైన, నావిగేట్ చేయడానికి ప్లే / పాజ్, ఫాస్ట్ ఫార్వర్డ్ మరియు ఫాస్ట్ రివర్స్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. కంపాటెబుల్ టీవీల్లో వాల్యూమ్ మరియు పవర్ సెట్టింగులను అడ్జెస్ట్ చేయడానికి ఈ నూతన రిమోట్ యూజర్లను అనుమతిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sony