Online Banking Tips: ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ 7 సేఫ్టీ టిప్స్ మీకోసమే

Mobile banking tips | మీరు మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తుంటారా? ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? అయితే సైబర్ నేరగాళ్ల బారినపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: March 17, 2020, 11:45 AM IST
Online Banking Tips: ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ 7 సేఫ్టీ టిప్స్ మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బ్యాంకింగ్ లావాదేవీలు సులువైపోయాయి. స్మార్ట్‌ఫోన్‌లోనే లక్షల రూపాయల లావాదేవీలు నిమిషాల్లో చేసెయ్యొచ్చు. అయితే టెక్నాలజీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ని సులభతరం చేసింది కానీ... రిస్క్‌ని కూడా పెంచింది. అందుకే ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్స్ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ లాంటి సేవలు ఉపయోగించేప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేప్పుడు, బిల్లులు చెల్లించేప్పుడు, ఆన్‌లైన్‌లో ఇతర లావాదేవీలు జరిపేప్పుడు అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. మీరు కూడా మొబైల్ బ్యాంకింగ్ చేసేప్పుడు ఈ 7 ఆన్‌లైన్ బ్యాంకింగ్ టిప్స్ గుర్తుంచుకోవాలి.

1. వీక్ పాస్‌వర్డ్స్ పెట్టుకొని మోసపోయేవాళ్లే ఎక్కువ. వీక్ పాస్‌వర్డ్స్ అంటే 123456, abcdef, 111111 ఇలాంటి పాస్‌వర్డ్స్‌ని ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం ఉపయోగించేవారు ఉంటారు. ఇదేవారిని ప్రమాదంలో పడేస్తుంది. అందుకే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలని సూచిస్తుంటారు సైబర్ నిపుణులు. మీ పాస్‌వర్డ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మీరు మోసపోయే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి. మీ పాస్‌వర్డ్స్‌లో లెటర్స్, నెంబర్స్, సింబల్స్ కలిపి ఉండాలి. ఈ కాంబినేషన్‌తో స్ట్రాంగ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎట్టిపరిస్థితుల్లో మీ పుట్టిన తేదీ, బండి నెంబర్లు, యానివర్సరీలు, వయస్సు, ఫోన్ నెంబర్ల లాంటివి పాస్‌వర్డ్స్‌గా పెట్టుకోకూడదు. ఒక అకౌంట్‌కు ఉన్న పాస్‌వర్డ్‌ను మరో అకౌంట్‌కు ఉపయోగించకూడదు.

Mobile banking tips, Internet banking tips, online banking tips, Mobile banking safety, cyber frauds, online frauds, మొబైల్ బ్యాంకింగ్ టిప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ టిప్స్, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు
ప్రతీకాత్మక చిత్రం


2. మీ పాస్‌వర్డ్స్, ఐడీ ఎవరితో షేర్ చేయొద్దు. బ్రౌజర్లలో మీ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ సేవ్ చేసి పెట్టుకోకూడదు. స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆటో లాగిన్ పెట్టుకోకూడదు. దీనివల్ల మీ ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా పోయిందంటే... మొబైల్ దొరికినవాళ్లు ఆన్‌లైన్ లావాదేవీలు చేయడం సులువవుతుంది.

3. మీ అకౌంట్లపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాయి. నెలకోసారి స్టేట్‌మెంట్ చెక్ చేస్తుండాలి. మీకు తెలియని లావాదేవీలు ఏవైనా స్టేట్‌మెంట్‌లో కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉండాలి. ఏ మాత్రం అనుమానం ఉన్నా బ్యాంకులో కంప్లైంట్ చేయడం మర్చిపోవద్దు.

4. మీ బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఎట్టిపరిస్థితుల్లో పబ్లిక్ కంప్యూటర్లు, పబ్లిక్ వైఫై నెట్‌వర్క్స్ ఉపయోగించొద్దు. ఎక్కువ మోసాలు జరిగేది అక్కడే. మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో మాత్రమే లావాదేవీలు జరపాలి. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు పబ్లిక్ వైఫై కాకుండా మీ మొబైల్ హాట్‌స్పాట్ మాత్రమే ఉపయోగించాలి. మీ వైఫై పాస్‌వర్డ్స్ కూడా ఎవరితో షేర్ చేయొద్దు.

Mobile banking tips, Internet banking tips, online banking tips, Mobile banking safety, cyber frauds, online frauds, మొబైల్ బ్యాంకింగ్ టిప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ టిప్స్, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు
ప్రతీకాత్మక చిత్రం
5. మీ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్ మీ స్మార్ట్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్‌, నోటిఫికేషన్‌, ఇమెయిల్‌ వచ్చేలా చూసుకోవాలి. ఒక అలర్ట్ మిస్ అయినా మరో అలర్ట్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. బ్యాంకులు వాట్సప్ అలర్ట్స్ కూడా పంపిస్తుంటాయి. మీకు తెలియకుండా ఏవైనా లావాదేవీలు జరిగితే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి.

6. మీరు ఎప్పుడు మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించినా సైన్ ఔట్ కావడం మర్చిపోవద్దు. మీరు తరచూ ఉపయోగిస్తున్న బ్రౌజర్ అయినా సరే సైన్ ఔట్ కావాలి. అవసరమైతే బ్రౌజర్ హిస్టరీ కూడా క్లియర్ చేయాలి.

7. ప్రైజ్‌లు, గిఫ్ట్‌లు, లాటరీల పేరుతో మీకు వచ్చే ఎస్ఎంఎస్‌లు, ఇమెయిల్స్‌ని పట్టించుకోవద్దు. వాటిలో ఉండే లింక్స్‌ని అస్సలు క్లిక్ చేయొద్దు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్, పాస్‌వర్డ్స్, కార్డు నెంబర్లు, సీవీవీ నెంబర్లు తెలుసుకోవడానికి మోసగాళ్లు వేసే ట్రాప్ ఇది. ఇలాంటి ఇమెయిల్స్ ఎక్కువగా వస్తుంటే బ్లాక్ చేయడం మంచిది. ఎట్టిపరిస్థితుల్లో మీ బ్యాంకు అకౌంట్ వివరాలు, కార్డు డీటెయిల్స్ ఎవరితో షేర్ చేయకూడదు.

ఇవి కూడా చదవండి:

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఇవే...

Aadhaar Address: ఆధార్‌లో చిరునామా మార్చాలా? ఈ 45 అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు

Savings Account: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ టిప్స్‌తో మీ డబ్బులు సేఫ్
Published by: Santhosh Kumar S
First published: March 17, 2020, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading