కొంచెం ఇష్టం... కొంచెం కష్టం... టిక్‌టాక్ బ్యాన్‌పై తెలుగు రాష్ట్రాల స్టార్స్ ఏమన్నారంటే...

Tiktok Ban : టిక్‌టాక్ బ్యాన్‌పై తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు బాధ‌పడుతూనే మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని స‌మ‌ర్ధిస్తున్నారు తెలుగు టిక్ టాక్ స్టార్స్.

news18-telugu
Updated: June 30, 2020, 2:46 PM IST
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం... టిక్‌టాక్ బ్యాన్‌పై తెలుగు రాష్ట్రాల స్టార్స్ ఏమన్నారంటే...
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం... టిక్‌టాక్ బ్యాన్‌పై తెలుగు రాష్ట్రాల స్టార్స్ ఏమన్నారంటే...
  • Share this:
టిక్‌టాక్ సహా... చైనాకి చెందిన 59 యాప్స్‌ని భారత్ బ్యాన్ చెయ్యగా... టిక్‌టాక్ బ్యాన్‌పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ యాప్‌లో దేశవ్యాప్తంగా స్టార్స్ ఉన్నట్లే... మన తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు టిక్ టాక్ స్టార్స్ ఉన్నారు. కేంద్రం నిర్ణయంపై వాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే... చివరకు... బ్యాన్‌ని సమర్థిస్తూనే అభిప్రాయాన్ని ముగిస్తున్నారు. ఓవైపు ఈ యాప్ చాలా మంచిది అంటూనే... మరోవైపు దేశ రక్షణ కోసం కేంద్రం నిర్ణయం సరైనదే అంటున్నారు. నిజానికి టిక్ టాక్ కొందమందికి జీవనోపాధి కలిగించింది. టాలెంట్ అందరికీ తెలిసేలా చేసింది. అందులో డౌట్ లేదు. ఐతే... వేరే ప్లాట్‌ఫామ్ లేకపోవడంతో... చాలా మంది ఇందులో తమ టాలెంట్ చూపించుకున్నారు. ఇలాంటి ఇతర ప్లాట్‌ఫామ్స్ ఉన్నా... అవి ఫేమస్ కాకపోవడంతో... అందరూ టిక్‌టాక్‌నే ఆశ్రయించారు. కానీ తెరవెనక ఆ యాప్ వల్ల ఎదురవుతున్న సమస్యల్ని వారు గుర్తించలేదు. ఇప్పుడు కేంద్రం డేటా ప్రైవసీకి భంగం కలుగుతున్నందువల్లే టిక్‌టాక్‌ని నిషేధించడంతో... బాధగా ఉందంటూనే... ఆర్మీకీ, కేంద్రానికీ సపోర్ట్ ఇస్తామంటున్నారు టిక్ టాక్ స్టార్స్.


ఇండియాలో టిక్‌టాక్‌కి 33 కోట్ల డౌన్‌లోడ్లు ఉన్నాయి. అంటే... ఇండియాలో దాదాపు 5 శాతం మంది ఈ యాప్ వాడుతున్నారు. అలాగే... 3.75 వేల మంది భారత ఉద్యోగులు... బ్యాన్ చేసిన 59 యాప్స్‌లో పనిచేస్తున్నారు. ఇప్పుడు వారంతా వేరే ఉద్యోగాలు చూసుకోక తప్పదన్నది సుస్పష్టం. దీనిపై టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇండియాలో కూడా టిక్ టాక్ లాంటి చాలా యాప్స్ ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ వాటి గురించి పెద్దగా ప్రచారం జరగలేదు. ఇకపై టిక్ టాక్ ఉండదు కాబట్టి... ఇప్పుడు ప్రజలు వాటిని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. తద్వారా ఇండియన్ కంపెనీలకు అది ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇప్పటివరకూ టిక్‌టాక్‌కి వచ్చే ఆదాయం చైనాకు వెళ్లిపోతుంటే... ఇకపై ఇండియన్ యాప్స్‌కి వచ్చే ఆదాయం ఇండియన్స్‌కే దక్కనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరికొంత మంది కేంద్రం నిర్ణయం వల్ల అంతగా ఫలితం ఉండకపోవచ్చంటున్నారు. ఇదివరకు వాట్సాప్ బదులు టెలిగ్రామ్ వాడాలని అనుకున్నా... అది సక్సెస్ కాలేదనీ... అలాగే... ఇప్పుడు టిక్ టాక్ బదులు వేరేవి వాడినా అవి సక్సెస్ కాకపోవచ్చని అంటున్నారు. అంతేకాదు... యూజర్లకు ఏది సౌకర్యంగా ఉంటే దాన్నే వాళ్లు వాడతారనీ... ఆ స్థాయికి ఇండియన్ యాప్స్ చేరాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం భావోద్వేగాలకు సంబంధించినది కావడం వల్ల దానికి ఇప్పుడు మద్దతు లభించినా... దీర్ఘకాలంలో దీని వల్ల పెద్దగా కలిసొచ్చేది ఏదీ ఉండకపోవచ్చంటున్నారు. టిక్‌టాక్‌లో పెట్టుబడులు పెట్టిన ఇండియన్లకు కేంద్రం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ్.

టిక్ టాక్ బ్యాన్ బాధాకరమే అంటున్న టిక్ టాక్ స్టార్ శ్రావణీ... అలాంటి యాప్ వల్ల దేశానికి నష్టం వస్తే... దాన్ని బ్యాన్ చెయ్యాల్సిందే అన్నారు.

ప్రతి అంశంలోనూ మంచీ, చెడూ ఉంటుందనీ... మంచిని స్వీకరించడమే మనం చెయ్యాల్సింది అనే అభిప్రాయం టిక్ టాక్ స్టార్ కీర్తన వ్యక్తం చేశారు. యువతకు టిక్ టాక్ ముఖ్యమైన యాప్ అంటూనే... కేంద్రం నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.

ఇలా టిక్ టాక్ బ్యాన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
First published: June 30, 2020, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading