హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Micromax Smartphone: మైక్రోమాక్స్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 5,000mAh బ్యాటరీతో లాంచ్ అయిన కొత్త ఫోన్..

Micromax Smartphone: మైక్రోమాక్స్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 5,000mAh బ్యాటరీతో లాంచ్ అయిన కొత్త ఫోన్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమాక్స్ నుంచి మరో కొత్త ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. మైక్రోమాక్స్ ఇన్‌ 2c (Micromax IN 2c) పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్‌ను కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది.

మొబైల్(Mobile) తయారీ కంపెనీ మైక్రోమాక్స్(Micromax) నుంచి మరో కొత్త ఫోన్(New Phone) ఇండియన్ మార్కెట్లోకి (Indian Market)రిలీజ్ అయింది. మైక్రోమాక్స్ ఇన్‌ 2c (Micromax IN 2c) పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్‌ను(Budget Phone) కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది. మైక్రోమాక్స్ తాజా IN సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో బడ్జెట్ డివైజ్ యూజర్లను(Users) లక్ష్యంగా చేసుకుంది. మైక్రోమ్యాక్స్ IN 2c వేరియంట్.. Android 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది మంచి సామర్థ్యం ఉన్న బ్యాటరీతో(Battery) వస్తుంది. USB టైప్ C పోర్ట్ ద్వారా ఛార్జింగ్‌కు సపోర్ట్(Charging Support) చేస్తుంది. ఈ కొత్త మోడల్‌తో మైక్రోమ్యాక్స్ తన బడ్జెట్ లైనప్‌ను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. ఈ కంపెనీ నుంచి గత సంవత్సరం విడుదలైన మైక్రోమాక్స్ IN 2b స్మార్ట్‌ఫోన్‌కు కొత్త IN 2c మోడల్ సక్సెసర్‌గా రానుంది. ఈ డివైజ్ ఒకే వేరియంట్‌లో, తక్కువ ధరకే లభిస్తుంది.

Upcoming Cars: హోండా సిటీ హైబ్రిడ్ నుంచి జీప్ మెరిడియన్ వరకు.. మే నెలలో విడుదల కానున్న కార్లు ఇవే..


* మైక్రోమాక్స్ IN 2c ధర

ఇండియాలో మైక్రోమాక్స్ IN 2c స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,499గా ఉంది. ఇది 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో సేల్‌కు అందుబాటులోకి తీసుకురానుంది. మే 1 నుంచి ఆన్‌లైన్‌లో ఇది రూ.7,499 ప్రారంభ ధరకు అందుబాటులోకి రానుంది. మైక్రోమాక్స్ IN 2c.. సిల్వర్, బ్రౌన్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

* స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు

మైక్రోమ్యాక్స్ IN 2c ఫోన్ 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 420 నిట్స్ బ్రైట్‌నెస్, 89 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోను అందించే 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లేతో రానుంది. ఈ ఫోన్ 3GB RAMతో Unisoc T610 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ దీని సొంతం. మైక్రో SD కార్డ్ స్లాట్‌ ఉపయోగించి స్టోరేజ్‌ను పొడిగించుకోవచ్చు. ఇది పాత ఆండ్రాయిడ్ 11 OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మైక్రోమ్యాక్స్ ఈ సంవత్సరం తాజా డివైజ్‌కు ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను అందిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే

ఆప్టిక్స్ వివరాలు చూస్తే.. మైక్రోమ్యాక్స్ IN 2c డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది VGA సెన్సార్‌తో పాటు 8-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 5-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో ఫోన్ వస్తుంది. మైక్రోమ్యాక్స్ IN 2c 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది రెగ్యులర్ ఛార్జింగ్ స్పీడ్‌ను అందిస్తుంది. USB టైప్ C ఇంటర్‌ఫేస్ ద్వారా రన్ అవుతుంది. ఈ ధర పరిధిలో చూస్తే.. మైక్రోమాక్స్ IN 2c ఫోన్, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రియల్‌మీ C సిరీస్, రియల్‌మీ నార్జో, రెడ్‌మీ 10A స్మార్ట్‌ఫోన్ వంటి డివైజ్‌లతో పోటీపడనుంది.

Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Budget, Micromax, Smart phones

ఉత్తమ కథలు