హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Windows Update: విండోస్ 11 ఓల్డ్‌ వెర్షన్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్‌.. ఫుల్‌ డీటైల్స్‌ ఇలా..

Windows Update: విండోస్ 11 ఓల్డ్‌ వెర్షన్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్‌.. ఫుల్‌ డీటైల్స్‌ ఇలా..

Windows Update: విండోస్ 11 ఓల్డ్‌ వెర్షన్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్‌..

Windows Update: విండోస్ 11 ఓల్డ్‌ వెర్షన్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్‌..

Windows Update: 2023 జనవరి 30 నుంచి విండోస్‌ 11(Windows 11) ఒరిజినల్ వెర్షన్‌ వినియోగిస్తున్న డివైజ్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ చేస్తామని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రకటించింది. 21H2 వెర్షన్‌ 22H2 లేదా 2022 అప్‌డేట్‌కి మారుతుందని తెలిపింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కంప్యూటర్‌ యూజర్లు విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌నే వినియోగిస్తుంటారు. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) కంపెనీ యూజర్‌ ఫ్రెండ్లీగా ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించి. వినియోగదారుల ప్రొటెక్షన్‌, సెక్యూరిటీ కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్‌లను అందిస్తోంది. తాజాగా 2023 జనవరి 30 నుంచి విండోస్‌ 11(Windows 11) ఒరిజినల్ వెర్షన్‌ వినియోగిస్తున్న డివైజ్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ చేస్తామని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రకటించింది. 21H2 వెర్షన్‌ 22H2 లేదా 2022 అప్‌డేట్‌కి మారుతుందని తెలిపింది. విండోస్‌ 11 పర్సనల్‌, కార్పొరేట్ వెర్షన్‌, హోమ్, ప్రో వెర్షన్‌లు ఉపయోగిస్తున్న అన్ని పర్సనల్‌ కంప్యూటర్స్‌లో ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ ప్రాసెస్‌ జరుగుతుందని పేర్కొంది.

* కొత్త విండోస్‌ 11 అప్‌డేట్‌తో మరింత ప్రొటెక్షన్‌

మైక్రోసాఫ్ట్‌ ఆటో అప్‌డేట్ గురించి విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. విండోస్‌ 11 ఆటో-అప్‌డేట్ ద్వారా వినియోగదారులకు మరింత ప్రొటెక్షన్‌, ప్రొడక్టివిటీ లభిస్తుంది. విండోస్‌ 10 మాదిరిగానే, విండోస్‌ 11కి కూడా ఆటో-అప్‌డేట్ ఫీచర్‌ అమలు చేస్తున్నాం. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ నుంచి, ఆటోమేటిక్‌ అప్‌డేట్‌లు అందిస్తూ విండోస్‌ యూజర్లు ఎప్పటికప్పుడు సెక్యూర్‌గా ఉండేందుకు కృషి చేస్తున్నాం.

జనవరి 30న విండోస్‌ 11, వెర్షన్ 21H2 హోమ్, ప్రో ఎడిషన్‌లను వినియోగిస్తున్న కన్స్యూమర్‌, నాన్‌ మేనేజ్డ్‌ బిజినెస్‌ డివైజ్‌లను విండోస్‌ 11, వెర్షన్ 22H2కి ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ చేస్తున్నాం. విండోస్‌ 11, వెర్షన్ 22H2పై కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌, విశ్లేషణ పాజిటివ్‌గా ఉందని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది.

* విండోస్‌ 11 22H2 మ్యానువల్‌గా డౌన్‌లోడ్‌ చేసుకునే ఆప్షన్‌

కొత్త విండోస్‌ 11 అప్‌డేట్‌ వినియోగదారులకు ఆటోమేటిక్‌గా అందుతున్నా.. ఒరిజినల్‌ వెర్షన్‌ ఉపయోగిస్తున్న యూజర్లకు ప్రాధాన్యం ఉంటుంది. చాలా కాలం పాటు వెర్షన్ 21H2ని ఉపయోగిస్తున్న డివైజ్‌లతో విండోస్‌ 11, వెర్షన్ 22H2కి ఆటోమేటిక్ అప్‌డేట్ ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి : లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. ఫిబ్రవరిలో లాంచ్‌ అవుతున్న టాప్‌ మోడల్స్‌ ఇవే!

కొత్త అప్‌డేట్‌ను త్వరగా ఎక్స్‌పీరియన్ష్‌ చేయాలని భావిస్తున్నవారు.. ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. పాత వెర్షన్లను ఉపయోగిస్తున్న వినియోగదారులు విండోస్ అప్‌డేట్ ద్వారా 22H2 అప్‌డేట్‌ను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌తెలిపింది. చెక్‌ ఫర్‌ అప్‌డేట్స్‌(Check For Updates) ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే అప్‌డేట్‌ అందుబాటులో ఉందా? లేదా? అనే విషయం తెలుస్తుంది. సిస్టమ్ సపోర్ట్‌ చేస్తుంటే అందుబాటులో ఉన్న డౌన్‌లోడ్‌లను చూపుతుంది.

* నోట్‌ప్యాడ్‌(Notepad)లో ట్యాబ్‌లు

మైక్రోసాఫ్ట్‌ కొత్త విండోస్‌ అప్‌డేట్‌ మాత్రమే కాకుండా టెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ నోట్‌ప్యాడ్‌ను కూడా కొత్తగా ఇంట్రడ్యూస్‌ చేసింది. నోట్‌ప్యాడ్‌లో ట్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నోట్‌ప్యాడ్ వినియోగదారులు ఇప్పుడు ఒకే విండోలో మల్టిపుల్‌ టెక్స్ట్ ఫైల్స్‌(Multipul Text Files)తో పని చేయవచ్చు.

First published:

Tags: Microsoft, Tech news, Windows 11

ఉత్తమ కథలు