Home /News /technology /

MICROSOFT READY TO END SUPPORT FOR WINDOWS 8 1 VERSION NEXT YEAR UMG GH

Windows 8.1: 'విండోస్‌'కు మైక్రోసాఫ్ట్‌ ఎండ్ కార్డ్.. వచ్చే ఏడాది నుంచి సేవలు రద్దు

విండోస్ 8.1కి మైక్రోసాఫ్ట్ ఎండ్ కార్డ్ చెప్పనుంది.

విండోస్ 8.1కి మైక్రోసాఫ్ట్ ఎండ్ కార్డ్ చెప్పనుంది.

మైక్రోసాఫ్ట్‌ నుంచి వచ్చిన విండోస్ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో పాత వెర్షన్‌ విండోస్ 8.1(Windows 8.1) సేవలను నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్‌ నిర్ణయం తీసుకుంది.

మైక్రోసాఫ్ట్‌ కంపెనీ (Microsoft) విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను (Windows 11 Operating System) కొత్తగా లాంచ్‌ చేసింది. అయితే దీనికి ముందు అందుబాటులోకి వచ్చిన విండోస్ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో పాత వెర్షన్‌ విండోస్ 8.1(Windows 8.1) సేవలను నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్‌ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘2023 జనవరి నుంచి విండోస్‌ 8.1 వెర్షన్‌కు అప్‌డేట్‌లు, ఫీచర్‌లు అందుబాటులోకి రావు. ఇప్పటికీ ఈ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులకు వచ్చే నెల నుంచి నోటిఫికేషన్‌లు పంపుతాం. విండోస్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు 2016 జనవరి 12న సపోర్ట్ నిలిపివేశాం. 2023 జనవరి 10 నుంచి విండోస్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సేవలు నిలిచిపోతాయి. విండోస్‌ 8 లేదా విండోస్‌ 8.1లో నిర్ణీత తేదీల తర్వాత మైక్రోసాఫ్ట్‌ 365 యాప్‌లు రన్‌ కావు. పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ సమస్యలు రాకుండా వినియోగదారులు విండోస్‌ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ కావాలని సూచిస్తున్నాం.’ అని మైక్రోసాఫ్ట్ తాజా నోట్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లన్నీ హ్యాక్..! గూగుల్ సంచలన రిపోర్ట్..!!


ప్రాథమికంగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు ఎక్స్‌టెండెడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌(ESU-Extended Security Update) ప్రోగ్రామ్‌ను మైక్రోసాఫ్ట్‌ అందించదు. గడువు తర్వాత విండోస్‌ 8.1లో మైక్రోసాఫ్ట్‌ 365ను రన్‌ చేస్తుంటే.. ఆఫీస్‌ యాప్‌లకు అప్‌డేట్‌లు రావు. ఫీచర్, సెక్యూరిటీ ఇతర క్వాలిటీ అప్‌డేట్‌లు కూడా లభించే అవకాశం లేదు. అందువల్ల వినియోగదారులు కొత్త వెర్షన్‌కు మారాలని కంపెనీ సూచిస్తోంది.

విండోస్‌ 8.1 లేదా విండోస్‌ 8కు సపోర్ట్‌ చేస్తున్న డివైజ్‌లు విండోస్‌ 11కి అప్‌గ్రేడ్ కావడానికి హార్డ్‌వేర్ పరంగా సపోర్ట్‌ చేయవు. ఈ సందర్భంలో ప్రత్యామ్నాయంగా కంపాటబుల్ విండోస్ 8, 8.1 PCలను విండోస్ 10కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఫుల్ వెర్షన్‌ను కొనుగోలు చేయాలని కంపెనీ పేర్కొంది.



ఇప్పుడు విండోస్‌ 8 లేదా 8.1 వెర్షన్‌లను వినియోగిస్తున్న వారు విండోస్‌ 11కు అప్‌గ్రేడ్ కావాలని మైక్రోసాఫ్ట్‌ సూచిస్తోంది. 2025 అక్టోబర్ 14 వరకు విండోస్‌ 10కి సపోర్ట్‌ ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. కాబట్టి ఈసారి పర్సనల్‌ కంప్యూటర్‌ కొనేవారు విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉండేలా చూసుకోవాలి. వచ్చే మూడేళ్లలోనే మరో పర్సనల్‌ కంప్యూటర్‌ కొనుగోలు చేసే అవసరం ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది.

కొద్ది రోజుల క్రితం, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ వెబ్‌ బ్రౌజర్‌ సేవలను మైక్రోసాఫ్ట్‌ నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా విండోస్ సిస్టమ్‌లలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌తో దాన్ని భర్తీ చేసింది. కొత్త ఎడ్జ్ బ్రౌజర్ Chromium ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది తాజా ఫర్మ్‌వేర్, ప్లగిన్‌లకు సపోర్ట్‌ చేస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Internet, Microsoft, Tech news, Windows

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు