హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Micromax In 2b: మైక్రోమ్యాక్స్‌ ఇన్​ 2బీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​.. బడ్జెట్​ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

Micromax In 2b: మైక్రోమ్యాక్స్‌ ఇన్​ 2బీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​.. బడ్జెట్​ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మైక్రోమ్యాక్స్‌.. ఇప్పుడు మరోసారి స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇన్ 2 బి పేరుతో బడ్జెట్​ ఫోన్​ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్​ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మైక్రోమ్యాక్స్ వెబ్​సైట్ల​ ద్వారా అమ్మకానికి రానుంది.

ఇంకా చదవండి ...

భారతీయ మొబైల్​ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ ఒకప్పుడు టాప్​ బ్రాండ్​గా హవా కొనసాగించింది. అయితే, విదేశీ స్మార్ట్​ఫోన్ల రాకతో వీటి అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో, స్మార్ట్​ఫోన్​ మార్కెట్​కు కొంతకాలం దూరంగా ఉన్న మైక్రోమ్యాక్స్‌.. ఇప్పుడు మరోసారి స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇన్ 2 బి పేరుతో బడ్జెట్​ ఫోన్​ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్​ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మైక్రోమ్యాక్స్ వెబ్​సైట్ల​ ద్వారా అమ్మకానికి రానుంది. మొత్తం మూడు కలర్​ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్​ రెండు స్టోరేజ్ మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. గతేడాది విడుదలైన మైక్రోమ్యాక్స్​ ఇన్​​1బీ మోడల్​కు కొనసాగింపుగా దీన్ని రూపొందించింది. ఇది ‘నో హ్యాంగ్​ ఫోన్’​ అని సంస్థ చెబుతోంది.

ధర, స్పెసిఫికేషన్లు

మైక్రోమ్యాక్స్‌ ఇన్​ 2బీ స్మార్ట్​ఫోన్​ 6.52 ఇంచెస్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ యూనిసాక్​ టీ 610 ఆక్టాకోర్​ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది మొత్తం 4జి, 6 జీబీ ర్యామ్​ గల రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇక, 64 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డు సహాయంతో దీన్ని 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. దీనిలోని మీడియా టెక్​ హీలియో G35 చిప్‌సెట్‌ 70 శాతం వేగంగా పనిచేస్తుంది. ఇక, కెమెరాల విషయానికి వస్తే.. దీనిలో డ్యుయల్​ కెమెరా సెటప్​ను అందించింది. దీని వెనుక భాగంలో13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ AI కెమెరాలను చేర్చింది.


ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం ప్రత్యేకంగా 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను అందించింది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2 బీలోని కెమెరా యాప్‌లో ఫుల్-హెచ్‌డి వీడియో రికార్డింగ్, ఆటో హెచ్‌డిఆర్, నైట్ మోడ్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్, లైవ్ ఫోటో వంటి ఫీచర్లు పొందవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. దీనిలో Wi-Fi, 4G, ఫేస్ అన్‌లాక్, రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ v5.0 వంటివి అందించింది. మరోవైపు, 10W ఛార్జర్‌ సపోర్ట్​ గల 5,000mAh బ్యాటరీని చేర్చింది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2b 4GB RAM + 64GB వేరియంట్​ రూ .7,999 ధర వద్ద లభిస్తుంది. ఇక, 6GB + 64GB వేరియంట్​ రూ .8,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

First published:

Tags: Micromax, Smartphones

ఉత్తమ కథలు