ఇన్స్యూరెన్స్... ఈ మాట వినగానే లైఫ్ ఇన్స్యూరెన్స్ గుర్తొస్తుంది. లైఫ్‌కి మాత్రమే కాదు మీ బండికి, ఇంటికి, ప్రయాణానికి కూడా ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా పాపులర్ అవుతోంది మొబైల్ ఇన్స్యూరెన్స్. అంటే స్మార్ట్‌ఫోన్‌కు బీమా అన్నమాట. మొబైల్ ఇన్స్యూరెన్స్ గురించి అవగాహన అందరిలో లేదు. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనేవారికన్నా ఖరీదైన, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనేవారికి మొబైల్ ఇన్స్యూరెన్స్ ఉపయోగపడుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో 'కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్' పేరుతో ప్రతీ స్మార్ట్‌ఫోన్‌కు మొబైల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. అయితే ఇందుకోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు ప్రీమియం చెల్లించినట్టు మొబైల్ ఫోన్‌కు బీమా తీసుకోవాలంటే ఎంతో కొంత ప్రీమియం చెల్లించాల్సిందే. ఫ్లిప్‌కార్ట్‌లో 'కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్' తీసుకోవడానికి కనీస ధర రూ.99. అయితే ఇది స్మార్ట్‌ఫోన్ ధరను బట్టి ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఉంటుంది.
Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?
వేలకు వేలు ఖర్చు పెట్టి స్మార్ట్‌ఫోన్ కొంటారు. రూ.40 వేలు ఖరీదైనా సరే లెక్కచేయరు. ఆ ఫోన్ పొరపాటున చేయి జారిందంటే డిస్‌ప్లే బద్దలవడం ఖాయం. అంత ఖరీదైన ఫోన్‌కు కొత్త డిస్‌ప్లే వేయాలంటే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అదే ఇన్స్యూరెన్స్ ఉంటే ఇబ్బంది ఉండదు. క్లెయిమ్ చేసుకోవచ్చు. అదొక్కటే కాదు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యలు వచ్చినా, నీళ్లల్లో పడి ఫోన్ డ్యామేజ్ అయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆథరైజ్డ్ సెంటర్లలో ఫ్రీగా రిపేర్ చేయించుకోవచ్చు. కొన్ని కంపెనీలైతే ఉచితంగానే ఫోన్ పిక్-అప్ అండ్ డ్రాప్ సేవల్ని అందిస్తున్నాయి. దొంగలు మీ ఫోన్ కొట్టేసినా కంప్లైంట్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు.
Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి
ఖరీదైన ఫోన్ కొన్నారంటే స్మార్ట్‌ఫోన్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరిగా తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కంపెనీ ఇచ్చే వారెంటీలో అన్ని సదుపాయాలు ఉండవు. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌కు పూర్తి రక్షణ కల్పించే మొబైల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం మంచిది. రూ.40,000 చెల్లించి మరీ ఫోన్ కొన్నప్పుడు... రూ.500 నుంచి రూ.1,000 చెల్లించి ఇన్స్యూరెన్స్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. అంత ఖరీదైన ఫోన్ దొంగలు కొట్టేసినప్పుడో, పాడైనప్పుడో ఇన్స్యూరెన్స్ విలువ తెలుస్తుంది.
Read this: Personal Finance: అకౌంట్‌లో ఎక్కువ వడ్డీ ఇచ్చే 'ఆటో స్వీప్' గురించి మీకు తెలుసా?
మీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ కావాలి కదా అని ఏదో ఒకటి తీసుకుంటే తర్వాత క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మీరు తీసుకునే ఇన్స్యూరెన్స్ ఏమేం కవర్ చేస్తుందో చూసుకోవాలి. కొన్ని ఇన్స్యూరెన్స్‌లల్లో థెఫ్ట్ కవరేజీ ఉండదు. అంటే దొంగలు ఫోన్ కొట్టేస్తే క్లెయిమ్ మీకు వర్తించదు. అందుకే ముందుగానే నియమ నిబంధనలన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రీమియం చెల్లించాలి. ఇంటర్నల్ డ్యామేజ్, ఎక్స్‌టర్నల్ డ్యామేజ్, యాక్సిడెంటల్ స్క్రీన్ డ్యామేజ్, వాటర్ డ్యామేజ్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, థెఫ్ట్, ఫైర్ యాక్సిడెంట్... ఇలా మీ స్మార్ట్‌ఫోన్‌కు పూర్తి కవరేజీ ఉండటం తప్పనిసరి.
Read this: Health Apps: బరువు తగ్గాలా? ఈ 7 యాప్స్ ట్రై చేయండి
మీ స్మార్ట్‌ఫోన్ అనుమానాస్పదంగా కనిపించకపోయినా, తాళం వేయని ఇల్లు లేదా వాహనం నుంచి ఫోన్ కొట్టేసినా, ఆ ఫోన్ యజమాని కాకుండా ఇతరులు ఎవరైనా ఉపయోగిస్తుండగా పాడైనా ఇన్స్యూరెన్స్ వర్తించదు. మీరు కోపంతో మీ ఫోన్ విసిరినప్పుడు పగిలిపోయినా బీమా వర్తించదు. ఫోన్ రిపేర్ చేస్తున్నప్పుడో, శుభ్రం చేస్తున్న సమయంలో డ్యామేజ్ అయినా ఇన్స్యూరెన్స్ రాదు. ఇలా చాలా అంశాలకు ఇన్స్యూరెన్స్ వర్తించదు. అందుకే నియమనిబంధనలు తెలుసుకోవాలి.
Read this: LIC Children's Policy: రోజుకు రూ.12... మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా
మొబైల్ ఇన్స్యూరెన్స్ ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొన్నవారికి 'కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్' అదే ప్లాట్‌ఫామ్‌పై లభిస్తుంది. దాంతో పాటు AppsDaily, OneAssist, SyncNScan, OnsiteGo లాంటి పలు కంపెనీలు కూడా మొబైల్ ఇన్స్యూరెన్స్ ఇస్తున్నాయి.
Read this: Personal Finance: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
మొబైల్ ఇన్స్యూరెన్స్‌ని క్లెయిమ్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు మీ స్మార్ట్‌ఫోన్ ఇన్‌వాయిస్ లేదా బిల్లు, సీరియల్ నెంబర్‌తో ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా, పోగొట్టుకున్నా 24 గంటల్లోపు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ కాపీని ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్‌కు సబ్మిట్ చేయాలి. 48 గంటల్లోనే క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అయితే మీకు ఎంత మొత్తం తిరిగి వస్తుందన్న విషయం మీరు ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందే నియమనిబంధనల్లో ఉంటుంది.
Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్
ఇవి కూడా చదవండి:
Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్
Personal Finance: మీ బ్యాంక్ అకౌంట్ వాడట్లేదా? ఇలా క్లోజ్ చేసెయ్యండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Insurance, Personal Finance, Smartphone