Bing AI Stories: మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ టెక్ వరల్డ్‌లో ముందంజలో ఉండటానికి కొత్త సేవలను ప్రారంభిస్తూ, వారికి యూజర్లకు చేరువ చేస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న నేపథ్యంలో.. మైక్రోసాఫ్ట్ తమ యూజర్స్‌కి AI సేవలను అందించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం బింగ్ బ్రౌజర్ (Bing Browser) ఏఐ చాట్‌బాట్‌ను పరిచయం చేసింది. అలాగే తాజాగా Bing సెర్చ్ ఇంజన్‌లో AI-జనరేటెడ్ స్టోరీస్(AI-generated stories)ని జోడించింది. ఈ కొత్త ఫీచర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ప్రస్తుతం కొందరికి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ మరి కొద్ది రోజుల్లో చాలామందికి అందుబాటులోకి వస్తుంది. దీని బెనిఫిట్స్ తెలుసుకుందాం.
కొత్త ఫీచర్‌తో Bing ఇప్పుడు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జపనీస్, జర్మన్, స్పానిష్, రష్యన్‌తో పాటు మరికొన్ని భాషలు, ఫార్మాట్లలో AI జనరేట్ చేసిన స్టోరీస్‌ని యూజర్లకు అందిస్తుందని Microsoft ప్రకటించింది. ఈ కథనాలు లేదా స్టోరీస్ ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కనిపించినట్లే కనిపిస్తాయి. ఇప్పుడు బింగ్‌లో ఏదైనా అంశం కోసం సెర్చ్ చేసినప్పుడు వాటి గురించి చిన్న మల్టీమీడియా ప్రెజెంటేషన్లు కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ ప్రెజెంటేషన్లు క్రియేట్ అవుతాయి. సెర్చ్ చేసిన అంశం గురించి యూజర్లు సులభంగా అర్థం చేసుకునేలా సమాచారాన్ని అందించాలని కంపెనీ వీటిని పరిచయం చేసింది.
ఇక తదుపరి స్లయిడ్‌కు వెళ్లే ముందు స్టోరీస్ అనేవి పైన ప్రోగ్రెస్ బార్‌తో వస్తాయి. స్టోరీస్‌లో టెక్స్ట్, ఇమేజెస్, వీడియో, ఆడియో కంటెంట్ కనిపిస్తుంది. ఫలితంగా విజువల్, ఆడియో రూపంలో నాలెడ్జ్ పెంచుకునే వారికి కొత్త స్టోరీస్ ఉత్తమంగా నిలుస్తాయి. ఆసక్తి ఉన్న అంశాలను అన్వేషించడాన్ని యూజర్లకు మరింత సులభతరం చేసేందుకు బింగ్ 'నాలెడ్జ్ కార్డ్స్ (Knowledge Cards)ను' కూడా అప్‌గ్రేడ్ చేస్తోంది. నాలెడ్జ్ కార్డ్స్ ట్యాబ్ అనేది Bing సెర్చ్ రిజల్ట్స్ పేజీకి కుడి వైపున కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యాక్ట్స్, టైమ్‌లైన్స్, పోల్స్, రిలేటెడ్ టాపిక్స్ వంటి మరింత సమాచారాన్ని వినియోగదారులకు అందించడానికి AIని కంపెనీ వినియోగిస్తోంది. మెరుగుపరిచిన వెర్షన్‌కు 2.0 అని కంపెనీ పేరు పెట్టింది.
GPT-4: జీపీటీ-4ని ఫ్రీగా ఉపయోగించే ఆప్షన్స్.. సింపుల్ హ్యాక్స్, టిప్స్ మీకోసం..
iOSలో Bing చాట్ నుంచి టెక్స్ట్‌ను కాపీ చేయడంలో సమస్యను పరిష్కరించింది. కంపెనీ బింగ్ మొబైల్ యాప్‌లో బింగ్ చాట్, వాయిస్ డిటెక్షన్‌ను కూడా మెరుగుపరుస్తోంది. దీనివల్ల యూజర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పూర్తి ప్రశ్నను వాయిస్ ద్వారా అడగటం సాధ్యమవుతుంది. బింగ్ సెర్చ్ ఇంజన్‌ను గూగుల్‌కి బలమైన పోటీగా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ సాధ్యమైనన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ వారం ప్రారంభంలో కంపెనీ కొత్త బింగ్ ప్రివ్యూకి బింగ్ ఇమేజ్ క్రియేటర్‌ని జోడించింది. ఈ ఫీచర్ ప్రస్తుతం క్రియేటివ్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Artificial intelligence, Microsoft