Micromax In 2b: మైక్రోమాక్స్ నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. ధర రూ. 7,999 మాత్రమే.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

మైక్రోమాక్స్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ విడుదలైంది. ఈ ఫోన్ కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ మైక్రోమాక్స్ ఈ రోజు Micromax In 2b మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఏడాది క్రితం సంస్థ నుంచి Micromax In 1b విడుదలైంది. ఈ మొబైల్ ఫ్లిప్ కార్ట్ తో పాటు మైక్రోమాక్స్ వెబ్ సైట్ ద్వారా మూడు కలర్ ఆప్షన్లతో పాటు రెండు స్టోరేజ్ మోడల్ లలో లభించనుంది. వచ్చే నెల ప్రారంభం నుంచి ఈ మొబైల్ కొనుగోలుకు సిద్ధంగా ఉండనుంది. ఈ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరాలను కలిగి ఉండనుంది. ఇంకా Unisoc చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఇంకా 5000 mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ తో పాటు మైక్రోమాక్స్ AirFunk 1, AirFunk 1 Pro ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది.
    Apple iPhone: ఐఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త వెర్షన్‌‌పై కేంద్రం కీలక ప్రకటన
    Google Pixel 5a: త్వరలోనే గూగుల్ పిక్సెల్ 5a స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్... లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్స్

    ఇంకా Micromax In 2b స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 6.52 HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యుయల్ సిమ్ కార్డులను వాడుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ Android 11 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఈ ఫోన్లోని ప్రాసెసర్  Micromax In 1b మోడల్ కన్నా 70 శాతం ఫాస్ట్ గా పని చేస్తుందని సంస్థ తెలిపింది. ఇంకా ఈ ఫోన్ 4జీబీ, 6జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.

    రేర్ కెమెరా 13 MP కాగా, ఫ్రంట్ కెమెరా 5ఎంపీ. ఇంకా 10W ఛార్జర్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 4GB RAM + 64GB మోడల్ ధర రూ. 7,999 కాగా.. 6GB + 64GB వేరియింట్ ధర రూ.8,999. ఈ ఫోన్ మొదటి సేల్ ను ఆగస్టు 6న నిర్వహించనున్నారు. ఈ ఫోన్ Samsung Galaxy M01, Realme C11 తదితర బడ్జెట్ ఫోన్లకు పోటీగా మారుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published: