PUBG Mobile: పబ్‌జీ ఆడలేకపోతున్నారా? ఈ ఆఫ్‌లైన్ గేమ్స్ ట్రై చేయండి

PUBG Mobile Alternative Games | పబ్‌జీ మొబైల్ బ్యాన్ చేయడంతో ఇతర గేమ్స్‌కి క్రేజ్ బాగా పెరిగింది. పబ్‌జీ మొబైల్‌కి ప్రత్యామ్నాయంగా ఉన్న గేమ్స్ ఏవో తెలుసుకోండి.

news18-telugu
Updated: October 20, 2020, 11:18 AM IST
PUBG Mobile: పబ్‌జీ ఆడలేకపోతున్నారా? ఈ ఆఫ్‌లైన్ గేమ్స్ ట్రై చేయండి
PUBG Mobile: పబ్‌జీ ఆడలేకపోతున్నారా? ఈ ఆఫ్‌లైన్ గేమ్స్ ట్రై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పబ్‌జీ సంక్షిప్తంగా ప్టేయర్స్ అనౌన్స్ బాటిల్ గ్రౌండ్... ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆన్‌లైన్ గేమ్‌కు యువత బానిసగా మారుతున్నారని సెప్టెంబరు ఆరంభంలో భారత ప్రభుత్వం దీన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీనితో పాటు పబ్‌జీ మొబైల్ గేమ్ ప్రత్యామ్నాయాలైన క్రియేటివ్ డిస్ట్రక్షన్, సైబర్ హంటర్, రూల్స్ ఆఫ్ సర్వైవల్ వంటి మూడు పాపులర్ ఆన్లైన్ గేమ్స్పై కూడా బ్యాన్ విధించింది ప్రభుత్వం. అయితే, పబ్జీ బ్యాన్తో రాయల్ బ్యాటిల్ విభాగంలోని ఆన్లైన్ గేమ్స్లో చాలా శూన్యత ఏర్పడింది. అందువల్ల, ఆన్లైన్తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఆడగల టాప్ బ్యాటిల్ రాయల్ గేమ్స్కు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆఫ్‌లైన్ గేమ్స్ ఆడటానికి తక్కువ మెమరీ, ర్యామ్ కెపాసిటీ అవసరం అవుతుంది. అంతేకాక, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండానే ఈ ఆఫ్లైన్ గేమ్స్ను ఆడవచ్చు. అంతేకాక, ఇవి ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు వెర్షన్లలోనూ అందుబాటులో ఉంటాయి. రాయల్ బ్యాటిల్ గేమ్స్ విభాగంలో పబ్జీకి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న ఆఫ్‌లైన్ గేమ్స్ను పరిశీలిద్దాం.

Fitness Apps: జిమ్‌కు వెళ్లట్లేదా? ఈ ఫిట్‌నెస్ యాప్స్ ట్రై చేయండి మరి

Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ సేల్ మొదలైంది... అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

SCARFALL THE ROYALE COMBAT- ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు వెర్షన్లలోనూ ఈ గేమ్ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ గేమింగ్ మోడ్‌లలో కూడా ఆడవచ్చు. దీనిలో టిపిఎస్ (థర్డ్-పర్సన్ షూటర్), ఎఫ్‌పిఎస్ (ఫస్ట్-పర్సన్ షూటర్) వంటి ఆధునిక వాహనాలు, ప్రత్యర్థులను చంపడానికి కావాల్సిన అత్యాదునిక ఆయుధాల దీనిలో అందుబాటులో ఉంటాయి. ఈ ఆట గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. ఈ గేమ్ను గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఎక్స్క్వ్సాడ్స్ టెక్ డెవలప్ చేసింది. ప్లేయర్ అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి ఆటలో జీటీఏ స్టైల్ మినిమాప్‌ యాక్సెస్ ఉంటుంది.

PVP SHOOTING BATTLE 2020- పివిపి షూటింగ్ బాటిల్ గేమ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గేమింగ్ మోడ్‌లలో అందుబాటులో ఉంది. దీనిలో మ్యప్స్ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఈ గేమ్లో కొత్త ఆయుధాలను కొనుగోలు చేయవచ్చు లేదా మిషన్ల నుండి సేకరించిన పాయింట్లతో పాత వాటిని అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ ఆఫ్లైన్ గేమ్ కేవలం 88MB మొమరీ స్పేస్ను మాత్రమే తీసుకుంటుంది. ఇది ఆండ్రాయిడ్ డివైజెస్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Best Smart TVs: రూ.30,000 లోపు డిస్కౌంట్‌లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే

Amazon Great India Festival: అమెజాన్ సేల్‌లో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

BATTLEGROUND'S SURVIVOR: BATTLE ROYALE- ఈ బాటిల్ రాయల్ గేమ్ పబ్జీ మొబైల్‌కు వలె కనిపిస్తుంది. అయితే, ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో కూడా దీన్ని ఆడవచ్చు. 133MB మెమరీ స్పేస్ను కలిగి ఉండే ఈ గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో 1 లక్షకు పైగా డౌన్‌లోడ్లను కలిగి ఉంది. పబ్జీ మొబైల్ మాదిరిగానే, దీనిలో కూడా ప్లేయర్స్ ఆట ప్రారంభమైనప్పుడు విమానం నుండి దూకి యుద్ధభూమిలో అడుగుపెడతారు.

FREE SURVIVAL: FIRE BATTLEGROUNDS- గూగుల్ ప్లే స్టోర్లో ఈ గేమ్ 4.2 రేటింగ్ను కలిగి ఉంది. ఇది కేవలం 34MB మెమరీ స్పేస్ను మాత్రమే తీసుకుంటుంది. ప్లేయర్ యుద్ధభూమిలో దిగిన తరువాత, శత్రువులను చంపడానికి మైదానంలో దాచిన మెషిన్ గన్స్, పిస్టల్స్, స్నిపర్ రైఫిల్స్, షాట్‌గన్‌ వంటి ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

SWAG SHOOTER- ఆండ్రాయిడ్ మొబైల్స్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ గేమ్ను సూరత్కి చెందిన ఎక్స్స్వ్యాడ్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. 68MB మెమరీ స్పేస్ ఉండే ఈ గేమ్ అన్ని ట్రెడిషనల్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ గేమ్లో 'స్వాగర్' టైటిల్‌ను అన్‌లాక్ చేసిన తర్వాతే ప్లేయర్స్ ఎనిమీ డిటెక్టర్ వంటి స్పెషల్ పవర్స్ను పొందుతారు. స్కార్‌ఫాల్ గేమ్ మాదిరిగానే, ఈ గేమ్లో కూడా టిపిఎస్ (థర్డ్ పర్సన్ షూటర్), ఎఫ్‌పిఎస్ (ఫస్ట్-పర్సన్ షూటర్) వంటి ఆధునిక గేమ్ప్లే అందుబాటులో ఉంటుంది.
Published by: Santhosh Kumar S
First published: October 20, 2020, 11:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading