హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Scanning Apps: డాక్యుమెంట్ స్కాన్ చేయాలా? ఈ 7 యాప్స్ మీకోసమే

Scanning Apps: డాక్యుమెంట్ స్కాన్ చేయాలా? ఈ 7 యాప్స్ మీకోసమే

Scanning Apps: డాక్యుమెంట్ స్కాన్ చేయాలా? ఈ 7 యాప్స్ మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)

Scanning Apps: డాక్యుమెంట్ స్కాన్ చేయాలా? ఈ 7 యాప్స్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

Scanning Apps | గతంలో CamScanner యాప్ పాపులర్ అయింది. కానీ భారత ప్రభుత్వం ఈ యాప్‌ను బ్యాన్ చేసిన తర్వాత ఇతర యాప్స్‌కి క్రేజ్ లభిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ స్కానర్ యాప్స్ గురించి తెలుసుకోండి.

ఒకప్పుడు ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ చేయాలంటే స్కానర్ తప్పనిసరిగా కావాల్సి ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ద్వారా డాక్యుమెంట్స్ ఈజీగా స్కాన్ చేస్తున్నారు. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉంటే ఫోటో క్లిక్ చేసి దాచుకోవడం అలవాటు. అయితే డాక్యుమెంట్స్ స్కాన్ చేయడం కోసం ప్రత్యేకంగా యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ ద్వారా స్కాన్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ ఒకే ఫోల్టర్‌లో ఉంటాయి. పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు తీసుకోవడానికి క్యాన్సల్డ్ చెక్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడం అవసరం. ఇక ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డ్ (Aadhaar Card), పాన్ కార్డ్ (PAN Card) లాంటి ఐడీ కార్డ్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఇలాంటి డాక్యుమెంట్స్ స్కాన్ చేయడానికి స్కానర్ యాప్స్ చాలా ఉన్నాయి. 7 బెస్ట్ యాప్స్ గురించి తెలుసుకోండి.

Adobe Scan: అడోబి స్కాన్ యాప్ డాక్యుమెంట్‌లో ఉన్న టెక్స్‌ట్‌ని గుర్తిస్తుంది. PDF, JPEG ఫార్మాట్‌లో డాక్యుమెంట్ సేవ్ చేయొచ్చు. డాక్యుమెంట్ సైజ్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇప్పటికే గ్యాలరీలో ఉన్న ఇమేజెస్‌ని ఈ యాప్‌లోకి ఇంపోర్ట్ చేయొచ్చు.

Samsung Galaxy M52 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,500 డిస్కౌంట్... ఆఫర్ 3 రోజులే

Microsoft Office Lens: మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్ యాప్ ద్వారా వైట్‌బోర్డ్స్, డాక్యుమెంట్స్ స్కాన్ చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ రూపొందించిన యాప్ ఇది. ఈ యాప్ కూడా ఉచితమే. గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. గ్యాలరీలో గతంలో స్కాన్ చేసిన డాక్యుమెంట్స్‌ని ఈ యాప్‌లోకి ఇంపోర్ట్ చేయొచ్చు.

Google Drive: గూగుల్ డ్రైవ్ యాప్ ద్వారా డాక్యుమెంట్స్ స్కాన్ చేయొచ్చన్న విషయం చాలామంది యూజర్లకు తెలియదు. New ఆప్షన్ పైన క్లిక్ చేస్తే స్కాన్ ఆప్షన్ కనిపిస్తుంది. డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత OK క్లిక్ చేయాలి. ఎక్కువ డాక్యుమెంట్స్ ఉంటే Bulk add పైన క్లిక్ చేసి డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి. డ్రైవ్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఫోల్డర్ సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి.

Kaagaz Scanner: హిందీలో కాగజ్ అంటే పేపర్ అని అర్థం. గతంలో CamScanner యాప్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ కాగజ్ స్కానర్ యాప్‌లో ఉన్నాయి. CamScanner బ్యాన్ చేసిన తర్వాత కాగజ్ స్కానర్ యాప్ పాపులర్ అయింది. గత ఏడాదిగా కాగజ్ స్కానర్ యాప్ డౌన్‌లోడ్స్ కూడా పెరిగాయి.

Tecno Camon 18: టెక్నో కేమన్ 18 సేల్ ప్రారంభం... రూ.1,999 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం

TurboScan: టర్బో స్కాన్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో నోట్‌ప్యాడ్‌లా పనిచేస్తుంది. ఒకేసారి ఎక్కువ పేజీలు ఉన్న డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేయొచ్చు. దీంతో పాటు ఇమేజెస్ ఇంపోర్ట్ చేయొచ్చు. డాక్యుమెంట్ ఎడ్జ్ డిటెక్షన్, పర్‌స్పెక్టీవ్ కరెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు.

FineReader PDF: ఫైన్‌రీడర్ పీడీఎఫ్ యాప్ అనేక ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత టెక్స్‌ట్ ఎడిట్ చేయొచ్చు. 12 రకాల ఆఫీస్ ఫార్మాట్స్‌లో షేర్ చేయొచ్చు. ఫోటో స్కానర్, రిసిప్ట్ స్కానర్, స్లైడ్ స్కానర్, బిజినెస్ కార్డ్ స్కానర్, బుక్ స్కానర్‌లా ఈ యాప్ పనిచేస్తుంది. ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు.

Smart Doc Scanner: గూగుల్ ప్లేస్టోర్‌లో స్మార్ట్ డాక్ స్కానర్ యాప్‌కు 4.4 స్టార్ రేటింగ్స్ ఉండటం విశేషం. ఈ యాప్ అడోబి స్కాన్ యాప్ లాగానే ఉంటుంది. సులువుగా ఉపయోగించొచ్చు. యూజర్ ఇంటర్‌ఫేస్ మోడర్న్‌గా ఉంటుంది. ఈ యాప్ కూడా డాక్యుమెంట్ స్కానింగ్, షేరింగ్ లాంటి అనేక ఫీచర్స్‌ని అందిస్తుంది.

First published:

Tags: Mobile App, Smartphone

ఉత్తమ కథలు