క్లౌడ్ పీసీ సొల్యూషన్- విండోస్ 365ను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది మైక్రోసాఫ్ట్. దీని ధరలను సైతం సంస్త ప్రకటించింది. జులైలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఇన్స్పైర్- 2021 కార్యక్రమంలో ఈ సొల్యూషన్‌ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. విండోస్ 365ను క్లౌడ్ పీసీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది క్లౌడ్‌లో ఫుల్ విండోస్ ఎక్స్‌పీరియెన్స్‌ను వినియోగదారులకు అందించనుంది. వివరంగా చెప్పాలంటే.. విండోస్ 365 అనేది మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ పీసీ సర్వీస్. ఇది వినియోగదారులకు వివిధ రకాల వర్చువల్ CPU, RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో పూర్తి స్థాయి కంప్యూటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అమెరికాలో దీని ధర 20 డాలర్ల (రూ.1,555) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో విండోస్ 365 బిజినెస్, విండోస్ 365 ఎంటర్ప్రైజ్ పేరుతో రెండు విభిన్న ఎడిషన్లు అందుబాటులో ఉన్నాయి.
మన దేశంలో విండోస్ 365 సేవల కోసం వినియోగదారులు నెలకు రూ.1555 (ప్రారంభ ధర) చెల్లించాల్సి ఉంటుంది. సేవలను బట్టి ఈ మొత్తం రూ.12,295 వరకు పెరుగుతుంది. రెండు ఎడిషన్ల ప్రారంభ, అత్యధిక ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. విండోస్ 365 బిజినెస్ SKU(Stock Keeping Unit) ను 300 మంది వినియోగదారులు మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే 300 మంది యూజర్లు లేదా ఉద్యోగులు ఉన్న సంస్థల కోసం దీన్ని అభివృద్ధి చేశారు. ప్రైమరీ విండోస్ 365 బిజినెస్ SKUలను ఉపయోగించే వారికి, విండోస్ హైబ్రిడ్ బెనిఫిట్ కూడా అవసరం ఉంటుంది. విండోస్ 10 ప్రో లైసెన్స్ ఉన్నవారికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
నెలకు రూ.1,555 ప్రారంభ ధర వద్ద ఒక వినియోగదారుడు ఒక వర్చువల్ కోర్ ప్రాసెసర్, 64GB స్టోరేజ్, 2GB RAM పొందవచ్చు. అయితే రూ.2,180 ధరకు యూజర్ రెండు వర్చువల్ కోర్లు, 4GB ర్యామ్ పొందవచ్చు. విండోస్ 10 ప్రో వ్యాలీడ్ లైసెన్సులు లేని వినియోగదారులు.. విండోస్ హైబ్రిడ్ బెనిఫిట్స్ పొందలేరు. ఇలాంటి వారు రూ.1,865 చెల్లించి ప్రైమరీ విండోస్ 365 బిజినెస్ SKUని ఒక నెల వరకు యాక్సెస్ చేసుకోవచ్చు.
విండోస్ హైబ్రిడ్ బెనిఫిట్ ఉన్న యూజర్లు రూ.12,295 చెల్లించి ఎనిమిది వర్చువల్ కోర్లు, 32GB RAM, 512GB స్టోరేజ్ కెపాసిటీతో హయస్ట్ ఎండ్ SKU ని పొందవచ్చు. విండోస్ 10 ప్రో లైసెన్స్ లేని రెగ్యులర్ కస్టమర్లు టాప్-ఎండ్ SKU కోసం నెలకు రూ.12,605 చెల్లించాల్సి ఉంటుంది. విండోస్ 365 బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం వెర్షన్లకు క్లౌడ్ పీసీని రెండు నెలల పాటు ఉచితంగా పొందే అవకాశం ఉంది. అయితే ఈ ట్రయల్ పీరియడ్ ముగిసిన తర్వాత.. ఆటోమెటిక్ పేమెంట్ ద్వారా సబ్స్క్రిప్షన్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.