Home /News /technology /

MICROSOFT CONFIRMS PLANS TO BUY TIKTOK IN US BY SEPTEMBER 15 SK

Tik Tok: టిక్ టాక్ కొనుగోలుపై మైక్రోసాప్ట్ కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలో టిక్ టాక్ యాప్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. టిక్‌టాక్‌, వీచాట్‌ సహా చైనాకు చెందిన అనేక యాప్‌లు అమెరికా పౌరుల ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారాయని అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో ఇటీవల ఆరోపించారు.

ఇంకా చదవండి ...
  భారత్‌లో నిషేధానికి గురై .. అమెరికాలో నిషేధపు అంచుల్లో ఉన్న టిక్ టాక్‌పై  టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కన్నేసింది. టిక్ టాక్‌ను కొనుగోలు చేసేందుకు దాని మాతృసంస్థ బైట్ డాన్స్‌లో మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఐతే అమెరికాలో టిక్ టాక్‌ను నిషేధిస్తామని డొనాల్ట్ డ్రంప్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. ఆయనతో మైక్రోసాఫ్ట్ సీఈవో సద్య నాదెళ్ల సమావేశహయ్యారు. టిక్ టాక్ భద్రతపై వ్యక్తమవుతున్న అనుమానాలపై ట్రంప్‌తో చర్చించారు. టిక్ టాక్ యాప్‌ పనితీరు, భధ్రత, కొనుగోలు ఒప్పందంంపై విస్తృతంగా చర్చించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

  అమెరికా అధ్యక్షుడి ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని, వాటన్నింటికీ సరైన పరిష్కారం లభించే విధంగానే కొనుగోలు ఒప్పందం ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సైతం ప్రయోజనాలు అందేలా ఈ ఒప్పందం ఉంటుందని ట్రంప్‌కు హామీ ఇచ్చింది. వాటాల కోసం ఇతర సంస్థలను సైతం ఆహ్వాస్తామని తెలిపింది. ఇక అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ టిక్ టాక్ యాప్‌ కార్యకలాపాల్ని సొంతం చేసుకునేందుకు యోచిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ మేరకు బైట్‌డ్యాన్స్‌తో జరుపుతున్న చర్చలు జరుపుతున్నామని, సెప్టెంబరు 15 నాటికి స్పష్టత వస్తుందని పేర్కొంది.


  అమెరికాలో టిక్ టాక్ యాప్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. టిక్‌టాక్‌, వీచాట్‌ సహా చైనాకు చెందిన అనేక యాప్‌లు అమెరికా పౌరుల ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారాయని అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో ఇటీవల ఆరోపించారు. వినియోగదారుల ఫోన్‌నెంబర్లు, చిరునామా, పరిచయాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నాయని విమర్శించారు.


  అంతేకాదు టిక్ టాక్ యాప్ ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటుదేమోనని.. ట్రంప్‌ను ఓడించేందుకు కుట్రలు జరగవచ్చని రిపబ్లిక్ పార్టీకి చెందిన ఏడురుగు సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమగ్రత, భద్రత విఘాతం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జాక్‌ రాట్‌క్లిఫె, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌ క్రిష్టోఫర్‌ రే, హోంల్యాండ్‌ సెక్యూరిటీ తాత్కాలిక సెక్రటరీ చాంద్‌ వూల్ఫ్‌కు లేఖ రాశారు.

  భారత్ తరహాలోనే ఇక్కడ కూడా టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. చైనా యాప్స్‌ని అస్సలు నమ్మలేమని.. ఆ యాప్స్ ద్వారా అమెరికాలో చైనా కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం చేస్తోందని విమర్శిస్తున్నారు. దేశ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని అమెరికాలో టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ 25 మంది కాంగ్రెస్ సభ్యులు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు. టిక్ టాక్‌ను బ్యాన్ చేయడం ద్వారా చైనా కమ్యూనిస్ట్ పార్టీ గూఢచర్యాన్ని అడ్డుకోవాలని తమ లేఖలో వారు కోరారు.

  ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఐతే ఆ యాప్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న మైక్రోసాప్ట్ ట్రంప్ ప్రకటనతో అప్రమత్తమైంది. యాప్ భద్రత విషయంలో అధ్యక్షుడికి భరోసా ఇచ్చి, నిషేధం ఆలోచనలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

  కాగా, టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను జూన్‌లో భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్‌ను దేశంలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: America, Donald trump, Microsoft, Technology, Tik tok, Tiktok

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు