హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Microsoft: మైక్రోసాఫ్ట్ నుంచి స్పెషల్​ క్రిస్మస్ స్వెటర్​ లాంఛ్​.. దీని​ ప్రత్యేకత ఏంటో తెలుసా? ​​

Microsoft: మైక్రోసాఫ్ట్ నుంచి స్పెషల్​ క్రిస్మస్ స్వెటర్​ లాంఛ్​.. దీని​ ప్రత్యేకత ఏంటో తెలుసా? ​​

మైక్రోసాఫ్ట్ నుంచి స్పెషల్​ క్రిస్మస్ స్వెటర్​ లాంఛ్​.. దీని​ ప్రత్యేకత ఏంటో తెలుసా?

మైక్రోసాఫ్ట్ నుంచి స్పెషల్​ క్రిస్మస్ స్వెటర్​ లాంఛ్​.. దీని​ ప్రత్యేకత ఏంటో తెలుసా?

మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ స్పెషల్​ క్రిస్మస్ స్వెటర్ లుక్​ పరంగా విచిత్రంగా కనిపిస్తుంది. ఇది కేవలం సింగిల్​ కలర్​ ఆప్షన్​లో లభిస్తుంది. అయితే భిన్నమైన సైజ్​లలో అందుబాటులో ఉంటుంది. స్మాల్, లార్జ్​, మీడియా, XXXL వెర్షన్‌లతో సహా ఆరు వేర్వేరు పరిమాణాల్లో మార్కెట్​లో లభిస్తుంది.

ఇంకా చదవండి ...

టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కేవలం ఐటీ ఆధారిత సేవలనే కాదు ఈ–కామర్స్ (E-Commerce)​ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. మైక్రోసాఫ్ట్ బ్రాండింగ్​తో ల్యాప్​టాప్​లు, హెమ్​ అప్లయెన్సెస్ ను​ ఉత్పత్తి చేస్తోంది. తాజాగా మరో అద్భుతమైన ప్రొడక్ట్​ను లాంచ్​ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. రాబోయే క్రిస్మస్ (Christmas)​ పండుగను దృష్టిలో పెట్టుకొని ఓ సరికొత్త స్వెటర్​ను ఆవిష్కరించింది. ‘మెన్స్​వీపర్​​ అగ్లీ’ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ స్పెషల్​ క్రిస్మస్ స్వెటర్ లుక్​ పరంగా విచిత్రంగా కనిపిస్తుంది. ఇది కేవలం సింగిల్​ కలర్​ ఆప్షన్​లో లభిస్తుంది. అయితే భిన్నమైన సైజ్​లలో అందుబాటులో ఉంటుంది. స్మాల్, లార్జ్​, మీడియా, XXXL వెర్షన్‌లతో సహా ఆరు వేర్వేరు పరిమాణాల్లో మార్కెట్​లో లభిస్తుంది.

దీని ధర విషయానికొస్తే, అమెరికన్​ మార్కెట్​లో ఈ మెన్స్​ స్వీపర్​ స్వెటర్​ $74.99 (సుమారుగా రూ. 5,600) ధర వద్ద లభిస్తుంది. అయితే అన్ని సైజుల్లోని స్వెటర్లకు ఒకే రకమైన ధర ఫిక్స్​ చేసింది. ఈ స్వెటర్‌ను రౌండ్ నెక్, చుట్టూ స్నోఫ్లేక్‌లతో కూడిన మైన్స్‌వీపర్ బ్లాక్‌లతో డిజైన్​ చేసింది. స్వెటర్​ మధ్య భాగంలో క్రిస్మస్ చెట్టు గల పిక్చర్​ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. స్వెటర్‌లో ఎడమవైపు క్లాసిక్ విండోస్ లోగో, కుడివైపు క్లోజ్ బటన్లను కూడా చేర్చింది.

వచ్చిన ఆదాయాన్ని స్వచ్చంద సంస్థకు విరాళం..

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ 1990 నుంచి ప్రతి ఏడాది క్రిస్టమస్​కు ఓ వినూత్న స్వెటర్​ను లాంచ్​ చేస్తుంది. వీటి సేల్స్​ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తుంది. గతేడాది ఎంఎస్​ పెయింట్- ఆధారిత ‘అగ్లీ క్రిస్మస్ స్వెటర్​ను లాంచ్​ చేసింది. గతేడాది ఈ స్వెటర్​ సేల్స్​ ద్వారా వచ్చిన ఆదాయంలో పెద్ద భాగాన్ని మైక్రోసాఫ్ట్ గర్ల్స్ హూ కోడ్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ గర్ట్స్​ హూ కోడ్​ ఫౌండేషన్​ కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసిస్తున్న యువతులకు సహాయం చేస్తుంది.

కాగా, ఈ ఏడాది వచ్చే ఆదాయంతో వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు అండగా నిలిచే అమెరికన్​ నాన్​ ప్రాఫిటబుల్ సంస్థ ఏబుల్​గేమర్స్​కి $100,000 విరాళంగా ఇవ్వనుంది. ‘మైన్స్వీపర్ అగ్లీ’ స్వెటర్ ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ షిప్పింగ్‌ను కూడా ప్రారంభించినట్లు కంపెనీ తెలియజేసింది. అమెరికన్లే కాకుండా ఇతర దేశంలోని వారు కూడా ఈ స్వెటర్‌ను బుక్​ చేసుకోవచ్చని తెలిపింది.

First published:

Tags: Christmas, Microsoft, WINTER

ఉత్తమ కథలు