హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mivi DuoPods F40: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో.. Mivi DuoPods F40 లాంచ్‌.. వివరాలిలా..

Mivi DuoPods F40: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో.. Mivi DuoPods F40 లాంచ్‌.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

50 గంటల బ్యాటరీ లైఫ్‌, బ్లూటూత్ వెర్షన్ 5.1తో మివీ డుయోపోడ్స్‌ ఎఫ్‌40(Mivi DuoPods F40) ఇయర్‌బడ్‌లు ఇండియాలో లాంచ్‌ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, మివీ వెబ్‌సైట్‌లో ఇయర్‌బడ్‌లు లాంచ్ డే ఆఫర్ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఐదు కలర్‌లలో ఇయర్‌బడ్‌లు లభిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

50 గంటల బ్యాటరీ లైఫ్‌(Battery Life), బ్లూటూత్ వెర్షన్(Bluetooth Version) 5.1తో మివీ డుయోపోడ్స్‌ ఎఫ్‌40(Mivi DuoPods F40) ఇయర్‌బడ్‌లు ఇండియాలో(India) లాంచ్‌ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్(Flipkart), మివీ వెబ్‌సైట్‌లో(Mivi Websites) ఇయర్‌బడ్‌లు(Earbuds) లాంచ్ డే ఆఫర్ ధరతో(Offer Cost) అందుబాటులో ఉన్నాయి. ఐదు కలర్‌లలో ఇయర్‌బడ్‌లు లభిస్తున్నాయి. DuoPods F40 IPX4 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌, మెరుగైన గేమింగ్(Gaming), ఎంటర్‌టైన్‌మెంట్ (Entertainment) అనుభవం కోసం లో లేటెన్సీతో వస్తుంది. వినియోగదారులు బ్యాటరీ వినియోగాన్ని ట్రాక్ చేయడానికి వీలుగా ఇయర్‌బడ్స్‌లో బ్యాటరీ కేస్ LED స్క్రీన్‌ ఉంది.

Mini DuoPods F40 ధర, లభ్యత

మివీ నుంచి కొత్తగా లాంచ్‌ అయిన డుయోపోడ్స్‌ ఎఫ్‌40(DuoPods F40) ఇయర్‌బడ్‌లు ఇండియాలో లాంచ్ డే ఆఫర్ కింద రూ.999 కు లభిస్తున్నాయి. లేకపోతే ఇయర్‌బడ్స్ సాధారణ ధర రూ.1,199. అవి ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, మివీ అధికారిక వెబ్‌సైట్‌లో వైట్, బ్లాక్, గ్రే, గ్రీన్, బ్లూ కలర్స్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Mivi DuoPods F40 స్పెసిఫికేషన్లు

మివీ డుయోపోడ్స్‌ ఎఫ్‌40లో స్టూడియో సౌండ్ అనుభవం కోసం 13mm ఎలక్ట్రో-డైనమిక్ డ్రైవర్‌లు ఉన్నాయి. DuoPods F40 ఇయర్‌బడ్‌లు తేలికైనవి, సులువుగా ధరించేందుకు ఎర్గోనామిక్ డిజైన్‌తో వస్తున్నాయి. మెరుగైన కాల్ నాణ్యత కోసం డ్యూయల్-మైక్రోఫోన్‌లను మివీ అందిస్తోంది. సిరి(Siri), గూగుల్‌(Google) అసిస్టెంట్‌ సహా వాయిస్ అసిస్టెంట్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఇయర్‌బడ్‌లు ఆడియో ట్రాక్‌లను మార్చడం, కాల్‌లను యాక్సెప్ట్‌ చేయడం, కాల్‌లను కట్‌ చేయడం కోసం వన్-ట్యాప్ టచ్ బటన్‌ల సదుపాయం ఉంది.

iQoo Neo 6: గేమింగ్ ప్రియుల కోసం సూప‌ర్ ఫోన్‌.. ఫీచ‌ర్స్‌, ధ‌ర వివ‌రాలు తెలుసుకోండి

మివీ డుయోపోడ్స్‌ ఎఫ్‌40 నిరంతరాయంగా మ్యూజిక్‌ వినడం, కాలింగ్ అనుభవం కోసం 70 శాతం వాల్యూమ్‌తో ఒకే ఛార్జ్‌పై 50 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.1 ఫీచర్‌ ఉంది. కేస్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్, బ్యాటరీ వినియోగాన్ని ట్రాక్ చేయడానికి LED డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఇయర్‌బడ్‌లు IPX4 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తాయి కాబట్టి వినియోగదారులు వర్షాలు, వర్కవుట్ సెషన్‌ల సమయంలో కూడా వినియోగించవచ్చు.

Smart Phone: అదిరిపోయే ఫీచ‌ర్‌.. నిమిషాల్లో ఫుల్ చార్జింగ్‌.. వ‌న్ ప్ల‌స్ నుంచి కొత్త మోడల్‌

Mivi సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మిధులా దేవభక్తుని మాట్లాడుతూ..‘కొత్త మివీ డుయోపోడ్స్‌ ఎఫ్‌40 అత్యుత్తమమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల కోసం చూస్తున్న వారికి స్వచ్ఛమైన సంగీత అనుభవాన్ని అందించడానికి రూపొందించాం.

మెరుగైన గేమింగ్, ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ కోసం ఇయర్‌బడ్‌లు లో లేటన్సీతో వస్తున్నాయి. ఇయర్‌బడ్‌ల మన్నికను ప్రీమియం మెటీరియల్‌తో తయారు చేశాం. ఇయర్‌బడ్‌లకు తయారీ లోపాలపై ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది. బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చాం.’ అని పేర్కొన్నారు.

First published:

Tags: Ear phones, Headphones, New features

ఉత్తమ కథలు