దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, చాలా యాప్స్ భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొన్ని యాప్స్‌లో డేటా భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా OKCupid, Grindr, ట్రావెల్ యాప్ Bumble, ఈ-కామర్స్ యాప్ Indiamart లతో పాటు గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో లభ్యమయ్యే మైక్రోసాఫ్ట్ యాప్ ఎడ్జ్, టీమ్స్తో సహా జనాదరణ పొందిన అనేక యాప్స్లలో డేటా సెక్యూరిటీ(security )పై ఆందోళనలు వ్యక్తమవుతుంది. వీటిలోని డేటాను హ్యాకర్లు దొంగిలించడానికి అవకాశం ఉందని, అంతేకాకుండా మీ బ్యాంకింగ్కు సంబంధించిన సున్నతమైన డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని చెక్ పాయింట్ పరిశోధకులు అవిరాన్ హజుమ్, జోనాథన్ షిమోనోవిచ్ డిసెంబర్ 3న తమ భద్రతా పరిశోధన బ్లాగులో వెల్లడించారు. తద్వారా గూగుల్ క్రోమ్, ఫేస్బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్(Instagram) వంటి పెద్ద సంఖ్యలో జనాదరణ పొందిన యాప్లలోని యూజర్ల సున్నితమైన డేటాకు కూడా ముప్పు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
డేటింగ్ యాప్స్‌తో వ్యక్తిగత సమాచారానికి ముప్పు..
ఆయా యాప్స్‌లో సెక్యూరిటీ లోపాల గురించి గూగుల్ ప్లే కోర్ రన్‌టైమ్ లైబ్రరీ (Google Play Core runtime library), గూగుల్ ప్లే స్టోర్ సర్వర్‌లతో ఎప్పటికప్పడు సమాచారాన్ని ఇస్తూ లోపాలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా యూజర్ భద్రత లేని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయడం, యాప్స్‌ను అప్డేట్ చేయడం, యాప్స్‌లో రివ్యూస్‌ను నమోదు చేయడం వంటి వాటి ద్వారా సులభంగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చెక్ పాయింట్ నివేదికల ప్రకారం, యూజర్ ఏదైనా కోడ్‌ను చట్టబద్ధమైన యాప్‌లో ఎంటర్ చేసినప్పుడు దానిలో మాల్‌వేర్లను జోడించడానికి హ్యాకర్లను అనుమతిస్తుంది. ఇది యూజర్ బ్యాంకింగ్ సమాచారాన్ని హైజాక్ చేయడం, వారి SMS సందేశాలను చదవడం, స్మార్ట్ఫోన్ లోకేషన్ తెలుసుకోవడం, సోషల్ మీడియా అకౌంట్లను ట్రాక్ చేయడం, యూజర్ తరపున ఇతరులకు సందేశాలను పంపడం వంటి వాటిని చేస్తుంది. తద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల, సాధ్యమైనంత వరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెక్ పాయింట్ యూజర్లను కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FAKE APPS