Mitron: టిక్‌టాక్ బ్యాన్ తర్వాత మిత్రోన్ దూకుడు.. మరో రూ. 37 కోట్ల నిధులు

గత నెలలో జరిగిన సీడ్ ఫండింగ్‌లో రూ.2కోట్ల నిధులను సమీకరించిన మిత్రోన్.. ఇప్పుడు ఏకంగా రూ.37 కోట్లు సమీకరించింది.

news18-telugu
Updated: August 19, 2020, 10:57 PM IST
Mitron: టిక్‌టాక్ బ్యాన్ తర్వాత మిత్రోన్ దూకుడు.. మరో రూ. 37 కోట్ల నిధులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో చైనీస్ యాప్ టిక్ టాక్‌‌పై నిషేధం విధించిన తర్వాత ఆ గ్యాప్‌ను పూడ్చేందుకు చేసేందుకు చాలా యాప్స్ పోటీపడుతున్నాయి. రొపోసో, మిత్రోన్, చింగారి వంటి యాప్‌లు టిక్ టాక్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో స్వదేశీ షార్ట్ ఫామ్ వీడియో యాప్ మిత్రోన్ దూసుకెళ్తోంది. పెట్టుబడులను సమీకరిస్తూ.. సరికొత్త అప్‌డేట్స్‌తో.. యువతకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ నేతృత్వంలో జరిగిన సిరీస్-A ఫండింగ్‌లో 5 మిలియన్ డాలర్లు (రూ.37 కోట్లు) నిధులను సమీకరించింది మిత్రోన్. 3వన్4 కాపిటల్, అరుణ్ తడాంకికి చెందిన ప్రైవేట్ సిండికేట్ లెట్స్‌వెంచర్‌ కూడా తాజా రౌండ్‌లో పాల్గొన్నాయి.

తాజా రౌండ్ ఫైనాన్సింగ్‌లో డీప్ కల్రా (ఛైర్మన్, మేక్‌మైట్రిప్), అమ్రిష్ రౌ (సీఈఓ, పైన్ ల్యాబ్స్), జిటెన్ గుప్తా (వ్యవస్థాపకుడు, జూపిటర్), అమర్‌జిత్ బాత్రా (ఎండి, స్పాటిఫై ఇండియా), ఆనంద్ చంద్రశేఖరన్ (మాజీ ఫేస్‌బుక్, స్నాప్‌డీల్ ఎగ్జిక్యూటివ్), కరణ్ బజ్వా (ఎండి, గూగుల్ క్లౌడ్, ఇండియా), రాధికా ఘాయ్ (సహ వ్యవస్థాపకురాలు, షాప్‌క్లూస్), శాంతి మోహన్ (వ్యవస్థాపకుడు, లెట్స్‌వెంచర్), టికె కురియన్ (ప్రేమ్‌జీ ఇన్వెస్ట్), మనీష్ విజ్, హరీష్ బహల్ (స్మైల్ గ్రూప్) కూడా పాల్గొన్నారు.

మిత్రోన్.. టిక్ టాక్ తరహాలోనే షార్ట్ ఫామ్ వీడియో షేరింగ్ యాప్. మిత్రోన్‌ను ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి శివాంక్ అగర్వాల్, విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అనీష్ ఖండేల్వాల్ కలిసి స్థాపించారు. వీరిద్దరు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, గతంలో మేక్ మై ట్రిప్‌లో పనిచేశారు.


కాగా, టిక్ టాక్‌పై నిషేధానికి ముందే మిత్రోన్ యువతకు దగ్గరయింది. చాలా మంది ఈ స్వదేశీ యాప్‌కు కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత టిక్ టాక్‌పై నిషేధం విధించాక మిత్రోన్ యాప్‌కు మరింత ఆదరణ పెరిగింది. ప్లే స్టోర్‌లో ఇప్పటికే 3 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్ సాధించింది. నెలకు 9 బిలియన్ వ్యూస్‌తో యువతకు చేరవయిందని మిత్రోన్ ప్రతినిధులు తెలిపారు. గత నెలలో జరిగిన సీడ్ ఫండింగ్‌లో రూ.2కోట్ల నిధులను సమీకరించిన మిత్రోన్.. ఇప్పుడు ఏకంగా రూ.37 కోట్లు సమీకరించింది.
Published by: Shiva Kumar Addula
First published: August 19, 2020, 10:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading