• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • MICROSOFT SURFACE LAPTOP 4 LAUNCHED KNOW PRICE AND SPECIFICATIONS SS GH

Microsoft Laptop: మైక్రోసాఫ్ట్ నుంచి సర్ఫేస్ ల్యాప్‌టాప్ 4 లాంఛ్​... ధర, ఫీచర్ల వివరాలివే

Microsoft Laptop: మైక్రోసాఫ్ట్ నుంచి సర్ఫేస్ ల్యాప్‌టాప్ 4 లాంఛ్​... ధర, ఫీచర్ల వివరాలివే

Microsoft Laptop | మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త ల్యాప్‌టాప్ రిలీజ్ అయింది. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  • Share this:
అంతర్జాతీయ టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తులను కూడా విక్రయిస్తుందన్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ తాజాగా తన సర్ఫేస్​ సిరీస్​లో సరికొత్త ల్యాప్​టాప్​ను భారత మార్కెట్​లో విడుదల చేసింది. సర్ఫేస్ 4 పేరుతో లాంఛ్ అయిన ఈ ల్యాప్​టాప్​ ధరను రూ. 1,02,999 గా నిర్ణయించింది. భారత్​లోని కమర్షియల్​, ఎడ్యుకేషన్​ కస్టమర్ల అన్ని అవసరాలను తీర్చే విధంగా ఈ ల్యాప్​టాప్​ను డిజైన్​ చేశారు. ఇది బ్లాక్​, ప్లాటినమ్​ కలర్ల ఆప్షన్లలో అల్కాంటారా లేదా మెటల్ ఫినిషింగ్‌తో అందుబాటులో ఉంటుంది. దీన్ని గుర్తింపు పొందిన రిటైల్​ స్టోర్లు, ప్రముఖ ఈ–కామర్స్​ ప్లాట్​ఫామ్​ అమెజాన్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సర్ఫేస్​ ల్యాప్​టాప్​లో మైక్రోసాఫ్ట్ AMD రైజెన్, ఇంటెల్​ కోర్​ చిప్​సెట్​ వంటి రెండు ఆప్షన్లను చేర్చింది. ఈ ల్యాప్​టాప్​ 13.5 అంగుళాలు, 15 అంగుళాల టచ్​స్క్రీన్​ వేరియంట్లలో లభిస్తుంది. 13.5- అంగుళాల వేరియంట్​ ప్రొడక్టివిటీ, పోర్టబిలిటీకి, 15 అంగుళాల వేరియంట్​ మల్టీ టాస్కింగ్‌కు అనువుగా ఉంటుందని మైక్రోసాఫ్ట్​ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ 4లో 11 వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ లేదా AMD రైజెన్ 4000 ప్రాసెసర్‌ లభిస్తుంది. వీటికి తోడు రేడియన్ గ్రాఫిక్స్ సపోర్ట్​ కూడా ఉంటుంది.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

Jio 4G Data Plans: మొబైల్ డేటా సరిపోవట్లేదా? జియో అందిస్తున్న 4జీ ప్లాన్స్ ఇవే

సర్ఫేస్ ల్యాప్‌టాప్ 3 కంటే ఈ సరికొత్త ల్యాప్​టాప్​ 70 శాతం మెరుగైన పనితీరును, మంచి బ్యాటరీ లైఫ్​ అందిస్తుందని మైక్రోసాఫ్ట్​ స్పష్టం చేసింది. ఇక, ధర విషయానికి వస్తే.. ఇది ప్రాసెసర్, సైజ్​పై ఆధారపడి ఉంటుంది. ఇక, మిగతా ఫీచర్లన్నీ రెండు ల్యాప్‌టాప్‌లలో సమానంగా ఉంటాయి. వీటిలో డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్, బిల్ట్​ ఇన్​ హెచ్​డీ కెమెరా వంటివి లభిస్తాయి. ఇంటిగ్రేటెడ్ హార్డ్‌వేర్, ఫర్మ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఐడెంటిటీ ప్రొటెక్షన్‌తో ఈ సరికొత్త ల్యాప్‌టాప్​కు మరింత భద్రత చేకూరుతుందని కంపెనీ తెలిపింది.

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ టీవీ... ధర రూ.21,999 మాత్రమే

Jio Plans: జియో ఫోన్ వాడుతున్నారా? రూ.39 నుంచి లభించే రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

ఏ వేరియంట్​కు ఎంత ధరంటే?


మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ 4 ప్రారంభ వేరియంట్​ రూ.102,999 ధర వద్ద లభిస్తుంది. 13.5 అంగుళాల ఈ బేస్ మోడల్‌లో AMD రైజెన్ 5 4680U ప్రాసెసర్, 8GB RAM, 256GB SSD స్టోరేజ్​ని అందించింది. AMD రైజెన్ 7 4980 యు ప్రాసెసర్‌తో కూడిన 15 అంగుళాల మోడల్ రూ.1,34,999 ధర వద్ద లభిస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ అందించారు. ఇక, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ కలిగిన ఇంటెల్ కోర్ ఐ 5 వేరియంట్‌కు రూ .151,999 ఖర్చవుతుంది. ఇంటెల్ కోర్ i7–1185G7, 16 జిబి ర్యామ్, 512 జిబి ఎస్‌ఎస్‌డి వేరియంట్​కు రూ .1,07,499 నుండి రూ. 1,77,499 వరకు ఖర్చవుతుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ 4ను స్థానిక కమర్షియల్​ రీసెల్లర్స్​, రిటైల్ స్టోర్స్​ లేదా అమెజాన్ సైట్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: