ప్రముఖ టెక్ దిగ్గజం వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 2017 నుంచి, మైక్రోసాఫ్ట్(Microsoft) తన ఆఫీస్ సూట్‌ను గూగుల్ ప్లే స్టోర్(Google play store) ద్వారా క్రోమ్‌బుక్ (Chromebook) వినియోగదారులకు అందిస్తోంది. ఇకపై ఆ సేవలను సెప్టెంబర్ 18 నుంచి నిలిపివేయనున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ కొంత కాలంగా తన మొబైల్ వినియోగదారులకు Word, Excel, PowerPoint, OneNote మరియు Outlook సేవలను అందిస్తుంది.
ప్రస్తుతం ఆ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిసింది. టెక్ క్రంచ్ ప్రకారం, టెక్ దిగ్గజం జనాదరణ పొందిన మొబైల్ పరికరాన్ని పూర్తిగా వదిలిపెట్టడం లేదని.. డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌కు బదులుగా, మైక్రోసాఫ్ట్ వినియోగదారులను వెబ్‌కు వెళ్లమని ప్రోత్సహిస్తోందని చెబుతుంది. ఇకమీద క్రోమ్ బుక్‌ని వినియోగించాలంటే ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ 365 సబ్‌స్క్రీప్షన్(Subscription) తీసుకోవాలిని సూచిస్తోంది. వినియోదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు మెక్రోసాఫ్ట్ తెలిపింది. మెక్రోసాఫ్ట్ 365 సబ్‌స్క్రిప్షన్ ద్వారా సాధారణం కన్నా ఎక్కువ ఆఫీస్ టెప్లెంట్లను వినియోగించవచ్చని తెలిపింది. క్రోమ్‌బుక్ గూగుల్ క్రోమ్(Google chrome) ఓఎస్‌పై నిర్వహించబడుతుంది. అయితే మైక్రోసాఫ్ట్ నెమ్మదిగా క్రోమ్‌బుక్ వినియోగాన్ని తగ్గించినా.. పలు ఆండ్రోయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్(Mobile)లో అలానే ఉంటుందని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.