హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mobile Games: 2021లో​ మొబైల్​ గేమ్స్​కు పెరిగిన డిమాండ్.. బిలియన్​ డాలర్లకు పైగా ఆర్జించిన టాప్​ 8 గేమ్స్​ ఇవే!

Mobile Games: 2021లో​ మొబైల్​ గేమ్స్​కు పెరిగిన డిమాండ్.. బిలియన్​ డాలర్లకు పైగా ఆర్జించిన టాప్​ 8 గేమ్స్​ ఇవే!

3. ఎలక్ట్రాన్ బాట్ మాల్‌వేర్ (Electron Bot Malware) 5,000 పైగా కంప్యూటర్లపై ప్రభావం చూపించింది. ఇది ఒక్కసారి కంప్యూటర్‌పై దాడి చేసిందంటే ఆ కంప్యూటర్‌లో ఉపయోగించిన ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తస్కరిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

3. ఎలక్ట్రాన్ బాట్ మాల్‌వేర్ (Electron Bot Malware) 5,000 పైగా కంప్యూటర్లపై ప్రభావం చూపించింది. ఇది ఒక్కసారి కంప్యూటర్‌పై దాడి చేసిందంటే ఆ కంప్యూటర్‌లో ఉపయోగించిన ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తస్కరిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Top Mobile Games | పరిశోధనా సంస్థ సెన్సార్ టవర్ ప్రకారం, యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల (Google Play Stores) లోని ఎనిమిది మొబైల్ గేమ్‌లు 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో సంపాదించాయి. 2021 సంవత్సరంలో మొబైల్​ గేమ్​ యూజర్లు ఎక్కువగా ఖర్చు చేసిన టాప్​ 8 గేమ్‌లను పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...

మరి కొద్ది రోజుల్లో 2021 సంవత్సరానికి గుడ్​బై చెప్పి 2022 నూతన ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. కరోనా (Corona) కారణంగా అంతా ఇంటికే పరిమితమవ్వడంతో ఈ ఏడాది గేమింగ్​ యాప్స్ (Gamming Apps) ​కు ఆదరణ భారీగా పెరిగింది. దీంతో అనేక మొబైల్​ గేమింగ్ సంస్థలు​ పెద్ద మొత్తంలో ఆర్జించాయి. పరిశోధనా సంస్థ సెన్సార్ టవర్ ప్రకారం, యాపిల్ (Apple) యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల (Google Play Store) లోని ఎనిమిది మొబైల్ గేమ్‌లు 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో సంపాదించాయి. 2021 సంవత్సరంలో మొబైల్​ గేమ్​ యూజర్లు ఎక్కువగా ఖర్చు చేసిన టాప్​ 8 గేమ్‌లను పరిశీలిద్దాం.

పబ్​జీ మొబైల్

చైనాలో గేమ్ ఫర్ పీస్, భారతదేశంలో బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్‌ ఇండియా పేర్లతో పబ్​జీ మొబైల్ గేమ్​ అందుబాటులో ఉంది. 2021లో ఇది మోస్ట్ పాపులర్​ గేమ్​గా నిలిచింది. ఈ ఏడాది పబ్​జీ మొబైల్ గేమ్​ 2.8 బిలియన్​ డాలర్లను ఆర్జించింది.

హానర్​ ఆఫ్ కింగ్స్​

హానర్ ఆఫ్ కింగ్స్ అనేది మల్టీప్లేయర్ ఆన్‌లైన్ (Online) బాటిల్ అరేనా (MOBA) గేమ్. దీన్ని టెన్సెంట్ గేమ్స్ అనుబంధ సంస్థ టిమి స్టూడియోస్ అభివృద్ధి చేసింది. ఈ గేమ్ 2021లో 2.8 బిలియన్ల డాలర్లను ఆర్జించింది.

Cyber Crime: మీ ఫోన్‌కు ఈ మెసేజ్ వ‌చ్చిందా.. అయితే జాగ్ర‌త్త.. వెంట‌నే డెలిట్ చేయండి!


జెన్షిన్ ఇంపాక్ట్​

జెన్షిన్ ఇంపాక్ట్ ఈ ఏడాది యాప్​ స్టోర్​, గూగుల్​ ప్లే స్టోర్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్​ డాలర్లను ఆర్జించింది. ఈ గేమ్ 2020 సెప్టెంబర్ 28న లాంచ్​ అయ్యింది. దీన్ని మిహోయో సంస్థ అభివృద్ధి చేసింది.

రోబ్లోక్స్

2021లో అత్యధిక రెవెన్యూ (Revenue) సాధించిన గేమ్స్​ జాబితాలో రోబ్లోక్స్​ 4వ స్థానంలో నిలిచింది. రోబ్లోక్స్​ కార్పొరేషన్ ఈ గేమ్​ను డిజైన్​ చేసింది. 2021 ఏడాదిలో 1.3 బిలియన్​ డాలర్లను ఆర్జించింది.

కాయిన్ మాస్టర్

కాయిన్ మాస్టర్ గేమ్​ను ఇజ్రాయెలీ స్టూడియోకు చెందిన మూన్ యాక్టివ్ అభివృద్ది చేసింది. ఇది ఉచిత, సింగిల్ ప్లేయర్ మొబైల్ గేమ్. 2021లో 1.3 బిలియన్​ డాలర్లను ఆర్జించింది.

పోకీమన్ గో

పోకీమాన్​ గో గేమ్ ఈ ఏడాది మొత్తం 1.2 బిలియన్​ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీన్ని నియాన్టిక్​ సంస్థ అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇది 1 బిలియన్ డౌన్‌లోడ్లను సాధించింది.

కాండీ క్రష్ సాగా

2021లో అత్యధిక రెవెన్యూ సాధించిన గేమ్స్​ జాబితాలో కాండీ క్రష్​ సాగా ఏడో స్థానంలో నిలిచింది. ఈ గేమ్ 2021లో 1.2 బిలియన్​ డాలర్లను ఆర్జించింది. ఈ పాపులర్​ గేమ్​ను కింగ్ సంస్థ అభివృద్ధి చేసింది.

Granted Citizenship: 3,117 మంది ఆఫ్ఘ‌న్‌, పాక్‌, బంగ్లాదేశ్ మైనారిటీల‌కు భార‌తీయ పౌర‌స‌త్వం: కేంద్రం


గారెనా ఫ్రీ ఫైర్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్​ గేమ్​ (Popular Games) గా రాణిస్తోన్న గారెనా ఫ్రీ ఫైర్​ మొబైల్ గేమ్ ఆదాయం పరంగా 8వ స్థానంలో నిలిచింది. ఈ మల్టీప్లేయర్ సర్వైవల్ షూటర్ గేమ్​ ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్​ డాలర్లను ఆర్జించింది.

Published by:Sharath Chandra
First published:

Tags: Latest Technology, Mobile game, Smart phone, Video Games

ఉత్తమ కథలు