షాక్.. నిలిచిపోయిన మొబైల్ నంబర్ పోర్టబిలిటీ..

TRAI | MNP | మొబైల్ పోర్టబిలిటీ సేవల్ని భారత టెలికాం నియంత్రణ అథారిటీ (ట్రాయ్) నిలిపివేసింది. కాకపోతే.. ఇది తాత్కాలికమే.

news18-telugu
Updated: December 13, 2019, 6:37 AM IST
షాక్.. నిలిచిపోయిన మొబైల్ నంబర్ పోర్టబిలిటీ..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఒక టెలికం ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్‌కు మారే ప్రక్రియే మొబైల్ పోర్టబిలిటీ. ఫోన్ నంబరు మార్చకుండానే కేవలం.. నెట్‌వర్క్‌ను మార్చుకునే వీలు ఉంటుంది. ఈ ప్రక్రియకు ప్రస్తుతం ఏడు రోజుల సమయం తీసుకుంటోంది. అయితే.. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సేవల్ని భారత టెలికాం నియంత్రణ అథారిటీ (ట్రాయ్) నిలిపివేసింది. కాకపోతే.. ఇది తాత్కాలికమే. ఎంఎన్‌పీకి సంబంధించి ట్రాయ్ కొత్త నిబంధనలను రూపొందించింది. అవి ఈ నెల 16 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు ఎంఎన్‌పీ సేవలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రాయ్ ప్రకటించింది. ట్రాయ్ తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్రకారం ఈ మొబైల్ నెట్వర్క్ చేంజ్ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి కానుంది. దీంతో వినియోగదారులు ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు ఎంఎన్‌పీ ద్వారా తమ ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయడం మరింత తేలికగానూ, వేగంగానూ అయిపోవడం విశేషం. కాగా ఒకే సర్కిల్ అయితే 2 రోజుల్లోనే నంబర్‌ను పోర్ట్ చేసుకోవచ్చని, వేరే సర్కిల్‌లో ఉన్న నెట్‌వర్క్‌కు ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయాలంటే మాత్రం 5 రోజుల సమయం పడుతుందని ట్రాయ్ తెలిపింది.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు