MICROSOFT SURFACE EVENT ANNOUNCEMENTS WERE MADE ABOUT SURFACE PRO 8 SURFACE PRO X SURFACE DUO 2 AND OTHER PRODUCTS GH SK
Microsoft Surface: మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ఈవెంట్.. సరికొత్త ఆవిష్కరణలు.. అద్భుతమైన ఫీచర్లు
ప్రతీకాత్మక చిత్రం
Microsoft surface:మైక్రోసాఫ్ట్ సరికొత్త సర్ఫేస్ ఈవెంట్లో ఆవిష్కరించిన వాటిల్లో అత్యంత ఆసక్తికరమైనది సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో. ఇందులో డిటాచబుల్ స్క్రీన్ లేదు కానీ, దాన్ని కీ బోర్డు వరకు లాగవచ్చు. ట్యాబ్లెట్గా మార్చుకునే వెసులుబాటు ఉండటం దీని ప్రత్యేకత.
Microsoft Surface: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తన సర్ఫేస్ శ్రేణిలో సరికొత్త సర్ఫేస్ ప్రో 8 (Surface pro 8), సర్ఫేస్ ప్రో X (Surface pro x), సర్ఫేస్ డ్యూ 2 (Surface duo 2) తో పాటు మరికొన్ని కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. సంస్థ అభివృద్ధి చేసిన టచ్ స్క్రీన్, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు వంటి డివైజ్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఆధునిక గ్యాడ్జెట్లకు సర్ఫేస్ అని సంస్థ పేరు పెట్టింది. 2 ఇన్ 1 డిటాచబుల్ నోట్‌బుక్స్, ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్పై మల్చుకునే ఎన్నో అత్యాధునిక ఫీచర్లు మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ సొంతం. సరికొత్త విండోస్ వెర్షన్ 11ను మైక్రోసాఫ్ట్ త్వరలో లాంచ్ చేయనుంది. ఈ క్రమంలో కొత్త తరం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే సరికొత్త ఫస్ట్ పార్టీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
* సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో
మైక్రోసాఫ్ట్ సరికొత్త సర్ఫేస్ ఈవెంట్లో ఆవిష్కరించిన వాటిల్లో అత్యంత ఆసక్తికరమైనది సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో. ఇందులో డిటాచబుల్ స్క్రీన్ లేదు కానీ, దాన్ని కీ బోర్డు వరకు లాగవచ్చు. ట్యాబ్లెట్గా మార్చుకునే వెసులుబాటు ఉండటం దీని ప్రత్యేకత. వీడియో కాల్స్ కోసం ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేయగల సామర్థ్యం ఉన్న కెమెరా ఉంది. అంతే కాదు డాల్బీ ఆట్మోస్కు చెందిన నాలుగు ఓమ్నిసోనిక్ స్పీకర్లు, రెండు థండర్‌బోల్ట్ 4 పోర్టులు దీని మరో ప్రత్యేకత.
కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ మొబైల్స్ వచ్చిన తర్వాత పెన్నుతో రాయడం చాలా మంది మర్చిపోయారు. కాని ఆ అనుభూతిని అందించేందుకు మైక్రోసాఫ్ట్ సరికొత్త స్టైలస్‌ను స్లిమ్ పెన్ 2 పేరుతో లాంఛ్ చేసింది. విండోస్ 11 ఫీచర్స్‌కు అనుగుణంగా ఉండే ఈ స్లిమ్ పెన్‌తో రాస్తుంటే.. పెన్నుతో పేపర్‌పై రాసినట్టు అనుభూతి కలుగుతుంది.
సర్ఫేస్ ప్రో 8
సర్ఫేస్ సిరీస్‌లో సరికొత్తగా లాంచ్ చేసిన సర్ఫేస్ ప్రో 8 ల్యాప్‌టాప్.. 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన 13 ఇంచ్ పిక్సెల్ సెన్స్ టచ్ స్క్రీన్‌తో లభిస్తుంది. 32జీబీ వరకు ర్యామ్ కలిగిన ఈ వినూత్న గ్యాడ్జెట్‌ను ఇంటెల్ 11వ జనరేషన్ ప్రాసెసర్ నడిపిస్తుంది. రెండు యూఎస్బీ-సి ధండర్బోల్ట్ 4 పోర్టులతో పాటు ఛార్జింగ్ కోసం ప్రత్యేకమైన సర్ఫేస్ కనెక్ట్ పోర్టు కలిగి ఉండటం దీని మరో ప్రత్యేకత.
* సర్ఫేస్ ప్రో X
దీనికి కొత్తగా ఎటువంటి హార్డ్‌వేర్ యాడ్ చేయలేదు కాని కేవలం వై-ఫై మోడల్‌పై పనిచేసే విధానాన్ని అందించింది మైక్రోసాఫ్ట్. ఈ కారణంగా దీని ప్రారంభ ధర $100 తగ్గుతుంది.
* సర్ఫేస్ డ్యుయో 2
ఒరిజినల్ సర్ఫేస్ డ్యుయో అద్భుతంగా ఉన్నప్పటికీ అందులో ఉన్న స్వల్ప లోపాలను ఈ సరికొత్త సర్ఫేస్ డ్యుయో 2 చక్కదిద్దింది. పాతదానితో పోల్చితే ఇది ఇంకొంచెం స్లిమ్‌గా సన్నగా ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌తో కూడిన డివైస్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
* సర్ఫేస్ గో 3
మైక్రోసాప్ట్లో అతి చిన్న 2 ఇన్ 1 డివైజ్ అయిన గో 3 మోడల్‌కు ఇప్పుడు హార్డ్‌వేర్ అప్‌గ్రేడేషన్ వచ్చింది. ఇందులో బేస్ మోడల్స్‌కు పెంటియం గోల్డ్ 6500Y ప్రాసెసర్ ఉందిజ ఖరీదైన రకాల కోసం టెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల గతంలో పోల్చితే గో ఇప్పుడు అరవై శాతం వేగంగా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ ప్రొడక్ట్స్‌ను ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.