హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Grand Vitara SUV: మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ కార్.. అదిరిపోయే ఫీచర్స్.. రూ. 11 వేలతో బుక్ చేసుకోవచ్చు..!

Grand Vitara SUV: మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ కార్.. అదిరిపోయే ఫీచర్స్.. రూ. 11 వేలతో బుక్ చేసుకోవచ్చు..!

 మారుతి సుజుకి నుంచి మైండ్ బ్లోయింగ్ కార్.. అదిరిపోయే ఫీచర్స్..  రూ. 11 వేలతో బుక్ చేసుకోవచ్చు..!

మారుతి సుజుకి నుంచి మైండ్ బ్లోయింగ్ కార్.. అదిరిపోయే ఫీచర్స్.. రూ. 11 వేలతో బుక్ చేసుకోవచ్చు..!

మారుతి సుజుకి (Maruti Suzuki )నుంచి త్వరలో మరో కొత్త కారు రిలీజ్ కానుంది. కంపెనీ జులై 20న గ్రాండ్ విటారా ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అర్బన్ క్రూయిజర్, గ్లాంజా తర్వాత టయోటా(Toyota), సుజుకి పార్ట్నర్‌షిప్‌లో వస్తున్న మరో కారు మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV. ఈ కారును మారుతి సుజుకి డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్‌లో రూ. 11,000తో బుక్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

మారుతి సుజుకి (Maruti Suzuki )నుంచి త్వరలో మరో కొత్త కారు రిలీజ్ కానుంది. కంపెనీ జులై 20న గ్రాండ్ విటారా ఎస్‌యూవీ(SUV)ని ఆవిష్కరించింది. అర్బన్ క్రూయిజర్, గ్లాంజా తర్వాత టయోటా, సుజుకి పార్ట్నర్‌షిప్‌లో వస్తున్న మరో కారు మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV. ఈ కారును మారుతి సుజుకి డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్‌లో రూ. 11,000తో బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ వెహికల్ మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే ఇది సెల్ఫ్-చార్జింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్ అని సంస్థ తెలిపింది. గ్రాండ్ విటారా SUV ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

డిజైన్, ఫీచర్లు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా డిజైన్ టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV మాదిరిగానే కనిపిస్తున్నా, దీనికి భిన్నమైన ప్రత్యేకతలు ఉన్నాయి. SUV ముందు భాగంలో ట్రై-LED DRLలు ఉన్నాయి. క్రోమ్ స్ట్రిప్‌ ఉన్న పియానో ఫినిషింగ్ గ్రిల్‌తో కొత్త లుక్‌లో కనిపిస్తుంది. పొడవైన బంపర్, స్పోర్టి ఎయిర్ డ్యామ్, ఫుల్-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో కారు డిజైన్ కొత్తగా కనిపిస్తోంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుకవైపు క్రోమ్ స్ట్రిప్‌తో ఇంటిగ్రేట్ అయిన ట్రైఎల్ఈడీ టెయిల్ లైట్లు, స్ట్రిప్ మధ్యలో సుజుకి లోగో, దాని కింద మోడల్ పేరు వంటివి ఈ కొత్త కారు డిజైన్‌ ప్రత్యేకతలు.

దీని క్యాబిన్ మారుతి సుజుకి బ్రెజ్జా కాంపాక్ట్ SUV (2022 మోడల్) లాగా కనిపిస్తుంది. కంపెనీ డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లలో ప్యాడెడ్ లెదర్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉపయోగించింది. డ్యుయల్ టోన్ ఇంటీరియర్ ఫుల్ హైబ్రిడ్ వెర్షన్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుందని, మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్‌లు ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్-డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి అనేక ఇతర స్మార్ట్ కార్ ఫీచర్‌తో ఈ కారు రానుంది.

ఇదీ చదవండి: Technical Bugs: వామ్మో.. ఆ అమెరికా కంపెనీ సాఫ్ట్ వేర్ లో బగ్.. రెచ్చిపోతున్న హ్యాకర్లు !

6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణీకులకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లు మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV ప్రత్యేకతలు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. టయోటా(Toyota) 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్.. 92hp పవర్‌ను, 122Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 79hp, 141Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు పెయిర్డ్‌గా ఉంటుంది. పవర్‌ట్రెయిన్ కంపెనీ సొంత ఇ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో లింక్ అయ్యి ఉంటుంది. ఈ కారు మారుతి సుజుకి 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 103hp, 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్ అయ్యి ఉంటుంది.

First published:

Tags: Electric cars, MARUTI SUZUKI, SUV, Toyota

ఉత్తమ కథలు