టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న విండోస్ 11 వచ్చేసింది. గురువారం జరిగిన వర్చువల్ మీటింగ్‌లో మైక్రోసాఫ్గ్ ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. 2015లో విడుదలైన విండోస్ 10 తర్వాత మైక్రోసాఫ్ట్ నుంచి వస్తోన్న తదుపరి వెర్షన్ ఇదే కావడంతో దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆకర్షణీయంగా కనిపించేలా మైక్రోసాఫ్ట్ అనేక అప్‌డేట్స్ తీసుకొచ్చింది. అనేక సింబల్స్, థీమ్స్‌ను కూడా రీ డిజైన్ చేసింది. విండోస్ 11 ఇప్పుడు ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
విండోస్ 11 ఆవిష్కరణ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ "విండోస్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఘట్టం. రానున్న పదేళ్ల వరకు వినియోగదారుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా దీన్ని రూపొందించాం. విండోస్ 11లో స్టార్ట్ మెనూ మీకు సరికొత్త అనూభూతి ఇస్తుంది. టాస్క్ బార్, ఫాంట్, ఐకాన్ విషయంలో ఎన్నో మార్పులు చేశాం. విండోస్ 11 ఓఎస్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్‌లను కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ ఏడాది చివరి నాటికల్లా కొత్త కంప్యూటర్లతో పాటు విండోస్ 10 యూజర్లకు ఈ సరికొత్త ఓఎస్‌ను ఉచితంగా అందుబాటులోకి వస్తుంది" అని చెప్పారు.
Vivo V21e 5G: వివో వీ21ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్
Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ప్రీ-ఆర్డర్ సేల్... రూ.3,000 డిస్కౌంట్
విండోస్ 11 ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా మీ సిస్టమ్ వేగంగా పనిచేస్తుంది. తద్వారా వెబ్ బ్రౌజింగ్, యాప్స్లోడ్కు ఎక్కువ సమయం తీసుకోదు. దీనికి అనుగుణంగా విండోస్ 11 ఓఎస్‌లో అనేక ఆప్టిమైజేషన్లను చేర్చింది. కొత్త విండోస్ మునుపటి వెర్షన్ల కంటే ఎక్కువ ఎఫీషియన్సీ కలిగి ఉంటుంది. ఇది మీ డేటాకు మరింత భద్రతనిస్తుంది. విండోస్ 11లో కొత్తగా స్నాప్ లేఅవుట్ అనే ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. ఇది మల్టిపుల్ సిస్టమ్స్‌లో పనిచేసే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
సరికొత్త ఓఎస్‌తో పాటు విండోస్ 11, విండోస్ 10 రెండింటికి ఉపయోగపడేలా కొత్త మైక్రోసాఫ్ట్ స్టోర్‌ను కూడా త్వరలోనే ప్రకటించనుంది. ఈ కొత్త యాప్ స్టోర్ మీకు ఉత్తమ యాప్స్‌ను అందిస్తుంది. అమెజాన్ యాప్‌స్టోర్, బ్రౌజర్ నుంచి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి కొత్త పాప్-అప్ స్టోర్‌ను కూడా చేర్చనుంది. యూజర్లు సులభంగా యాక్సెస్ చేసుకునేలా అనేక మార్పులను కూడా పరిచయం చేయనుంది.
JioPhone Next: జియో ఆవిష్కరించిన జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే
Realme X7 Max: రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ కొత్త వేరియంట్ వచ్చింది... ఈరోజే సేల్
యూజర్ల పిసి గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కూడా మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది. దీని కోసం ఆటో హెచ్‌డిఆర్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇది డైరెక్ట్‌ఎక్స్ 11, డైరెక్ట్‌ఎక్స్ 12 గేమ్స్‌కు హై డైనమిక్ రేంజ్ (హెచ్‌డిఆర్)ను జోడిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ గేమింగ్ కన్సోల్ ఫీచర్ అయిన డైరెక్ట్ స్టోరేజ్‌కు కూడా విండోస్ 11 మద్ధతిస్తుంది. ఈ ఫీచర్‌తో గేమ్ వేగంగా లోడ్ అవుతుంది. అంతేకాక, ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ యాప్ ద్వారా సులభంగా గేమ్స్ ఆస్వాదించవచ్చు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ గేమింగ్‌ను నేరుగా మీ పిసిలోని ఎక్స్‌బాక్స్ యాప్‌తో జోడించవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా EA ప్లే సభ్యత్వం పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Microsoft, Windows 11