కొన్ని వారాలుగా మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ వరుసగా కొత్త ఇన్నొవేషన్స్ లాంచ్ చేస్తోంది. చాట్‌జిపిటిని రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ OpenAIకి మైక్రోసాఫ్ట్ భారీగా ఆర్థిక సహకారం అందించిన విషయం తెలిసిందే. చాట్‌జిపిటి (ChatGpt) లాంచ్ అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఏఐ పవర్డ్ ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే లేటెస్ట్ బింగ్ సెర్చ్ ఇంజిన్, ఎడ్జ్ బ్రైజర్, ఇతర అప్లికేషన్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఈ నెల ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్‌ను ఆవిష్కరించింది. కంపెనీ ప్రొడక్టివిటీ టూల్స్‌ను వేగవంతం చేసే లక్ష్యంతో కోపైలెట్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ లూప్‌ను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ అప్లికేషన్ పూర్తి వివరాలు పరిశీలిద్దాం.
* మైక్రోసాఫ్ట్ లూప్ అంటే ఏంటి?
మైక్రోసాఫ్ట్ 2021 నవంబర్‌లో మొదటిసారిగా లూప్ గురించి ప్రస్తావించింది. మైక్రోసాఫ్ట్ లూప్‌లో ప్రధానంగా లూప్ కాంపోనెంట్స్, లూప్ పేజెస్, లూప్ వర్క్ స్పేసెస్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి మల్టిపుల్ ప్లాట్‌ఫారంలలో ఉంటే లైవ్ కంటెంట్‌ను అందిస్తాయి. మైక్రోసాఫ్ట్ లూప్ ప్రాజెక్ట్ టీమ్‌కి అవసరమైన అన్ని టూల్స్, డాక్యుమెంట్‌లు, ఫైల్‌లు, లింక్‌లను ఒక చోట చేరుస్తుంది.
ప్రాజెక్ట్ కోసం అవసరమైన ప్రతిదాన్ని ఒకే వర్క్‌స్పేస్‌గా నిర్వహించడంలో సహాయపడుతుంది. వర్క్‌స్పేస్‌ని ప్రారంభించే ముందు సెర్చింగ్‌లో కూడా సాయం చేస్తుంది. వర్క్‌స్పేస్ టైటిల్, ఏదైనా ఇతర కీవర్డ్స్‌ను జోడించడం ద్వారా ప్రాజెక్ట్‌కి సంబంధించి వర్క్‌స్పేస్‌కి యాడ్ చేయాల్సిన వాటిని సూచిస్తుంది. వర్క్‌స్పేస్‌కి ఏవి యాడ్ చేయాలో, క్రియేట్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. సులభంగా వీక్షించగలిగే పేజీలుగా కంటెంట్ ఆర్గనైజ్ అవుతుంది.
* ప్రాజెక్ట్‌లను సులువుగా ట్రాక్ చేయవచ్చు
ప్రాజెక్ట్‌లు ప్రతి ఒక్కరూ ట్రాక్ చేయగల దానికంటే వేగంగా కదులుతాయి. మైక్రోసాఫ్ట్ లూప్ ఈ సమస్యను దాని సౌకర్యవంతమైన వర్క్‌స్పేసెస్‌తో పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ టీమ్‌కు సహాయం చేస్తుంది. టెంప్లేట్‌లు కొత్త పేజీలను సులభంగా స్టార్ చేసే అవకాశం కల్పిస్తుంది. సులభమైన డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్స్ వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా వారి వర్క్‌స్పేస్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తాయి. టీమ్ సభ్యులు వర్క్‌స్పేస్‌లోకి లేబుల్స్, టేబుల్స్ లేదా ఎమోజీలు వంటి ఫన్ థింగ్స్‌ని యాడ్ చేయడానికి లూప్ ఇన్‌సర్ట్ మెనుని ఉపయోగించవచ్చు. లూప్ పేజీలోని దేన్నైనా కాంపోనెంట్‌గా మార్చవచ్చు, అది ఇతర Microsoft 365 యాప్‌లలో షేర్ అవుతుంది.
ఐవోఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో మైక్రోసాఫ్ట్ లూప్ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌లో యాప్ ‘ఎర్లీ యాక్సెస్’ కింద ఉంది. అంటే యాప్ ఇంకా టెస్టింగ్ ఫేజ్‌లో ఉంది. డెస్క్‌టాప్, మొబైల్ యాప్‌లు రెండూ నోటిఫికేషన్ ఫీడ్‌ను కలిగి ఉంటాయి. ఇవి మెన్షన్స్, అసైన్డ్ టాస్క్‌లు, రిప్లైలను మిస్ కాకుండా సహాయపడతాయి.
ఇది కూడా చదవండి : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఈ ప్లాన్స్‌తో అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ ఫ్రీ..!
* కాంపోనెంట్స్ బెనిఫిట్స్
మైక్రోసాఫ్ట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో లూప్ వర్క్‌స్పేస్, లూప్ పేజ్, లూప్ కాంపోనెంట్స్‌ను ఇలా వివరించింది.
లూప్ కాంపోనెంట్: ఇక్కడే వినియోగదారులు వర్క్‌ఫ్లోకి కొలాబరేట్ చేయగలరు. లూప్ పేజీలో లేదా చాట్, ఇమెయిల్, మీటింగ్ లేదా డాక్యుమెంట్‌లో డైనమిక్స్ 365 నుంచి లిస్ట్, టేబుల్, నోట్స్, కస్టమర్ సేల్స్ ఆపర్చునిటీస్‌పై కూడా కలిసి పని చేయగలుగుతారు.
లూప్ వర్క్‌స్పేస్: అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. లూప్ వర్క్‌స్పేస్ వినియోగదారులను అన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్ ఎలిమెంట్‌లను ఒక్కచోట చేర్చడానికి, ప్రతి ఒక్కరూ ఏమి పని చేస్తున్నారో చూడటానికి, భాగస్వామ్య లక్ష్యాలపై డెవలప్‌మెంట్ ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
లూప్ పేజ్: వినియోగదారులు ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన లూప్ కాంపోనెంట్స్‌ను, లూప్ పేజీలలోని లింక్‌లు, ఫైల్‌లు, డేటా వంటి వాటిని మేనేజ్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Microsoft, New features, Tech news