Satya Nadella : ఇండియా వస్తున్న సత్యనాదెళ్ల... మైక్రోసాఫ్ట్ ఆసక్తికర ప్రకటన

Microsoft CEO Satya Nadella : అందరికీ తెలుసు... సత్య నాదెళ్ల భారతీయుడని. కానీ ఆయన బిజీ పనుల వల్ల ఎప్పుడోగానీ ఇండియా రారు. మరి ఈసారి ఎందుకొస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది అత్యంత కీలక పర్యటనగా తెలిసింది.

news18-telugu
Updated: February 14, 2020, 3:02 PM IST
Satya Nadella : ఇండియా వస్తున్న సత్యనాదెళ్ల... మైక్రోసాఫ్ట్ ఆసక్తికర ప్రకటన
Satya Nadella : ఇండియా వస్తున్న సత్యనాదెళ్ల... మైక్రోసాఫ్ట్ ఆసక్తికర ప్రకటన
  • Share this:
Microsoft CEO Satya Nadella : ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి వాటిల్లో భారతీయులే సీఈఓలుగా ఉంటున్నారు. అందువల్ల వాళ్లు ఇండియాలో తమ సంస్థల్ని విస్తరించేందుకు ఉన్న అపూర్వ అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికే గూగుల్ ఈ దిశగా దూసుకుపోతుంటే... తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైతం ఇటే అడుగులు వేస్తున్నారు. ఈనెల 24 నుంచి 26 మధ్య ఆయన ఇండియాలో పర్యటించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడో కీలక అంశం ఉంది. సరిగ్గా సత్యనాదెళ్ల వస్తున్నప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇండియా పర్యటనకు వస్తున్నారు. ఫిబ్రవరి 24, 25న ఆయన ఇండియాలో ఉంటారు. ఈ సమయంలో సత్యనాదెళ్ల ఎందుకు వస్తున్నారన్నది ప్రశ్నైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టాన్ని సత్యనాదెళ్ల వ్యతిరేకించారు. తద్వారా ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఆయన ఇండియాకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇండియాలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులతో సత్య నాదెళ్ల మాట్లాడుతారని, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఆయన ఏయే నగరాలకు వెళతారన్న విషయాన్ని మాత్రం అధికారికంగా చెప్పలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో తిరుగుతారనీ..., కొందరు ప్రభుత్వ నేతలు, అధికారులతో సమావేశం అవుతారని మైక్రోసాఫ్ట్ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టీ... మెట్రో నగరాల్లో... ముఖ్యంగా ఐటీ విస్తరించిన బెంగళూరుపై సత్యనాదెళ్ల ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని అనుకోవచ్చు.

నిజానికి సత్య నాదెళ్ల... కేంద్ర పౌరసత్వ చట్టాన్ని (CAA)ని స్వాగతించి ఉంటే... ఆయనకు కేంద్ర వర్గాల నుంచీ కావాల్సినంత సపోర్ట్ వచ్చేది. ఆయన వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల కేంద్ర వర్గాల నుంచీ కావాల్సిన సపోర్ట్ అందదని అంటున్నారు. కేంద్రం సహకరించకపోయినా పర్వాలేదని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే... మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇండియా అతి పెద్ద మార్కెట్. పైగా సత్యనాదెళ్ల హైదరాబాద్‌కి చెందిన వారు కావడం వల్ల... ఇక్కడే అమెరికా తర్వాత అతి పెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ నెలకొల్పారు. ఇండియాలో యాపిల్ కంటే మైక్రోసాఫ్ట్ వాడకమే ఎక్కువ. అందువల్ల ఇక్కడ విస్తరించేందుకు ఉన్న అన్ని అవకాశాల్నీ మైక్రోసాప్ట్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు.

తాజా పర్యటనలో సత్య నాదెళ్ల... ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవబోతున్నారని తెలిసింది. ఐతే... ప్రధాని మోదీ... ఆ టైంలో... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉండే అవకాశాలున్నాయి. మరి సత్యనాదెళ్లకు ఛాన్స్ ఇస్తారా అన్నది తేలాల్సిన అంశం. ఒకవేళ కలిస్తే మాత్రం... సత్య నాదెళ్లకూ బీజేపీకీ మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశాలున్నాయి.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు