• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • MONKEY PLAYING COMPUTER GAMES WITH A BRAIN CHIP DEVELOPED BY ELON MUSK COMPANY NEURALINK WATCH VIDEO NK

Elon Musk's brain chip: కోతి మెదడులో చిప్... కంప్యూటర్ గేమ్స్ ఆడేస్తోందిగా...

Elon Musk's brain chip: కోతి మెదడులో చిప్... కంప్యూటర్ గేమ్స్ ఆడేస్తోందిగా...

కోతి మెదడులో చిప్... కంప్యూటర్ గేమ్స్ ఆడేస్తోందిగా (image credit - youtube)

Elon Musk's brain chip: ఎలన్ మస్క్... 2016లో న్యూరాలింక్ (Neuralink) అనే బ్రెయిన్ చిప్ స్టార్టప్ ప్రారంభించాడు. దాని అద్భుత ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

  • Share this:
    Elon Musk's brain chip: కోతి వీడియో గేమ్స్ ఆడటం రియల్‌గా ఎప్పుడైనా చూశారా... ఐతే... ఇప్పుడు చూడండి. టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్... చరిత్ర సృష్టించబోతున్నాడు. ఇప్పటికే చాలా అంశాల్లో తనదైన మార్క్ చూపిస్తూ... తరచూ టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ అవుతున్న ఎలన్ మస్క్... ఇప్పుడు మరోసారి నెటిజన్లను తనవైపు తిప్పుకున్నాడు. ఎలన్ మస్క్... 2016లో న్యూరాలింక్ (Neuralink) అనే బ్రెయిన్ చిప్ స్టార్టప్ ప్రారంభించాడు. దాని అద్భుత ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ కంపెనీ చేసిన ఓ చిన్న చిప్‌ని కోతి మెదడుకి సెట్ చేశారు. ఆ చిప్ వల్ల కోతి... మనిషిలాగా ఆలోచించగలదు. చిప్ ద్వారా ఎప్పుడు ఏం చెయ్యాలో కోతి మెదడుకి సిగ్నల్స్ వెళ్తాయి. వాటి ఆధారంగా కోతి పనిచేస్తుంది. అలా పాంగ్ (pong) అనే గేమ్‌ని కోతి ఆడుతుంటే... దాన్ని వీడియో తీసి... యూట్యూబ్‌లో పెట్టాడు ఎలన్‌మస్క్... ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

    ఈ 9 ఏళ్ల మకాక్ (macaque) జాతి కోతి పేరు పాజెర్ (pager). మీరు వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది... ఆ గేమ్‌ని ఆ కోతి అచ్చం మనలాగే ఆడగలుగుతోంది అని. సాధారణ కోతి అయితే... గేమ్ దగ్గరకు వెళ్లగానే... ఏం చెయ్యాలో తెలియక దిక్కులు చూస్తుంది. కానీ ఈ కోతికి చిప్ ఉంది కదా... అందువల్ల ఇది జాయ్ స్టిక్‌ని ఎలా కదిపితే గేమ్ నెగ్గుతామో చిప్ ద్వారా తెలుసుకొని అలాగే కదుపుతోంది. కొన్నాళ్లుగా ఈ కోతి... ఇలా చాలా గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తోంది. వీడియో మీరూ చూడండి.

    ఈ చిప్ ఎందుకు?
    మనుషులకు పనిముట్లు అమర్చితే... వారిని సైబోర్గ్ (cyborg) అంటారు. ఎలన్ మస్క్ చేస్తున్న ప్రయోగం దాదాపు ఇలాంటిదే. ఎవరికైనా పక్షవాతం (paralysis) ఉంటే... అలాంటి వారు ఈ చిప్ ద్వారా... మామూలు మనుషుల కంటే వేగంగా స్మార్ట్ ఫోన్‌ను వాడే సదుపాయం కల్పించగలం అని ఎలన్ మస్క్... ట్విట్టర్‌లో తెలిపాడు.

    ఎలన్ మస్క్ ట్వీట్


    డైమెన్షియా, అల్జీమర్స్ (మతిమరపు) వంటి సమస్యలు ఉన్నవారికి నాడీ సంబంధిత సమస్యల నుంచి కాపాడేందుకు న్యూట్రాలింక్ కంపెనీ బ్రెయిన్ చిప్‌లు తయారుచేసే పనిలో ఉంది. అందులో భాగంగానే కోతిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు విజయవంతం అయ్యాక... మనుషులపై ప్రయోగిస్తారు.

    ఇది కూడా చదవండి: Business Idea: ఈ ఆవులతో పాల వ్యాపారం ప్రారంభిస్తే... కోటీశ్వరులు అవ్వడం ఖాయం

    దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఇంట్రస్టింగ్‌గా ఉంది అంటుంటే... మరికొందరు... జంతువులను హింసించినట్లే అంటున్నారు. ఇలాంటి పరిశోధనలను నిషేధించాలి అని ఓ యూజర్ సీరియస్ కామెంట్ పెట్టారు. కోతిని వదిలేస్తే... అది ఇంతకంటే ఆనందంగా ఆడుకుంటుంది అని మరో యూజర్ కామెంట్ చేసారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు