హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

SwiftKey App: యాపిల్ iOS డివైజ్‌లలో స్విఫ్ట్‌కీ యాప్‌ సేవలు బంద్.. మైక్రోసాఫ్ట్‌ ప్రకటన.. వివరాలు ఇవే..

SwiftKey App: యాపిల్ iOS డివైజ్‌లలో స్విఫ్ట్‌కీ యాప్‌ సేవలు బంద్.. మైక్రోసాఫ్ట్‌ ప్రకటన.. వివరాలు ఇవే..

SwiftKey App: యాపిల్ iOS డివైజ్‌లలో స్విఫ్ట్‌కీ యాప్‌ సేవలు బంద్.. మైక్రోసాఫ్ట్‌ ప్రకటన.. వివరాలు ఇవే..

SwiftKey App: యాపిల్ iOS డివైజ్‌లలో స్విఫ్ట్‌కీ యాప్‌ సేవలు బంద్.. మైక్రోసాఫ్ట్‌ ప్రకటన.. వివరాలు ఇవే..

SwiftKey App: యాపిల్ iOS డివైజ్‌లకు మైక్రోసాఫ్ట్ కీబోర్డ్ యాప్ స్విఫ్ట్‌కీ(SwiftKey) సేవలు దూరం కానున్నాయి. చాలా కాలంగా SwiftKeyకి యాప్‌కు మైక్రోసాఫ్ట్ అప్‌డేట్స్‌ అందించడం లేదని, మెరుగైన ఫీచర్లు అందించడం లేదని యూజర్లు ఫిర్యాదు చేశారు. దీంతో మైక్రోసాఫ్ట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

డిజిటల్‌ యుగంలో దాదాపు అన్ని రకాల సేవలు అందించేందుకు యాప్‌ (Apps) లు అందుబాటులోకి వచ్చాయి. ఒకే రకమైన సేవలు అందిస్తున్న యాప్‌లు యూజర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతుంటాయి. లేటెస్ట్‌ ఫీచర్లు (New Features), సర్వీసులను అందిస్తుంటాయి. వీటిలో బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్న యాప్‌లకే డిమాండ్‌ ఉంటుంది. సరైన ఆదరణ అందుకోలేని యాప్‌లు, తమ సేవలను నిలిపివేస్తుంటాయి. తాజాగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌(Microsoft) కంపెనీ చేరింది. పాపులారిటీని చూసి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన ‘స్విఫ్ట్‌కీ’ యాప్‌ సేవలను iOS డివైజ్‌లలో నిలిపివేయనుంది.

* అప్‌డేట్స్‌ లేవని ఫిర్యాదులు

యాపిల్ iOS డివైజ్‌లకు మైక్రోసాఫ్ట్ కీబోర్డ్ యాప్ స్విఫ్ట్‌కీ(SwiftKey) సేవలు దూరం కానున్నాయి. దీనికి సంబంధించి ZDNet ఒక నివేదిక విడుదల చేసింది. చాలా కాలంగా SwiftKeyకి యాప్‌కు మైక్రోసాఫ్ట్ అప్‌డేట్స్‌ అందించడం లేదని, మెరుగైన ఫీచర్లు అందించడం లేదని యూజర్లు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ తాజా నిర్ణయం తీసుకుంది. 2022 అక్టోబర్ 5 నుంచి యాపిల్‌ స్టోర్(Apple Store) నుంచి యాప్‌ను తొలగిస్తున్నట్లు పేర్కొంది. కీబోర్డ్ యాప్‌ను ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకొన్నiOS యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు మాత్రం సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

* అక్టోబర్‌ 5న యాప్‌ స్టోర్‌ నుంచి తొలగింపు

యాప్‌ను తొలగించడంపై మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. ‘iOS డివైజ్‌లకు మైక్రోసాఫ్ట్‌ స్విఫ్ట్‌కీ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నాం. మా ప్రొడక్ట్‌కు వినియోగదారుగా ఉన్నందుకు ధన్యవాదాలు. యాప్ స్టోర్ నుంచి 2022 అక్టోబర్‌ 5న యాప్‌ను తొలగిస్తాం.’ అని స్పష్టం చేసింది. iOS డివైజ్‌లో స్విఫ్ట్‌కీ ఇన్‌స్టాల్ చేసిన కస్టమర్లు మాన్యువల్‌గా అన్ ‌ఇన్‌స్టాల్ చేసే వరకు, లేదా కొత్త డివైజ్‌ పొందే వరకు యాప్‌ పని చేస్తూనే ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి : అసలైన 5జీ అనుభూతిని అందిస్తాం... ఇదీ జియో వాగ్దానం

* భారీ ధరకు కొనుగోలు

iOS, Androidలో అత్యంత ప్రజాదరణ పొందిన కీబోర్డ్ యాప్‌లలో ఒకటిగా ఉన్న స్విఫ్ట్‌కీ ప్లాట్‌ఫారమ్‌ను మైక్రోసాఫ్ట్‌ 2016లో 250 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. స్విఫ్ట్‌కీ 2010లో ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు, 2014లో iOS డివైజ్‌లకు అందుబాటులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక సంవత్సరం పాటు iOSలో స్విఫ్ట్‌కీ యాప్‌ను అప్‌డేట్ చేయలేదని వినియోగదారులు ఫిర్యాదు చేశారు.

చివరిగా మేలో స్విఫ్ట్‌కీ ఆండ్రాయిడ్ యాప్‌కు కంపెనీ అప్‌డేట్‌ అందించింది. ఈ అప్‌డేట్‌టెక్స్ట్‌ను తొలగించడాన్ని సులభతరం చేసింది. విరామచిహ్నాల తర్వాత ఆటోమేటిక్ స్పేస్‌లను డిసేబుల్ చేసే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

* ఆండ్రాయిడ్‌ డివైజ్‌కు కొనసాగనున్న సేవలు

స్విఫ్ట్‌కీ యాప్‌కు ఆండ్రాయిడ్‌లో 500 మిలియన్ కంటే ఎక్కువ డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. అందుకే ఆండ్రాయిడ్ వినియోగదారులకు యాప్ సేవలు కొనసాగించాలని మైక్రోసాఫ్ట్‌ నిర్ణయించింది. పూర్తిగా ఆండ్రాయిడ్‌ డివైజెస్‌కు మెరుగైన స్విఫ్ట్‌కీ సేవలు అందించడంపై దృష్టి పెడుతామని స్విఫ్ట్‌కీ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ క్రిస్ వోల్ఫ్ ఓ ప్రకటనలో తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Iphone, Microsoft, Tech news

ఉత్తమ కథలు