న్యూస్ కోసం మైక్రోసాఫ్ట్ కొత్త యాప్

మైక్రోసాఫ్ట్ మరో కొత్త యాప్ రిలీజ్ చేసింది. మైక్రోసాఫ్ట్ న్యూస్ పేరుతో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ 10 కోసం ఈ యాప్ రూపొందించింది.

news18-telugu
Updated: June 28, 2018, 5:44 PM IST
న్యూస్ కోసం మైక్రోసాఫ్ట్ కొత్త యాప్
image: Reuters
  • Share this:
సరికొత్త న్యూస్ యాప్ తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్... యాపిల్, గూగుల్ సరసన నిలిచింది. ఇంతకుముందున్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో వార్తల్ని కొనసాగిస్తూనే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ న్యూస్ పేరుతో కొత్త యాప్ రిలీజ్ చేసింది. హెడ్‌లైన్స్, థంబ్‌నెయిల్ ఇమేజెస్‌తో న్యూస్ స్టోరీస్‌ని వేర్వేరుగా ఆర్గనైజ్ చేసింది. సులువుగా స్క్రోల్ చేస్తూ వార్తల్ని చదవడంతో పాటు పూర్తి ఆర్టికల్‌ని చదవొచ్చు. ఇక ఈ యాప్‌లో మరో స్పెషాలిటీ ఏంటంటే లైట్, డార్క్ థీమ్‌లో చదవడానికి ఏది కంఫర్ట్‌గా ఉంటే అది ఉపయోగించుకోవచ్చు. రాత్రివేళల్లో అయితే డార్క్ మోడ్ బాగుంటుంది.

పబ్లిషింగ్ పార్ట్‌నర్స్, ఎడిటర్స్, ఏఐల సాయంతో న్యూస్‌ని పర్యవేక్షిస్తున్నామని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో వివరించింది. రోజుకు లక్షకుపైగా వార్తల్ని స్కాన్ చేసి టాపిక్, కేటగిరీ, పాపులారిటీ అని వేర్వేరుగా విభజించే సామర్థ్యం మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఏఐకి ఉంది. ఆ తర్వాత ఎడిటర్లు టాప్ స్టోరీస్‌ని ఎంచుకొని, సరైన ఫోటోలతో పబ్లిష్ చేస్తారు. ఒక్కసారి యాప్‌లో స్టోరీ పబ్లిష్ అయిన తర్వాత యూజర్లు చదవొచ్చు. వార్తల్లోని టాపిక్స్‌ని తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్‌ని అలర్ట్స్‌గా పొందేలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. పబ్లిషింగ్ పార్ట్‌నర్స్ మైక్రోసాఫ్ట్ న్యూస్ యాప్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశముంది. పబ్లిషర్లు నాణ్యమైన, విశ్వసనీయమైన వార్తల్ని అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

First published: June 22, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు