Vivo Offer | కొత్త ఫోన్ కొనాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) మొబైల్స్ బొనాంజా సేల్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా వివో (Vivo) కంపెనీకి చెందిన టీ1ఎక్స్ ఫోన్‌పై పలు రకాల ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను కేవలం రూ. 199కే పొందే అవకాశం అందుబాటులో ఉంది. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
వివో టీ1ఎక్స్ ఫోన్ ఎంఆర్పీ రూ. 16,990గా ఉంది. దీన్ని ఇప్పుడు రూ. 11,999కు కొనొచ్చు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అంటే మీరు ఫోన్‌పై 29 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొంటే రూ. 750 వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఎక్స్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 11,050 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఆఫర్లు కలుపుకుంటే కేవలం రూ. 199 చెల్లించి ఈ ఫోన్ కొనొచ్చు.
రూ.10 వేల స్మార్ట్‌వాచ్ రూ.2 వేలకే.. 80 శాతం తగ్గింపుతో అమెజాన్ భారీ ఆఫర్లు!
అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ విలువ అనేది మీ ఫోన్, దాని కండీషన్ ప్రాతిపదికన మారుతుంది. అందువల్ల పూర్తి ఎక్స్చేంజ్ విలువ రాకపోవచ్చు. అలాగే 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెరీ వేరియంట్ ఫోన్ రేటు అయితే రూ. 12,999గా ఉంది. దీని ఎంఆర్పీ రూ. 17,990. ఇంకా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 750 వరకు తగ్గింపు వస్తుంది. ఈ ఫోన్‌పై అయితే రూ. 12 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఆఫర్.. ఫోన్ కొంటే రూ.27 వేల తగ్గింపు!
ఇకపోతే ఈ ఫోన్లో 6.58 అంగుళాల స్క్రీన్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్లో సైడ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు. ఇకపోతే ఈ ఫోన్‌ను ఈఎంఐలో కూడా కొనొచ్చు. నెలకు రూ. 1078 చెల్లిస్తే సరిపోతుంది. 12 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే ఆరు నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2083 చెల్లించాలి. క్రెడిట్ కార్డు ప్రాతిపదికన, మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ అమౌంట్ మారుతూ ఉంటుందని గుర్తించాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే 36 నెలల ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. అంటే నెలకు రూ. 416 చెల్లిస్తే సరిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Latest offers, Mobile offers, Vivo