Misson Paani : స్వచ్ఛమైన నీటిని ఇచ్చే గొడుగులు... గుంతకల్ రైల్వే స్టేషన్‌లో వినూత్న ఏర్పాట్లు

#MissionPaani : గ్రీన్ రైల్వేస్‌లో భాగంగా... ఏపీలోని గుంతకల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వాటర్ హార్వెస్టింగ్ గొడుగులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: July 5, 2019, 8:24 AM IST
Misson Paani : స్వచ్ఛమైన నీటిని ఇచ్చే గొడుగులు... గుంతకల్ రైల్వే స్టేషన్‌లో వినూత్న ఏర్పాట్లు
గుంతకల్ రైల్వే స్టేషన్‌లో వర్షపు నీటిని ఆదా చేసే గొడుగులు (Image : Instagram / railminindia)
Krishna Kumar N | news18-telugu
Updated: July 5, 2019, 8:24 AM IST
Indian Railways : వర్షపు నీరు మనపై పడకుండా కాపాడేది గొడుగు. అదే గొడుగును తిరగేస్తే... వర్షపు నీటిని ఒడిసిపట్టి... ఆదా చేస్తుంది. ఉల్టా చాతా పేరుతో... ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ రైల్వే స్టేషన్‌లో ఈ తిరగేసిన గొడుగుల్ని అమర్చారు. ఇవి వర్షపు నీటిని ఆదా చెయ్యడమే కాదు... మనం తాగేందుకు స్వచ్ఛమైన నీటిని ఇస్తాయి. అలాగే... సోలార్ పవర్‌ ద్వారా రాత్రివేళ లైటింగ్‌ ఇస్తాయి. రైల్వేలను పర్యావరణ హితంగా, కాలుష్యం లేకుండా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గ్రీన్ రైల్వేస్ అనే నినాదం అందుకుంది. అందులో భాగంగానే... 6 తిరగేసిన గొడుగుల్ని గుంతకల్ రైల్వే‌స్టేషన్‌లో ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.14 లక్షలు ఖర్చు చేసింది. ఈ గొడుగుల ద్వారా మొబైల్, ల్యాప్‌టాప్ లను ఛార్జింగ్ చేసుకోవచ్చు కూడా.



 




Loading...

View this post on Instagram




 

Major push for Green Railways: In a first of its kind initiative, Guntakal Station in Andhra Pradesh installs Water Harvesting Inverted Umbrellas with sensor-based solar lighting. It also has an integrated plug and play system providing clean water & intelligent lighting.#Indian railways #railwaystations #guntakal #greenrailway#waterharvesting


A post shared by RailMin India (@railminindia) on





మోడల్ 1080గా పిలిచే... ఈ ఆకృతులను వర్షపు నీటిని ఆదా చేసే ఉద్దేశంతో తయారుచేశారు. ఒక్కోటీ 120 కేజీల బరువు ఉంటుంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలుల్ని కూడా ఇవి తట్టుకోగలవు. థింక్ ఫి సస్టైనబుల్ ల్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ... వీటిని... దక్షిణ మధ్య రైల్వేకి సప్లై చేసింది. నీడ ఇచ్చేందుకు, స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకూ, కాంతిని వెదజల్లేందుకూ ఈ మోడల్స్ ఉపయోగపడుతున్నాయి. ఒక్కో గొడుకూ... 40 వాట్స్ కాంతిని ఇస్తున్నాయి. ఒక్కో మోడల్... ఏడాదికి 60వేల లీటర్ల నీటిని కలెక్ట్ చేస్తుంది. దీనికి లింక్ చేసిన ట్యాంక్‌లోకి ఆ వాటర్ వెళ్తాయి. అక్కడి నుంచీ వాటిని తాగు నీటి అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.
First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...