మొబైల్ వినియోగదారులకు శుభవార్త... నేటి నుంచి 3 రోజుల్లోగా మొబైల్ పోర్టబులిటీ

డిసెంబర్ 16 నుంచి అమలు చేయనున్న ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం.. కేవలం 3 రోజుల్లోనే ఎంఎన్‌పీ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో వినియోగదారులు ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు ఎంఎన్‌పీ ద్వారా తమ ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయడం మరింత తేలికగానూ, వేగంగానూ అయిపోవడం విశేషం.

news18-telugu
Updated: December 16, 2019, 5:07 AM IST
మొబైల్ వినియోగదారులకు శుభవార్త... నేటి నుంచి 3 రోజుల్లోగా మొబైల్ పోర్టబులిటీ
ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాట్‌ఫాం వేదికగా తమ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన బెనిఫిట్స్ అందిస్తామని తెలిపింది.
  • Share this:
నేటి నుంచి మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ప్రక్రియకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ పేర్కొంది. ఎంఎన్‌పీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి కస్టమర్ తన మొబైల్ నంబర్‌ను ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతుంది. అయితే డిసెంబర్ 16 నుంచి అమలు చేయనున్న ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం.. కేవలం 3 రోజుల్లోనే ఎంఎన్‌పీ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో వినియోగదారులు ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు ఎంఎన్‌పీ ద్వారా తమ ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయడం మరింత తేలికగానూ, వేగంగానూ అయిపోవడం విశేషం.

కాగా ఒకే సర్కిల్ అయితే 2 రోజుల్లోనే నంబర్‌ను పోర్ట్ చేసుకోవచ్చని, వేరే సర్కిల్‌లో ఉన్న నెట్‌వర్క్‌కు ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయాలంటే మాత్రం 5 రోజుల సమయం పడుతుందని ట్రాయ్ తెలిపింది.
Published by: Krishna Adithya
First published: December 16, 2019, 5:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading